గద్దర్ సినీ పురస్కారాలు-పూర్తి సమాచారం (For Competitive Exams)-Gaddar Awards 2024:

- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని (2024 )ఏప్రిల్ 29 న హైదరాబాద్ లో ప్రకటించారు.
- 2024 కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ‘ ఎంపికైంది.
- ‘పుష్ప 2’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి పురస్కారం దక్కింది.
- ’35 – చిన్న కథ కాదు’లో నటనకుగానూ ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు.
- కల్కి 2898 ఏడీ, లక్కీ భాస్కర్ చిత్రాలు 4 చొప్పున పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి.
- చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న ‘రజాకార్‘ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కాయి
- ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగాన్ని ఏర్పాటు చేసినా ఏదీ ఎంపిక కాలేదు.
- ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కారాల జాబితాలో చోటు కల్పించలేదు.
- ప్రముఖ నటి జయసుధ చైర్ పర్సన్ గా ఏర్పాటైన జ్యూరీ 65 చిత్రాలతోపాటు.. వెయ్యికిపైగా నామినేషన్లను పరిశీ లించి ఈ పురస్కారాల్ని ఎంపిక చేసింది.
- హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీఎఫ్ డి సీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంస్థ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ పురస్కారాల్ని ప్రకటించారు.

- జయసుధ మాట్లాడుతూ “సినీ పరిశ్రమకు పురస్కారాలే ప్రోత్సాహం. 14 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయడం సంతోషం. ఎంపిక విషయంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎలాంటి జోక్యం గానీ, ఒత్తిళ్లు గానీ మాపై లేవు. జ్యూరీ సభ్యులం కూడా పెద్దగా వాదోపవాదాలు లేకుండా, చిన్నపాటి చర్చలతోనే పురస్కారాలపై ఓ నిర్ణయాని కొచ్చాం అని తెలిపారు.కొత్తతరం ఇంత మంచి సినిమాలు తీయడం, గొప్ప ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయం. ఉత్తమ చిత్రాల్లో, అత్యుత్తమమైన వాటికే పురస్కారాలు ఇచ్చాం” అన్నారు.
- టీఎఫ్ సీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ‘జ్యూరీ ఏర్పాటు కాగానే మనస్సాక్షిగా సిని మాలు చూసి, పురస్కారాల్ని ఎంపిక చేయా లని కోరా. అందుకు తగ్గట్టే ఎవరి ప్రభావం, జోక్యం లేకుండా జ్యూరీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పురస్కారాల జాబితాను అందజేశాం”
- 2014 నుంచి 2023 వరకూ పుర స్కారాల ఎంపిక కోసం నటుడు మురళీమో హన్ నేతృత్వంలో మరో జ్యూరీని ఏర్పాటు చేశారు. జూన్ 14న హైదరాబాద్ లోని హైటె క్స్ లో పురస్కారాల్ని ప్రదానం చేయనున్నారు.

- 2024 విజేతల వివరాలు..
- ఉత్తమ చిత్రం :కల్కి 2898 ఏడీ ; ఉత్తమ ద్వితీయ చిత్రం: పొట్టేల్ ; ఉత్తమ తృతీయ చిత్రం: లక్కీ భాస్కర్
- జాతీయ సమైక్యత, మతసామరస్యం, అణగా రిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశిం చిన ఉత్తమ చిత్రం: కమిటీ కుర్రోళ్లు
- ఉత్తమ బాలల చిత్రం: 35 – చిన్న కథ కాదు ; ఉత్తమ చారిత్రక చిత్రం: రజాకార్
- ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: యదువంశీ (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆయ్
- ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి2898 ఏడీ)
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2) ; ఉత్తమ నటి: నివేదాథామస్ (35-చిన్న కథ కాదు)
- ఉత్తమ సహాయ నటుడు: ఎస్.జె. సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసి రోలియా (రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవ కోన: నిజమే నే చెబుతున్నా…)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2: సూసేకి అగ్గిరవ్వలా.. )
- ఉత్తమ హాస్య నటుడు: సత్య, వెన్నెల కిశోర్ (సంయుక్తంగా) (మత్తు వదలరా 2)
- ఉత్తమ బాల నటులు: మాస్టర్ అరుణ్వ్ పోతుల, బేబి హారిక (35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్
- ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
- ఉత్తమ స్క్రీన్ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (రాజుయా దవ్: లేదే లేదే ప్రేమసలే..)
- ఉత్తమ ఛాయాగ్రాహకుడు: విశ్వనాథ్ రెడ్డి(గామి)
- ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
- ఉత్తమ నృత్య దర్శకుడు: గణేశ్ ఆచార్య (దేవర: ఆయుధ పూజ)
- ఉత్తమ కళాదర్శకుడు: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశే ఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనారావు, అజయ్ కుమార్ (కల్కి 2898 ఏడీ)

స్పెషల్ జ్యూరీ పురస్కారాలు:
- దుల్కర్ సల్మాన్ కథానాయకుడు (లక్కీభాస్కర్)
- అనన్య నాగళ్ల, కథానాయిక (పొట్టేల్) సుజీత్, సందీప్, దర్శకులు (క)
- ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి, నిర్మాతలు(రాజు యాదవ్)
జ్యూరీ స్పెషల్ మెన్షన్
- ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2 – ర్యాప్ గీతం)
- తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్ (రచయిత: రెంటాల జయదేవ).
- అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమా లకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది.
- ప్రముఖ నటుడు మురళీమోహన్ నేతృత్వం లోని జ్యూరీ ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారా లకు ఎంపిక చేసింది.
- వీటితోపాటు కొన్ని జాతీయ, ప్రత్యేక పురస్కారాలకీ సినీ ప్రముఖుల్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన అవార్డులతో పాటు కొత్తగా అలనాటి సినీ ప్రముఖులు పైడి జైరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కా రాల్ని ఏర్పాటు చేశారు.
- 2014-2023 వరకు పురస్కారాలకు ఎంపికైన సినిమాల వివరాలు

- ప్రత్యేక పురస్కార గ్రహీతలు
- N.T.R జాతీయ సినీ పురస్కారం: బాలకృష్ణ
- కాంతారావు సినీ పురస్కారం: విజయ దేవర కొండ
- పైడి జైరాజ్ సినీ పురస్కారం: మణిరత్నం(దర్శకుడు)
- బీఎన్ రెడ్డి సినీ పురస్కారం : సుకుమార్(దర్శకుడు)
- నాగిరెడ్డి – చక్రపాణి సినీ పురస్కారం : అట్లూరి పూర్ణచంద్రరావు(నిర్మాత)
- రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత)
- గద్దర్ సినీ పురస్కారాలు గెలిచిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల కి అందించనున్న ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.
- ప్రథమ ఉత్తమ చిత్రానికి రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు,బంగారు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని నిర్మాతకి అందచేస్తారు.చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి రూ.5 లక్షల నగదు, వెండి జ్ఞాపిక, ప్రశంసాపత్రం దక్కనున్నాయి.
- ద్వితీయ ఉత్తమ చిత్రా నికి రూ.7 లక్షల నగదు బహుమతితోపాటు, వెండి జ్ఞాపిక, ప్రశంసాపత్రం నిర్మాతకి అందజే యనున్నారు. చిత్ర దర్శకుడికి రూ.3 లక్షల నగదు, కాంస్య జ్ఞాపిక, ప్రశంసాపత్రం ప్రదానం చేయనున్నారు.
- తృతీయ ఉత్తమ చిత్రానికిగానూ రూ.5 లక్షల నగదు తోపాటు, కాంస్య జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని నిర్మాత అందుకోనున్నారు. దర్శకుడికి రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం లభిస్తుంది.
- ఇతర విభాగాల్లోని చిత్రాలకి రూ.5 లక్షలు, రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతి, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాల్ని అందజేయనున్నారు.
- వ్యక్తిగత విభాగాల్లో విజేతలకి రూ.5 లక్షలు, సహాయ నటీనటులకు రూ.3 లక్షలు, స్పెషల్ జ్యూరీ పుర స్కారాలకి రూ.3 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం రచయితకు రూ.3 లక్షలు నగదు, వెండి జ్ఞాపిక, ప్రశంసాపత్రం లభిస్తుంది.
- ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీ అంతా ఏకాభిప్రాయంతో పురస్కారాల్ని ఖరారు చేసింది.
- 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాల్ని పురస్కారాలకు ఎంపిక చేశారు.
- జూన్ 14న 2024 పురస్కారాలతోపాటు, గత పదేళ్ల పురస్కారాల్నీ ప్రదానం చేస్తామని దిల్ రాజు తెలి పారు
Telangana Socio Outlook 2025 : Test Series(TM)
TGPSC Group-2&3 Paper-3 Economy Test Series (TM)
TG Current Affairs e-Magazine 2025 (Jan-Dec)
Leave a Reply