Telangana Culture - Dances Study Material in Telugu For TGPSC
Telangana Culture – Dances Study Material in Telugu For TGPSC

Telangana Culture – Dances Study Material in Telugu For TGPSC:

తెలంగాణ ప్రాంతానికి సంపన్నమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఈ సుసంపన్న నాగరి కత తెలంగాణ భాషలో, మాండలికంలో, సంస్కృతి సంప్రదాయాల్లో, జీవన విధా నాల్లో, అలవాట్లు, అభిరుచుల్లో ప్రతిబింబి స్తుంది. ఒక ప్రాంత జీవన విధానాన్ని ఆ ప్రాంత సంస్కృతిగా వ్యవహరిస్తారు. పండు గలు, ఆట-పాటలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, వివిధ రకాల కట్టు బాట్లు, విలువలు, జానపద కళలు ఇవన్నీ సంస్కృతిలో అంతర్భాగమే.
తెలంగాణ ప్రాంతంలో హిందూ-ముస్లిం సంస్కృతులు, ఉత్తర దక్షిణ భారతదేశ సంస్కృతులు, గ్రామీణ గిరిజన సంస్కృ తులు వైవిధ్యంగా సహనంతో సహజీవనం చేసేవి. ఈ సంస్కృతుల సమాహారమైన మిశ్రమ సంస్కృతి తెలంగాణకు గల సాంస్కృతిక వైవిధ్యతను తెలియజేస్తుంది.

Dream warriors academy telegram channel
Dream warriors academy telegram channel

తెలంగాణ నృత్యాలు:

తెలంగాణ సమాజం- సంస్కృతి అనే అంశానికి సంబంధించి మొదట మనం నృత్యకళల గురించి తెలుసుకుందాం.

పేరిణి తాండవం:

  • కాకతీయుల కాలంలో యుద్ధవీరులు ఉత్తే జాన్ని నింపుకోవడానికి ప్రత్యేకంగా ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారు.
  • శివుడికి ప్రేరణగా ప్రదర్శించే ఈ నృత్యం వీర రస ప్రధానమైనది.
  • పేరిణి శివతాండవ నృత్యం లక్షణాలు, సాధన క్రమాన్ని కాకతీయరాజు అయిన గణ పతి దేవుని బావమరిది, గజసేనాధ్యక్షుడు జాయపసేనాని తాను రాసిన నృత్యరత్నావళిలో వివరించారు.
  • గణపతిదేవుని
  • గురువైన విశ్వేశ్వర శివాచార్యుడు ఈ కళకు రూపం ఇచ్చాడు.
  • అదేవిధంగా శైవ సంప్రదాయానికి చెందిన పేరిణి నృత్య వర్ణనలు పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో కనిపిస్తాయి.
  • ఆధునిక యుగంలో పేరిణి నృత్యాన్ని పున రుద్ధరించింది నటరాజ రామకృష్ణ. పేరిణి నృత్య ప్రదర్శనను సంపూర్ణంగా తిల కించడానికి నాలుగైదు గంటల సమయం పడుతుంది.
  • ఈ నృత్యానికి సంబంధించిన మృదంగ వాయిద్యం ద్రుపద బాణీలో ఉంటుంది. ఈ పేరిణి నృత్యరీతులను వరంగల్ జిల్లా రామప్ప దేవాలయం శిల్ప భంగిమల్లో చూడవచ్చు.
  • ఇది సాధారణంగా వీరావేశంతో పురుషులు మాత్రమే ప్రదర్శించే నృత్యకళ.
  • శివుడిని ఆరాధ్యదైవంగా భావించి నటరాజ విగ్రహం ముందుగాని, శివాలయాల్లోగాని ఊపిరి సలపనంత ఉత్కంఠతతో కన్నుల పండువగా ఈ నృత్యం ప్రదర్శిస్తారు.
  • పేరిణి నృత్యాన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ / యుద్ధవీరుల నృత్యం/యోధుల నృత్యంగా పేర్కొంటారు.
  • మగవారి పేరిణి నృత్యానికి ప్రతిచర్యగా ఆనందంతో పురుషులను రంజింపజేయడా నికి స్త్రీలు చేసే నృత్యం- లాస్యం పేరిణి లాస్యం నృత్యంలో కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నర్తకి- మాచల్దేవి.
  • ఈ నృత్యంలో ప్రాచుర్యం పొందిన వ్యక్తులు – పేరిణి శ్రీనివాస్, పేరిణి రమేశ్, కళాకృష్ణ. శ్రీధర్.
  • పేరిణి శివతాండవానికి సంబంధించి పోటీ పరీక్షల్లో వివిధ కోణాల్లో ప్రశ్నలను అడిగే విధానాన్ని పరిశీలిద్దాం.

గుస్సాడి నృత్యం:

  • ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ల్లోని రాజగోండు తెగకు చెందిన పురుషులు గుస్సాడి నృత్యం ప్రదర్శిస్తారు.
  • ఈ జానపద నృత్యాన్ని గోండులు దీపావళికి ముందు ఆశ్వ యుజ శుద్ధ పౌర్ణమినాడు మొదలుపెట్టి ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు కొనసాగి స్తారు.
  • 20 నుంచి 40 మంది కలిసి ఒక గుంపుగా ఏర్పడి చుట్టుపక్కల పల్లెల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ గుంపులను దండారి గుంపులు అంటారు.
  • ఈ పెద్ద గుంపు నుంచి అంతర్భాగంగా ఇద్ద రుగాని, ఐదుగురుగాని మరో గుంపు కడ తారు. ఈ అంతర్భాగ గుంపునే గుస్సాడి అంటారు.
  • గుస్సాడి నృత్యం చేసేవారు పొడవాటి నెమలి ఈకలు, రంగుల అద్దాలు మొదలైన వాటితో టోపీ తయారు చేసి, దాని ముందు భాగంలో మేక లేదా గొర్రె కొమ్ములను అమర్చి తలపాగా ధరిస్తారు. వీరు ధరించే టోపీని మాల్జిలన టోపీ అంటారు.
  • నాగోబా జాతర సమయంలో గోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
  • గుస్సాడి నృత్యానికి సంబంధించి ప్రముఖ కళాకారుడు గుస్సాడి కనకరాజు.
  • 55 ఏండ్లుగా గుస్సాడి నృత్యాన్ని ప్రద ర్శిస్తూ, నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు భారత ప్రభుత్వం 2021కు గాను పద్మశ్రీ పురస్కారం అందజే సింది. ఇతనిది మర్లవాయి గ్రామం, జైనూర్ మండలం, కుమ్రంభీం జిల్లా. ఇతడిని ‘గుస్సాడి రాజు’గా కూడా పిలుస్తారు.
  • ఇతని పేరుమీదుగానే రాష్ట్రంలో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పద్మశ్రీ కన కరాజు స్కూల్ ఆఫ్ గుస్సాడి డ్యాన్స్ ను ప్రారంభించారు.
  • ఇలా అభ్యర్థులు వర్తమాన అంశాలను జోడించి చదువుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
Dream warriors academy whatsapp channel
«
»

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *