Telangana Culture – Fairs (జాతరలు) Study Material in Telugu For TGPSC:
సమ్మక్క-సారలమ్మ జాతర:
- చారిత్రక నేపథ్యం: కాకతీయుల కాలంలో పొలవాసను పాలించే మేడరాజు తన కుమార్తె అయిన సమ్మక్కను ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం రాజ్యాన్ని పాలిస్తూ కాకతీయుల సామంతునిగా ఉన్న పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు.
- పగిడిద్ద రాజు పన్ను కట్టకపోవడంతో కాక తీయ రాజు రెండో ప్రతాపరుద్రుడు తన సేనాని యుగంధరుని (గన్నమ నాయ కుడు)తో కలిసి మేడారంపై దండెత్తుతాడు. • ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు, గోవింద రాజు, సారక్క, నాగులమ్మ మరణిస్తారు. కాకతీయ సేనలకు ఎదురొడ్డి పోరాడిన జంపన్న ఓటమిని జీర్ణించుకోలేక సంపెంగ వాగులో దూకి మరణిస్తాడు. వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క తీవ్ర గాయాల పాలై చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమవుతుంది.
Table of Contents:
సమ్మక్క-సారలమ్మ జాతర ముఖ్యాంశాలు:
- సమ్మక్క-పగిడిద్ద రాజులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
- కుమార్తెలు: సారక్క/సారలమ్మ, నాగులమ్మ
- కుమారుడు: జంపన్న
- సారలమ్మ భర్త: గోవింద రాజు రెండేండ్లకోసారి
- ఈ జాతరను ప్రతి రెండేండ్లకు ఒక సారి మాఘశుద్ధ పౌర్ణమినాడు నిర్వ హిస్తారు.
·ఈ జాతర 4 రోజులపాటు జరుగు తుంది.
ప్రత్యేకతలు
- ఈ జాతర కోయతెగ గిరిజనులకు ప్రముఖ మైంది. ఈ జాతరలో పూజారులుగా వడ్డె ఉంటారు.
- 2022, ఫిబ్రవరి 18 నుంచి 19 వరకు జాతర జరిగింది. మళ్లీ 2024లో ఈ జాతర నిర్వహిస్తారు.
2022 జాతరలో సమ్మక్క రాక సంద ర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ (ఇది రెండోసారి). - ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారక్క జాతరకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది.
- ఈ జాతరను తెలంగాణ కుంభమేళా/ దక్షిణ భారత కుంభమేళాగా పేర్కొంటారు. దీన్ని ఆదివాసి జాతర అని కూడా అంటారు.
- 1998, ఫిబ్రవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
- ఈ జాతరలో సమర్పించే నైవేద్యం (బెల్లం) ను బంగారంగా పేర్కొంటారు.
- విగ్రహాలను కాకుండా కంకవనం (వెదురు చెట్లు) కొయ్య చెక్కలను గద్దెలపై ఉంచి అమ్మవార్లుగా పూజిస్తారు.
- సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో, పగిడిద్ద రాజును పడగ రూపంలో తీసుకొస్తారు.
- సమ్మక్క వాహనం పెద్దపులి, సారక్క వాహనం జింక.
- సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు.
- జంపన్న దూకి ఆత్మహత్య చేసుకున్న కార ణంగా జంపన్న వాగుకు ఆ పేరు వచ్చింది. అంతకుముందు దీన్ని సంపెంగ వాగు, దయ్యాల మడుగు అని పిలిచేవారు.
సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే విధానం:
- మొదటి రోజు: కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు.
- రెండో రోజు: చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తారు.
- మూడో రోజు: ఇద్దరు అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరుతారు.
- నాలుగో రోజు: అమ్మవార్లకు ఆవాహనం పలికి వారిని యథాస్థానాలకు చేర్చుతారు.
- గమనిక: పగిడిద్ద రాజును మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూను నుంచి, గోవిందరాజును
ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి, జంపన్నను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.
నాగోబా జాతర:
- నాగోబా అంటే నాగదేవత. పామును దేవత రూపంలో పూజిస్తారు.
- ఈ జాతరను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గోండు తెగవారు జరుపుకొంటారు. ప్రతి ఏడాది పుష్య మాసంలో బహుళ అమా వాస్య రోజున ఈ జాతర జరుగుతుంది. • ఈ జాతరను ప్రధానంగా గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. • ఈ జాతరకు 15 రోజుల ముందు మంచి ర్యాల జిల్లా జిన్నారం మండలం కలమ డుగు గ్రామం సమీపంలోని హస్తన మడుగు నుంచి గోదావరి జలాలను తీసు కొస్తారు. ఈ జలాలతో నాగోబా దేవతను అభిషేకిస్తారు.
- ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల వంశీయులు తయారుచేసిన కుండల్లోనే గంగా జలాన్ని తీసుకొస్తారు.
- ఈ జాతర సందర్భంగా నూతన వధువు లను నాగోబా దేవత వద్దకు తీసుకొచ్చి పూజ నిర్వహించి, వధువును పరిచయం చేస్తారు. దీన్ని భేటింగ్ కార్యక్రమం లేదా పరిచయ వేదిక అంటారు.
- ఈ సందర్భంగా గోండులు నిర్వహించే నృత్యం- గుస్సాడి
- ఇది దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర. మొదటి అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారక్క
- ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఈ జాతర సంద ర్భంగా గోండు దర్బార్ (పూజా దర్బార్) నిర్వహించి, దానికి జిల్లా కలెక్టర్ ను ఆహ్వా నించి, గిరిజనుల సమస్యలను విన్నవించుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాడు.
- 1942లో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నది.
- కరోనా కారణంగా 2021లో ప్రభుత్వం తరపు అధికారులు దర్బార్ నిర్వహించలేదు. దాంతో ఆలయ పీఠాధిపతి వెంకటరావు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
- ఈ జాతరలో ఆ ఏడాది మరణించిన తమ పెద్దల పేరిట తూం పూజలు నిర్వహిస్తారు.
హైమన్ డార్ఫ్:
- ఆస్ట్రియా దేశానికి చెందిన హైమన్ డార్ఫ్ నిజాం నవాబు కాలంలో నిజాం కాలే జీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. గోండు ప్రజల జీవితాలను, వారి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి.. ఆ సమ
స్యలకు పరిష్కారాలు సూచించడానికి హైమన్ డార్ఫ్ ను నిజాం నవాబు నియమించాడు. - ఈయన పూర్తిపేరు క్రిస్టఫర్ వాన్ ప్యూరర్ హైమన్ డార్ఫ్.
- హైమన్ డార్ఫ్ పరిశోధన వివరాలు ఆయన రాసిన ‘ట్రైబల్ హైదరాబాద్’ అనే గ్రంథంలో ఉన్నాయి.
గొల్లగట్టు జాతర:
- ఈ జాతరను పెద్దగట్టు జాతర, పాలశెర్లయ్య జాతర, దురాజ్ పల్లి జాతర అని కూడా పిలుస్తారు.
- రాష్ట్రంలో జరిగే రెండో అతిపెద్ద జాతర. • ఈ జాతరను ప్రతి రెండేండ్లకు ఒకసారి మాఘ మాసంలో నిర్వహిస్తారు.
- ఈ జాతర సాధారణంగా 4 రోజుల జాతర అయినప్పటికీ గత మూడేండ్లుగా 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
- సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామంలోని పాలశెర్లయ్య గుట్ట మీద
ఈ జాతర జరుగుతుంది. - ఇక్కడ పూజించే దేవతలు లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి (యాదవుల ఆరాధ్య దైవం). జాతరకు ముందు సూర్యాపేట గొల్ల బజారు నుంచి మకర తోరణాన్ని ఊరేగిం పుగా తీసుకెళ్తారు.
- ఈ జాతర సందర్భంగా ఖాసింపేట యాద వులు పసిడి కుండను ఆలయ గోపురంపై ఉంచుతారు.
- దిష్టి పోయడం, గండ దీపం వెలిగించడం వంటి ఆచారాలు ఈ జాతరలో నిర్వహిస్తారు.
- వరంగల్ జిల్లా చీకటాయపాలెంకు చెందిన దేవర వంశీయులు, నల్లగొండ జిల్లాకు చెందిన తండు, మట్ట వంశీయులు ఈ జాతరను నిర్వహిస్తారు.
- నెలవారం కార్యక్రమాన్ని మున్నీ, మెంత బోయిన వంశీయులు చేపడతారు.
- చంద్రపట్నం కార్యక్రమాన్ని బైకాన్లు (చీకటాయపాలెం) నిర్వహిస్తారు. లింగమంతుల స్వామి ఆలయాన్ని చోళచాళుక్యులు నిర్మించారు.
- 1966 నుంచి దేవాదాయశాఖ అధికారి కంగా జాతరను నిర్వహిస్తుంది.
- ఈ జాతరలో నైవేద్యాన్ని కుక్కల బండపై ఉంచి కుక్కలవలే నాలుకతో స్వీకరిస్తారు.
గొల్లగట్టు జాతర జరిగే విధానం:
- మొదటి రోజు: 30 విగ్రహాలు ఉన్న దేవర పెట్టెను కేసారం గ్రామం తీసుకెళ్లి, హక్కుదారులకు చూపించి, కంకణం కట్టి, ఊరేగింపుగా గుట్టమీదికి తీసుకెళ్తారు. ఇదేరోజు మందగంపల ప్రదర్శన ఉంటుంది. రెండో రోజు: లింగమంతుల స్వామికి బోనాలు, చౌడమ్మ తల్లికి మొక్కులు సమర్పిస్తారు.
- మూడో రోజు: చంద్రపట్నం నిర్వహిస్తారు (లింగమంతుల స్వామి, మాణిక్య మ్మల పెండ్లి కార్యక్రమం).
- నాలుగో రోజు: నెలవారం నిర్వహిస్తారు. (పెండ్లయిన 16 రోజులకు నిర్వహించే
కార్యక్రమాన్ని పోలి ఉంటుంది. - ఐదో రోజు: మకర తోరణం తొలగింపు, పూజారులు కేసారం చేరడంతో జాతర ముగుస్తుంది.
Leave a Reply