Telangana MSME-2024 -Download PDF in Telugu and English
Telangana MSME-2024 -Download PDF in Telugu and English

Telangana MSME 2024 Policy 2024 | తెలంగాణ MSME విధానం(పాలసి) 2024-Download PDF in Telugu:

తెలంగాణ ప్రభుత్వం Micro, Small and Medium Enterprises(MSME) (సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు (MSME) ల అభివృద్ధి కోసం MSME 2024 పాలసిని తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు (MSME) ల అభివృద్ధి, స్థాపన కోసం రూ. 4000 కోట్లు కేటాయించడం జరిగింది.

Dream warriors academy telegram channel
Dream warriors academy telegram channel

నిర్దేశిత లక్ష్యాలు:

గడిచిన 10 సం॥లో తెలంగాణ ప్రభుత్వం MSME ల అభివృద్ధి లో గొప్ప ప్రగతి సాధించడం జరిగింది. రాష్ట్రములో MSME లు ఆధునీకరించబడి నమోదు ప్రక్రియలో TG-iPASS నందు 2014 సం॥ నుండి 2023 సం॥ వరకు ప్రతి ఏటా 11 నుండి 15 % అభివృద్ది చెందడం జరిగింది. ఆలాగే 2018 సం॥ నుండి 2023 సం॥ మధ్య కాలములో TG-iPASS నందు సగటు పెట్టుబటి 115% కు ఎగబాకడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో MSME లు అభివృద్ధిలో ఉన్నప్పటికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే గణనీయమైన ప్రగతి సాధించినది. NSS అంచనాల ప్రకారము 65.7% MSME లు ఇంకనూ గుర్తింపు పొందవలసి ఉన్నవి. TG-iPASS సమాచారము ప్రకారము మధ్య తరహా సంస్థలు పరిమితం చేయబడ్డాయి. 2016 సం. నుండి 2023 వరకు తయారీ సంస్థలు 2.9% సేవా రంగములలో 3.5% మాత్రమే ఎంఎస్ఎంఈలు TG iPASS నందు నమోదు కావడం జరిగింది.

Dream warriors academy whatsapp channel

తెలంగాణ రాష్ట్రంలో MSME ల రిజిస్ట్రేషన్ ఖర్చుతో కూడుకుని ఉన్నది. రిజిస్ట్రేషన్ పొందిన చిన్న సంస్థలలో కూడా 35% వరకు శ్రమ ఖర్చు (Labour) పెరగడం గమనించడం అయినది. అలాగే తయారీ సంస్థలలో ఎంఎస్ఎంఈల భూమి మరియు భవనాల నిబందనలను పాటించాలంటే 40 నుండి 50% వరకు ఖర్చు పెరగడం జరుగుతుంది. అలాగే ఇతర నిబంధనలు పాటించవలసిన ఖర్చు పెరగడంతో బలవంతంగా అనాదికారిక సంస్థలుగా ఉండిపోతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పరిమాణంలో ఎదగడానికి తగినన్ని వనరులు, శ్రామికుల ఖర్చు మరియు భూములు అందుబాటులో లేకపోవటం . ఆర్థిక వనరులు, ఉత్పత్తిపై భారం పెరుగుతుంది. అలాగే నైపుణ్యం గల శ్రామికులు అందుబాటులో లేకపోవడం గ్లోబల్ మార్కెట్ కు అనుసంధానించక పోవడంతో ఎంఎస్ఎంఈలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలు క్రమ పద్దతిలో పరిష్కరించడానికి రూపొందించబడింది, తద్వారా ఎంఎస్ఎంఈలు కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతాయి.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే TG-iPASS ప్రక్రియ ద్వారా సంస్కరణలు అమలు పరుస్తుంది మరియు సంస్థల నిర్వహణ ఖర్చులు తగ్గించే విధంగా దోహద పడుతుంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలపై (2) రకాల సర్వేలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం జరిగింది మరియు ఇట్టి సమస్యలపైనా ఎంఎస్ఎంఈలకు అవసరమైన సహాయ సహకారాలు అంధించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉంది.

ప్రస్తుతం ఎంఎస్ఎంఈ పాలసీ 21 వ శతాబ్దంలో సమగ్ర వ్యాపారం ద్వారా గొలుసు వ్యవస్థ (Chain System) మరియు పర్యావరణ వ్యవస్థను సమగ్ర సాంకేతికతను పరస్పరం అంది పుచ్చుకోవడంలో సహాయ పడుతుంది. ప్రభుత్వం చిన్న తరహా సంస్థలకు కూడా పరిశ్రమ 4.0 కింద వాడుక భాషలో (మాధ్యమం)లో అందించడం జరుగుతుంది.
21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా వ్యాపార రంగంలో ఆదర్శవంతమైన వ్యాపార నిర్వహణకు ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దుతుంది. ఎంఎస్ఎంఈలు తమ వ్యాపార విస్తరణను చురుకుగా చేయడం కోసం మరియు ఇండస్ట్రీ 4.0కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా ప్రోత్సహిస్తుంది.

Telangana MSME 2024 Policy 2024-Download PDF in Telugu and English:

Telangana MSME 2024 PolicyDownload PDF
English VersionDownload PDF
Telugu VersionDownload PDF
«
»

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *