
వరంగల్ చపాటా మిర్చి కి భౌగోళిక గుర్తింపు:
వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. రాష్ట్రం నుంచి మొదటి ఉద్యానవన ఉత్పత్తిగా దేశ జీఐ రిజిస్ట్రీ ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేషన్ ట్యాగ్ పొందింది

కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధ్రువీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) దండా రాజిరెడ్డి తెలిపారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప 984 వది అని, తెలంగాణ నుంచి నమోదైన వాటిలో ఇది 18 వది.
పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాల లోని ఉద్యాన పరిశోధన కేంద్రం [జెన్నారెడ్డి వెంకట్ రెడ్డి (జేవీఆర్ హార్టికల్చ ర్ రీసెర్చ్ స్టేషన్)], కొండా లక్ష్మణ్ వర్సిటీ.. జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి.
వరంగల్ చపాటా మిరపకాయ పండ్లు లావుగా, ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. కొద్దిగా టమాటా ఆకారంలో ఉండే వీటిని ‘టమాటా మిరప ‘కాయ’ అని కూడా పిలుస్తున్నారు. తక్కువ ఘాటుతో రుచికరంగా, శుద్ధికి, ఎగుమతికి అనువుగా ఉంటాయి.. పచ్చళ్లకు చపాటా మిర్చి పొడిని అధికంగా వాడుతుం టారు
మిఠాయిలతో పాటు ఆహార, సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధ, వస్త్ర పరిశ్రమల్లోనూ చపాటా మిర్చిని రంగుగా ఉపయోగిస్తున్నారు
స్థానిక నేలలు, వాతావరణ అనుకూలతల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ పంట ఎక్కువగా సాగవుతోంది.

Click Here to Download PDF File
Leave a Reply