Telangana Culture -Famous Structures Study Material in Telugu For TGPSC
Table of Contents:
తెలంగాణ – ప్రముఖ కట్టడాలు:
ఉస్మానియా యూనివర్సిటీ:
- 1878లో రఫత్యార్ జంగ్, జమాలుద్దీన్ అఫ్ఘనీ అనే ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలు మొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో స్థానిక భాష అయిన ఉర్దూ మాధ్యమంలో ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని ప్రతి పాదించారు.
- ఆ తర్వాత డబ్ల్యూఎస్ బ్లంట్ (బ్రిటిష్ పార్ల మెంట్ సభ్యుడు) అప్పటి ప్రధాని అయిన రెండో సాలార్జంగ్ తో విశ్వవిద్యాలయ ప్రతి పాదనల గురించి మాట్లాడారు.
- అదేవిధంగా విశ్వవిద్యాలయ అవశ్యకత గురించి డబ్ల్యూఎస్ బ్లంట్ ఒక ప్రతిపాద నను తయారు చేయించి 1883లో నాటి నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ కు (ఆరో నిజాం) అందజేశారు.
- 1885లో పబ్లిక్ గార్డెన్ లో ఆరో నిజాం అధ్య క్షతన జరిగిన సమావేశంలో కొంతమంది వి ద్యార్థులు నిజామియా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు.
- ఈ విషయాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, విద్యాశాఖ సలహాదారుడు. అయిన ఎంటీఏ మేయో రాజ్య విద్యావిధా నాన్ని పటిష్టపర్చడానికి కొన్ని సూచనలు చేస్తూ ప్రత్యేక విశ్వవిద్యాలయ స్థాపన అవ కాశాలు పరిశీలించాలని కోరాడు.
- 1913లో దారుల్-ఉల్-ఉలూం కాలేజీ విద్యార్థులు ఓల్డ్ బాయిస్ సంఘంగా ఏర్పడి, విశ్వవిద్యాలయ అవసరం గురించి ఒక ప్రతిపాదనను నిజాం రాజుకు సమర్పించారు.
- తర్వాత నిజాం రాజు తన ఆర్థికమంత్రి సర్ అక్బర్ హైదరీతో చర్చించి ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో అనుమతించాడు. 1917, ఆగస్టు 17న ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనను నిర్ణయిస్తూ ఏడో నిజాం ఒక ఫర్మానా (ఉత్తర్వు) జారీచేశాడు.
- ఉస్మానియా యూనివర్సిటీని 1400 ఎక రాల్లో స్థాపించడానికి 1918 ఆగస్టు 28న నిజాం రాజు ఒక రాజ శాసనం జారీచేశాడు.
- విశ్వవిద్యాలయానికి సంబంధించిన తరగ తులు మొదట 1918-19లో అబిడ్స్ లోని కిరాయి ఇండ్లలో ప్రారంభమయ్యాయి.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మాణానికి సంబంధించి నిజాం రాజు రెండు సవాళ్లను ఎదుర్కొన్నాడు. మొదటిది విశ్వవిద్యా లయం నిర్మించే ప్రాంతం. ఇందుకు ప్రొఫె సర్ సర్ ప్యాట్రిక్ జెడెస్ అనే ఆంగ్లేయుడిని నిజాం పురమాయించాడు. దీంతో అతడు ఎంతో శ్రద్ధతో సర్వేచేసి అడిక్మెట్ ప్రాంతం లోని 1400 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీ కోసం ఎంపిక చేశాడు. రెండోది విశ్వవిద్యా లయం డిజైన్ గురించి. దీనిని హైదరాబాద్కు చెందిన శిల్పులు నవాబ్ జైన్ యార్
- జంగ్, సయ్యద్ అలీరజాలకు అప్పగిం చాడు. వీరు ఐరోపా దేశాలన్నీ తిరిగి, ఈజిప్టు విశ్వవిద్యాలయ నిర్మాణ పనుల్లో ఉన్న బెల్జియం శిల్పి జాస్ఫర్ను కలిశారు. అతడి డిజైను ముగ్ధులై 1933లో ఆయనను హైదరాబాద్ కు రప్పించారు.
- జాస్ఫర్ భారత్ లోని ఎల్లోరా, అజంతా గుహలు, రాజస్థాన్ ఢిల్లీలోని కట్టడాలు, గోల్కొండ, చార్మినార్ ను తిలకించి ప్రాచీన హిందూ, మధ్యయుగ ముస్లిం, ఆధునిక ఐరోపా కట్టడాలతో మిళితమైన డిజైను, హైదరాబాద్ సంస్కృతి, పర్యావరణానికి అనువుగా ఉండే కళాశాల భవంతి నమూ నాను రూపొందించి ఇచ్చాడు.
- 1934 జూలైలో ఆర్ట్స్ కళాశాల నిర్మాణానికి నిజాం శంకుస్థాపన చేశాడు. దాదాపు 35 వేల మంది కార్మికులు శ్రమించి 1939లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ ఆర్ట్స్ కళా శాల భవన నిర్మాణానికి సుమారు రూ.36 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిర్మాణం హిందూ-సార్సెనిక్ వాస్తు శైలికి నిదర్శనం. దీనిలో ముస్లిం, అరబ్, గోథిక్ శైలులను కూడా ఇనుమడింపజేశారు.
- 1939 డిసెంబర్ 4న నిజాం ఈ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అదేరోజు అబి డ్స్ జరుగుతున్న తరగతులను ఈ కాలే జీకి మార్చారు. ఆ తర్వాత అదే ప్రాంగ ణంలో ఇంజినీరింగ్ కాలేజీ, లా కాలేజీ, ఠాగూర్ ఆడిటోరియం నిర్మించారు. • ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణంలో పింకిష్ గ్రానైట్ రాయిని ఉపయోగించారు. • ఉస్మానియా విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన 1400 ఎకరాల స్థలం ఒక మహిళది. మహాలఖ చందాబాయి అనే మహిళ ఆ స్థలాన్ని దానం చేశారు. 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనా భాషను ఉర్దూ నుంచి ఆంగ్లానికి మార్చారు.
- ఉస్మానియా యూనివర్సిటీ దేశంలో ఏడో పురాతన విశ్వవిద్యాలయంగా, దక్షిణ భార త దేశంలో మూడో పురాతన విశ్వవిద్యాల యంగా రికార్డులకెక్కింది.
- దీని మొదటి వైస్ చాన్స్ లర్ నవాబ్ హబీ బుర్ రెహమాన్ ఖాన్ (1918-19). 1918 నుంచి ఇప్పటివరకు మొత్తం 27 మంది ఉస్మానియా యూనివర్సిటీ వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.
నవాబ్ అలీ యావర్ జంగ్ 1945-46, 1948-52 సంవత్సరాల్లో రెండుసార్లు వైస్ చాన్స్ లర్ గా పనిచేశారు. - 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో (1969-72 మధ్య) ఓయూ వీసీగా పనిచే సిన వ్యక్తి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ.
- ఆర్ట్స్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ సర్ రాస్ మసూద్. ఓయూ వీసీ పదవి చేపట్టిన మొదటి ఐఏఎస్ అధికారి సయ్యద్ హషీం అలీ (1982-85).
Leave a Reply