Telangana Culture - Handi Crafts Study Material in Telugu For TGPSC
Telangana Culture – Handi Crafts Study Material in Telugu For TGPSC

Telangana Culture – Handi Crafts Study Material in Telugu For TGPSC:

Dream warriors academy telegram channel
Dream warriors academy telegram channel

హస్తకళలు:

  • నిర్మల్ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి.
  • నిర్మల్ జిల్లా కేంద్రంలో కళాత్మక బొమ్మలు, చిత్రాలు, వస్తువులు తయారవు తాయి. వీటిని నకాష్ లు అని పిలుస్తారు.
  • ఈ కళాత్మక వస్తువులు మూడు ప్రధాన రూపాల్లో ఉంటాయి. అవి..
  • 1. నిర్మల్ బొమ్మలు, చేతి వస్తువులు 2. నిర్మల్ ఇంటి సామగ్రి 3. నిర్మల్ పెయింటింగ్స్
  • వీటన్నింటిని కలిపి నిర్మల్ ఆర్ట్వేర్ అంటారు.
  • నిర్మల్ ను పాలించిన పద్మనాయక వంశానికి చెందిన నిమ్మనాయుడు టేకు, పునికి, చెల్లు కలప నుంచి కొయ్య బొమ్మలు తయారుచేసే కళను ప్రోత్సహించాడు. నిమ్మనాయుడు పేరు మీదుగానే నిర్మల్ పట్ట ణానికి ఆ పేరు వచ్చింది.
  • నిర్మల్ పెయింటింగ్స్ ను నిర్మల్ బొమ్మల తయారీకి ఉపయోగించే పునికి కర్ర ఖానాపురం నుంచి మంచిర్యాల మధ్య ఉన్న అడవిలో, బెల్లంపల్లి, జిన్నారం, మంచిర్యాల తదితర అటవీ ప్రాంతాల్లో దొరుకుతుంది.
  • నిర్మల్ బొమ్మల్లో రాధాకృష్ణులు, గిరిజన మహిళ, బుద్ధుడు, గణేశుడు.. చేతి వస్తువుల్లో గాజులపెట్టె, ఆభరణాల పెట్టె, పెన్సిల్ డబ్బా మొదలైనవి ఉంటాయి.
  • హైదరాబాద్ లోని గోల్కొండ ఎంపోరియం ద్వారా నిర్మల్ బొమ్మలను ఎగుమతి చేస్తున్నారు.
  • నిర్మల్ బొమ్మల పెయింటింగ్ కోసం డ్యూకో పెయింట్స్ వాడుతారు.
  • నిర్మల్ చిత్రకళలో ఇక్కడి కళాకారులు బ్రహ్మ రౌతు పద్మారావు శైలిని కొనసాగిస్తున్నారు. నిర్మల్ కళాకారులు గనిజ్ ఫా అనే ప్లేయింగ్ కార్డ్స్ తయారు చేస్తారు. వీటిపై 2010లో
    పేటెంట్ పొందారు.
  • నిర్మల్ బొమ్మలు, చేతి వస్తువులు, నిర్మల్ ఇంటి సామగ్రి, నిర్మల్ పెంయిటింగ్స్ కు
    భౌగోళిక గుర్తింపు లభించిన సంవత్సరం 2008-09.
  • నిర్మల్ కళాకారుల నైపుణ్యంలో ఇండియన్ ఆండ్ మొఘల్స్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ శైలి కనిపిస్తుంది.

పెంబర్తి హస్తకళలు:

  • కఠినమైన ఇత్తడి లోహపు పలకపై ఆద్భుత కళాఖండాలు చెక్కే కళ జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో పుట్టింది.
  • ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగి షీలు, జ్ఞాపికలు కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందాయి.
  • ఈ హస్తకళా నైపుణ్యంలో ఎక్కువగా ఉండే లోహం ఇత్తడి (బ్రాస్).
  • పెంబర్తి గ్రామంలోని కంచర కులానికి చెందిన వ్యక్తులు ఇత్తడి కళాఖండాల తయా రీలో నిపుణులు.
  • పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం హిందూ- ముస్లిం ప్రభావానికి లోనై ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందింది.
  • పెంబర్తి కళను అంతర్జాతీయ స్థాయిలోకి తీసు కెళ్లిన కళాకారుడు అయి లాచారి.
    ఆయిలాచారి నేతృత్వంలో 1958లో విశ్వ కర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండస్ట్రియల్ సొసైటీ ఏర్పాటయ్యింది.
  • తెలుగు సినిమారంగం అందించే అత్యున్నత పురస్కారం అయిన నంది అవార్డుకు ప్రాణం పోసింది అయిలాచారే.
  • కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ నిధుల పథకం కింద పెంబర్తి ఇత్తడి కళాకారుల క్లస్టర్ ను ఏర్పాటు చేసింది. పెంబర్తి లోహకళకు 2010-11లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.

సిల్వర్ ఫిలిగ్రీ:

  • లోహాలను తీగలుగా మార్చి వాటికి ఆద్భుత మైన రూపమివ్వడమే ఫిలిగ్రీ.
  • వెండి తీగలతో రకరకాల బొమ్మలు, జాలీల నగలు తయారుచేసే కళ సిల్వర్ ఫిలిగ్రీ.
  • ఫిలిగ్రీ అనే పదం ఫిలిగ్రీన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఫిలమ్ అంటే త్రెడ్, సన్నటి తీగపోగు అని అర్థం.
  • గ్రానమ్ అంటే ధాన్యపు గింజ తరహాలో చిన్నపూస అని అర్థం.
  • 200 ఏండ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఎలగందుల ప్రాంతంలో ఈ కళ ఆవిర్భవించింది.
  • ఈ కళను ప్రవేశపెట్టినవారు కడార్ల రామయ్య.
  • ఇది పురాతన కాలం నుంచి విశ్వ బ్రాహ్మణులు కొనసాగిస్తున్న హస్తకళ.
  • సిల్వర్ ఫిలిగ్రీకి దేశంలోనే రెండో పట్టణంగా కరీంనగర్ కొనసాగుతున్నది.
  • సిల్వర్ ఫిలిగ్రీ కళ ఇండోనేషియా నుంచి భారత్ లోకి (ఒడిశాలోకి ప్రవేశించింది. ఈ సిల్వర్ ఫిలిగ్రీ కళకు దేశంలోనే ప్రసిద్ధి చెందిన తొలి నగరం కటక్ (ఒడిశా).
  • ఈ కళకు 2007-08 ఏడాదిలో భౌగోళిక గుర్తింపు వచ్చింది.

చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్:

  • రమ్యమైన జానపద శైలిలో వస్త్రంపై చిత్రీక రించి, పౌరాణిక గాథను కళ్లకు కట్టినట్లు విశ దీకరించే చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ కు తెలంగాణ ప్రసిద్ధి.
  • చేర్యాల స్క్రోల్ పెంయింటింగ్ కళాకారులను నకాషీలు అంటారు.
  • దీన్ని థీమ్ పెయింటింగ్ అని కూడా వ్యవహ రిస్తారు.
    ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్క్రోల్ పెయింటింగ్ కు సిద్దిపేట జిల్లాలోని చేర్యాల గ్రామం & మండలం ప్రసిద్ధి చెందినది.
  • ఈ పెయింటింగ్స్ లో పురాణాలు, ఇతిహాసా లను డిజైన్ లుగా తీసుకుని, మట్టి రంగులతో గోడలకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు. ఈ స్క్రోల్ పెయింటింగ్స్ కు 2010-11లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.

బిద్రి వస్తువులు:

  • హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బీదర్ (ప్రస్తుత కర్ణాటక)లో ఈ కళ అభివృద్ధి చెంద డంవల్ల ఈ కళకు బిద్రి అనే పేరు వచ్చింది. ఈ కళ ఇరాన్ నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చింది.
  • సుల్తాన్ అహ్మద్ షా ఈ కళను పర్షియా (ఇరాన్) నుంచి భారత్ కు తెచ్చాడు.
  • కాపర్, జింక్ మిశ్రమ లోహం (గన్ మెటల్)తో చేసిన వస్తువులపై మొదట నల్లని రంగువేసి, దానిపై సిల్వర్ లేదా బంగారు. రంగులతో డిజైన్ వేస్తారు.
    అలంకరణ వస్తువులు, ఫ్లవర్ వాజ్ లు, నగల డబ్బాలు వంటి ఎన్నో వస్తువులు తయారుచేస్తారు.
  • హైదరాబాద్ బిద్రి వస్తువులు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.

ఆసియా (తేలియా) రుమాల్:

  • యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి వీటి తయారీకి ప్రసిద్ధి.
  • ఇక్కత్ అనే నేతను దీనిలో ఉపయోగిస్తారు.
  • దారాన్ని ఒక రకమైన తైలంలో ముంచి ఆర వేస్తారు.
  • వీటిని గొర్రెపేడతో నింపిన నీటిలో ముంచి ఒక రాత్రి ఉంచి, మరునాడు ఆరబెడుతారు. ఇలా నాలుగు రోజులపాటు చేస్తారు. తర్వాత -డై ప్రక్రియలో రంగులు అద్ది చిత్రాలు గీస్తారు.
  • ఈ రుమాల్ పై చిన్నచిన్న బ్లాకులు, నక్షత్రాలు, గీతలు, డైమండ్ ఆకారాలు చిత్రిస్తారు.
  • సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించుకు నేందుకు తలపాగాలా దీన్ని వాడుతారు.
  • యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారా యణపూర్ మండలంలోని పుట్టపాక ఈ తేలియా రుమాల్ నేయడంలో ప్రసిద్ధి చెందింది.
  • పుట్టపాక తేలియా రుమాల్కు 2019-20 ఏడాదిలో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
  • పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య ఈ తేలియా రుమాల్, టై అండ్ డై రంగుల అద్ద కపు పనిలో ప్రసిద్ధుడు. ఇతను పుట్టపాక గ్రామానికి చెందినవాడు. 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.

డోక్రా అంటే బెల్ మెటల్ కళ:

  • డోక్రా అనేది ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం, ఉసేగావ్ గ్రామానికి చెందిన పురాతనమైన గిరిజన లోహపు హస్తకళ.
  • మైనపు పద్ధతిని ఉపయోగించి ఇత్తడితో డోక్రా కళాఖండాలు తయారుచేస్తారు.
  • ఈ పూర్తయిన కళాఖండాలకు ఎలాంటి అను మతులు ఉండవు.
  • ఈ కళలో బొమ్మల తయారీకి ఎర్రమట్టి, మైనం, ఇత్తడి పదార్థాలు ఉపయోగిస్తారు.
  • ఈ హస్తకళ కోమరం భీమ్ ఆసిఫాబాద్, ఆది లాబాద్ జిల్లాల్లోని కెరమెరి మండలం జమ గావ్ గ్రామంలో, జైనూర్ మండలంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తుంది.
  • డోక్రా మెటల్ కళకు సంబంధించి బాగా ప్రఖ్యాతిగాంచినది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజదారో.
  • పశ్చిమబెంగాల్లో ని సంప్రదాయ లోహ తయారీదారులైన డోక్రా దమర్ అనే తెగ పేరున ఈ కళకు డోక్రా అనే పేరు వచ్చింది.

పోచంపల్లి చీరలు:

  • యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో నేసే చీరలు చాలా ప్రసిద్ధి.
  • పోచంపల్లి చీరల్లో ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉపయో గిస్తారు.
  • 2005లో రాష్ట్రంలో తొలిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన తొలి వస్తువుగా పోచంపల్లి చీరలను గుర్తించారు.
  • పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ
  • పోచంపల్లి చేనేత కేంద్రంగా, గ్రామీణ పర్యా టక కేంద్రంగా ప్రసిద్ధి చెందినది.
Dream warriors academy whatsapp channel
«
»

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *