Telangana Culture – Festivals Study Material in Telugu For TGPSC:
Table of Contents:
బోనాలు:
- బోనం అంటే భోజనం అని అర్థం. గ్రామ దేవతలకు భోజనాలు సమర్పించే పండుగ బోనాల పండుగ.
బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరు పుకొంటారు (జూలై/ఆగస్టు). - ఈ బోనాల పండుగ జరిగే తంతును ఊరడి అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఊర పండుగ అని కూడా పేరు.
- లష్కర్ బోనాలు ఎలా మొదలయ్యా యంటే.. 1815లో హైదరాబాద్ రెజిమెంట్ కు చెందిన సైనికుడు సూరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళీ దేవాలయాన్ని దర్శించుకుని జంటనగరాల్లో కలరా వ్యాప్తి
చెందకుండా నిర్మూలన జరుగాలని ప్రార్థించాడు. - అక్కడి నుంచి తిరిగివచ్చేటప్పుడు మహంకాళి విగ్రహాన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్ లో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ బోనాలనే లష్కర్ బోనాలు అంటారు. లష్కర్ అంటే సైన్యం అని అర్థం.
- బోనాల ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోట లోని ఎల్లమ్మ ఆలయం (జగదాంబిక ఆల యం) వద్ద ప్రారంభమవుతాయి.
- అనంత రం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్ద ర్వాజ సింహవాహిని ఆలయం, బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం ఇలా ప్రధాన ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. జంటనగరాల్లోనే కాకుండా తెలంగాణ వ్యా ప్తంగా కూడా బోనాలను వివిధ గ్రామదేవ తలకు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
- పోతరాజు: ఘల్లుఘల్లుమనే పెద్ద మువ్వలు కుట్టిన ఎర్రరంగు లాగు, కాళ్లకు గజ్జెలు, దవ డలకు రెండు నిమ్మపండ్లు, కండ్ల కింద కాటుక, జులపాల జుట్టు, ఒళ్లంతా పసుపు పచ్చని బండారి పూసుకుని, చేతిలో పెద్ద కొరడా పట్టుకుని, డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. పోతరాజు గ్రామదేవతలకు సోదరుడు. ఒకప్పటి బైండ్ల పూజారి ప్రతిరూపమే పోతరాజు.
- గావుపట్టడం: పోతరాజుకు పూనకం వచ్చిన ప్పుడు భక్తులు ఆయన దగ్గరకు మేకపో తును తీసుకొస్తారు. ఉగ్రరూపంలో ఉన్న పోతరాజు ఆ మేకపోతు గొంతు కొరికి తలను, మొండెంను వేరుచేస్తాడు. దీన్నే గావుపట్టడం అంటారు.
- రంగం: బోనాల పండుగ రెండోరోజు రంగం కార్యక్రమం జరుగుతుంది. రంగం కార్యక్రమంలో పూనకం వచ్చిన మహిళ బోర్లించిన పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెబు తుంది. ఈ భవిష్యవాణిలో ప్రధానంగా వాతావరణ పరిస్థితులు, పంటలు మొదలైన వాటి గురించి భవిష్యత్తు చెబుతుంది. ముది రాజ్ కులస్తురాలు అమ్మవారి పూజారిగా బోనాల పండుగరోజు ఉపవాసం చేసి, తర్వాత రోజు రంగం పేరుతో భవిష్యవాణి వినిపిస్తుంది.
- పచ్చికుండను కుమ్మరి రత్తయ్య వంశీయులు తయారు చేస్తారు. బోనాల పండుగ సందర్భంగా చేసే నృత్యం బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం రత్తయ్య వంశీయులు తయారు చేస్తారు. బోనాల పండుగ సందర్భంగా చేసే నృత్యం బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం 2014, జూన్ 18న రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
- బోనాల పండుగ సందర్భంగా నూతన దంప తులు అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తారు. 1908లో మూసీనది వరదలవల్ల తీవ్ర నష్టం జరిగిన సందర్భంలో మీర్ మహ బూబ్ అలీఖాన్ (ఆరో నిజాం) హిందూ మత సంప్రదాయాల ప్రకారం మీరాలం మండి దగ్గర మహంకాళి దేవతకు బోనం సమర్పించాడని పేర్కొంటారు.
- ఘటోత్సవం లేదా ఘటం ఊరేగింపు కార్య క్రమంలో అక్కన్న, మాదన్న ఆలయానికి
చెందిన ఘటం ముందుగా ఉంటుంది. ఈ ఘటం ఊరేగింపు నయాపూల్ వద్ద ఘటం నిమజ్జనంతో ముగుస్తుంది. - భక్తులు వేపాకులు వేసిన పసుపు నీళ్లను అమ్మవారి ముందు ఆరబోసి తమను చల్లగా చూడమని కోరుతారు. దీన్ని సాక ఇవ్వడం అంటారు. పూర్వం సాకగా వేపా కులు వేసిన నీళ్లకు బదులుగా తాటికల్లును ఆరబోసేవారు.
- ‘తెలంగాణ బోనాలు’ అనే పుస్తకాన్ని తెలం గాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని రాసింది ప్రొఫెసర్ ననుమాస స్వామి.
- తెలంగాణ సాహిత్య కళావేదిక బోనాలు– మహంకాళి జాతర అనే పుస్తకాన్ని ప్రచురిం చింది. ఈ పుస్తకంలో హైదరాబాద్ లో జరిగే బోనాల పండుగకు సంబంధించిన రికా ర్డులు కుతుబ్‌షాహీల కాలంలోని 1875 నుంచి ఉన్నాయి. సుల్తాన్ అబుల్ హసన్ తా తానీషా గోల్కొండ కోటలో ఎల్లమ్మ ఆల యాన్ని నిర్మించి 1875లో అంగరంగ వైభ వంగా బోనాల ఉత్సవం నిర్వహించాడు. ఇక్కడ ఏటా జరిగే బోనాల పండుగ గోల్కొండ బోనాలుగా ప్రసిద్ధి.
బతుకమ్మ:
- ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్ర దాయాలకు ప్రతీక.
- బతుకమ్మ పండుగను భాద్రపద బహుళ అమావాస్య నుంచి మహర్నవమి వరకు 9 రోజులు నిర్వహిస్తారు.
- బతుకమ్మను పేర్చడానికి ప్రధానంగా ఉప యోగించే పువ్వులు గునుగు, తంగేడు. వీటి తోపాటు గుమ్మడి, కట్ల, దోస, చామంతి, తామర పువ్వులను కూడా పేర్చుతారు.
- తొమ్మిది రోజులు జరిగే బతుకమ్మ పండు గకు ఒక్కొక్క రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆరో రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. ఆ రోజును అర్రెం అంటారు.
- ఆఖరి రోజైన సద్దుల బతుకమ్మనాడు మలీద ముద్దలు తయారు చేస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం 2014, జూన్ 18న బతు కమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
- ఈ పండుగలో గౌరమ్మను పూజిస్తారు. బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసిన వారు బండారు సుజాత శేఖర్. ఈమె బతు కమ్మ పండుగపై రాసిన పరిశోధన గ్రంథం తెలంగాణ బతుకమ్మ పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక పరిశీలన.
- బతుకమ్మలో ఉపయోగించే తంగేడు పువ్వులు పేరిట పుస్తకాన్ని రాసింది – ఆచార్య ఎన్ గోపి.
- బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాల గురించి భట్టు నరసింహ కవి చెప్పినట్లు బిరుదు రాజు రామరాజు తన తెలుగు జానపద గేయ సాహిత్యంలో వివరించారు.
తీజ్ పండుగ:
- ఈ పండుగను వ్యవసాయ పనులు చేసు కునే లంబాడాలు ప్రతి ఏటా నాట్లు వేసు కునే ముందు నిర్వహిస్తారు.
- తీజ్ పండుగను సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఆషాఢ లేదా శ్రావణ మాసంలో జరుపుకొంటారు.
- ఈ పండుగను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. పెండ్లికాని అమ్మాయిలు మాత్రమే ఈ పండుగను జరుపుకొంటారు.
- ఈ పండుగ తొలి రోజు వెదురు లేదా దసేరు చెట్టు తీగలతో చేసిన బుట్టల్లో మట్టి నింపి అందులో స్థానికంగా లభించే విత్తనాలు ముఖ్యంగా గోధుమలు నాటుతారు.
- ఈ బుట్టలను తొమ్మిది రోజులపాటు ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు.
- తొమ్మిదో రోజు మొలకెత్తిన విత్తనాల బుట్ట లను దగ్గరిలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
- ఈ ఉత్సవంలో లంబాడాలు మేరమ్మ దేవ తను పూజిస్తారు. పిల్లలు, మహిళలను రక్షించే తల్లిగా మేరమ్మను భావిస్తారు. తీజ్ ఉత్సవంలో 7వ రోజున చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన పదార్థం)ను మేరమ్మకు సమ ర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘ఢమోళి‘ అంటారు.
- వెండితో చేసిన మేరమ్మ విగ్రహం ముందు మేకపోతును బలిచ్చే కార్యక్రమాన్ని
‘అకాడో‘ అంటారు. - తీజ్ ఉత్సవాల్లో ‘భోరడి ఝష్కేరో’ కార్య క్రమం ప్రత్యేకమైంది. బోరడి ఝష్కేరో అంటే రేగుముళ్లుతో గుచ్చడం అని అర్థం. మేరమ్మ దేవతతోపాటు సీతాభవాని మాతకు, సేవాలాల్ మహరాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
గమనిక: వర్షాకాల ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును తీజ్ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా తీజ్ అంటారు.
Leave a Reply