Question: 1
జూలై, 2024లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ గాంధీ పార అభయ హస్తం పథకం 2024, దీనిలో ఉత్తీర్ణులైన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు (EWS/BC/SC/ST) రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తుంది.
యూ పి ఎస్ సి ప్రిలిమినరీ పరీక్ష పాసైన వారికి మెయిన్సుకు సిద్ధం కావడానికి సహాయంగా
ఎంబీబీఎస్ పాస్ అయి నీట్ పీజీకి సిద్ధం కావడానికి సహాయంగా
ఇంజనీరింగ్ కోర్సు పాస్ అయి విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి
ఐఐటీజేయి ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయి మెయిన్స్కు సిద్ధం కావడానికి సహాయంగా
Answer : 1
యూ పి ఎస్ సి ప్రిలిమినరీ పరీక్ష పాసైన వారికి మెయిన్సుకు సిద్ధం కావడానికి సహాయంగా
Question: 2
భారతదేశం U – WIN ప్లాట్ ఫారమ్ను దీనికై ప్రారంభించింది.
సీనియర్ సిటిజన్ల ఆరోగ్య తనిఖీ స్థితిని రికార్డ్ చేయడం.
యువ క్రీడాకారుల పురోగతిని ట్రాక్ చేయడం
శాస్త్రవేత్తలు కావాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం కోసం నమోదు చేసుకోవడం
గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ప్రతి టీకా విషయాన్ని సేకరించడం
Answer : 4
గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ప్రతి టీకా విషయాన్ని సేకరించడం
Question: 3
జూలై, 2024లో, ఈ దేశ పార్లమెంట్ ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన బిల్లును ఆమోదించింది.
జోర్డాన్
లెబనాన్
ఇజ్రాయెల్
ఇరాన్
Answer : 3
ఇజ్రాయెల్
Question: 4
ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫారెస్ట్స్, 2020- నివేదిక ప్రకారం, ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణ శాతం
4%
2%
5 %
3%
Answer : 2
2%
Question: 5
జూలై, 2024లో ప్రారంభించబడిన ‘MANAS’ దీనికి సంబంధించిన జాతీయ హెల్ప్ లైన్
శరణార్థులు
ప్రమాదాలు
మత్తు మ౦దులు
మానవ అక్రమ రవాణా
Answer : 3
మత్తు మ౦దులు