Home  »  TGPSC 2024  »  Central Schemes-1

Central Schemes-1 (కేంద్ర ప్రభుత్వ పథకాలు) Previous Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర ప్రభుత్వ పథకాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది అక్షరాస్యత కార్యక్రమాలను వాటి సంబంధిత వివరణలతో జతపర్చండి.
అక్షరాస్యత కార్యక్రమాలు వివరణలు
1. సర్వ శిక్షా అభియాన్ (SSA)
2. జాతీయ అక్షరాస్యత మిషన్ (NLM)
3. మధ్యాహ్న భోజన పథకం (MDM)
4. బేటీ బచావో, బేటీ పఢావో (BBBP)

A. పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందించడం ద్వారా పిల్లల పోషణ మరియు విద్యా ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

B. బాలికలు తమ పాఠశాల విద్యను పూర్తి చేసేలా విద్య మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.

C. సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించే లక్ష్యంతో ఒక సమగ్ర కార్యక్రమం.

D. నిరక్షరాస్యతను నిర్మూలించడానికి మరియు 15-35 ఏళ్ల మధ్య ఉన్న అక్షరాస్యత లేని వ్యక్తులకు క్రియాత్మక అక్షరాస్యతను అందించడానికి ప్రారంభించబడింది

  1. 1-A, 2-B, 3-C, 4-D
  2. 1-C, 2-D, 3-A, 4-B
  3. 1-D, 2-C, 3-B, 4-A
  4. 1-C, 2-A, 3-D, 4-B
View Answer

Answer: 2

1-C, 2-D, 3-A, 4-B

Question: 7

క్రింది అరోగ్య మిషన్ లను వాటిని ప్రారంభించిన సంవత్సరంతో జతపరుచుము :
ఆరోగ్య మిషన్ పేరు
A. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్
B. జాతీయ ఆయుష్ (AYUSH) మిషన్
C. నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్
D. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్
ప్రారంభించిన సంవత్సరం
I. 2018
II. 2008
III. 2005
IV. 2014
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-III; B-IV; C-I; D-II
  2. A-II; B-I; C-IV; D-III
  3. A-IV; B-II; C-III; D-I
  4. A-III; B-IV; C-II; D-I
View Answer

Answer: 4

A-III; B-IV; C-II; D-I

Question: 8

ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) గురించిన ఈ క్రింది లక్ష్యాలలో ఏవి సరైనవి ?
A. షెడ్యూల్డ్ కులాల ప్రజలు అధికంగా ఉన్న గ్రామాలలో తగిన మౌలిక సదుపాయాలు మరియు అవసరమైన సేవలను నిర్ధారించడం ద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధి సూచికలను మెరుగు పరచడం.
B. అక్షరాస్యతను పెంపొందించడం మరియు నివాస సౌకర్యాలతో కూడిన పాఠశాల మరియు ఉన్నత విద్యాసంస్థలలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నమోదును ప్రోత్సహించడం.
C. నైపుణ్యాభివృద్ధి ద్వారా అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా షెడ్యూల్డ్ కుల కమ్యూనిటీల పేదరికాన్ని తగ్గించడం.
D. మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలు – ప్రధాన మంత్రి అభ్యుదయ గ్రామ యోజన (PMAGY) మరియు బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రావాస్ యోజన (BJRCY) మరియు అటల్ వాయో అభ్యుదయ యోజన (AVYAY) విలీనం చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. A, B మరియు C మాత్రమే
  3. A, B, C మరియు D
  4. A మరియు D మాత్రమే
View Answer

Answer: 2

A, B మరియు C మాత్రమే

Question: 9

జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 (NFSA) కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది/ఏవి ఒప్పు ?
A. ఇది మొత్తం గ్రామీణ జనాభాలో 75% వరకు కవరేజీని అందిస్తుంది.
B. ఇది రెండు విభాగాల లబ్ధిదారులు, i.e అంత్యోదయ అన్న యోజన (AAY) గృహస్థులు మరియు ప్రాధాన్యత కలిగిన గృహస్థులకు వర్తిస్తుంది.
C. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లలు స్థానిక ఆంగన్ వాడిలలో ఉచిత భోజనం మరియు ప్రసూతి ప్రయోజనాలు పొందడానికి అర్హులు కాదు.
D. దీనిలో మధ్యాహ్నా భోజన పథకం మాత్రమే వుంది.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. B మాత్రమే
  3. A, B, C మరియు D
  4. A మరియు D మాత్రమే
View Answer

Answer: 1

A మరియు B మాత్రమే

Question: 10

క్రింది వాటిలో ఏ పథకం/పథకాలు, అంశం/అంశాలు ప్రత్యేకించి షెడ్యూలు తెగల సామాజిక-ఆర్థిక అభివృద్ధికోసం ఉద్దేషించబడినది/వి.
A. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన
B. రాజ్యాంగ ప్రకరణ 275(1) ప్రకారం ఇచ్చే నిధులు
C. ప్రధాన మంత్రి జనజాతీయ వికాస్ మిషన్
D. అటల్ వయో అభ్యుదయ యోజన
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మాత్రమే
  2. A, B మరియు C మాత్రమే
  3. D మాత్రమే
  4. B, C మరియు D మాత్రమే
View Answer

Answer: 2

A, B మరియు C మాత్రమే

Recent Articles