Home  »  TGPSC 2024  »  World Geography-1

World Geography (వరల్డ్ జియోగ్రఫీ)-1 Previous Questions and Answers in Telugu

These World Geography (వరల్డ్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

దేశాల మధ్య విభేదాలకు సంబంధించి జాబితా-1 ను జాబితా-2 తో జతచేయండి.
జాబితా-1 (ప్రదేశాలు)
a. నగోర్నో-కరాబాఖ్.
b.సెంకాకు దీవులు
c. కురిల్ దీవులు
d. వెస్ట్ బ్యాంక్
జాబితా-2 (విభేదాలు గల దేశాలు)
i. చైనా మరియు జపాన్
ii. ఆర్మేనియా మరియు అజర్ బైజాన్
iii. రష్యా మరియు జపాన్
iv. ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా

  1. a-ii, b-i, c-iii, d-iv
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a-ii, b-iii, c-i, d-iv
  4. a-iii, b-ii, c-i, d-iv
View Answer

Answer: 1

a-ii, b-i, c-iii, d-iv

Question: 2

కింది వ్యాఖ్యలను పరిగణించండి :
ధృవీకరణ (A): తేమతో కూడిన గాలి (పవనము) కదులుతూ ఏదైనా స్థలాకృతి అవరోధాన్ని తాకి పైకి నెట్టబడినప్పుడు పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది.
కారణం(R): పర్వతీయ వర్షపాతం చాలా వరకు పవనాభిముఖం (windward) వైపు కురుస్తుంది, గాలి వెనక (leeward) వైపు పర్వత ప్రాంతం పొడిగా ఉండే అవకాశం ఉంది.
సరైన సమాధానం ఎంచుకొనుము:

  1. (A) నిజం, కానీ (R) తప్పు.
  2. (A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A)కు సరైన వివరణ.
  3. (A) తప్పు, కానీ (R) నిజం.
  4. (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) అనేది (A)కు సరైన వివరణ కాదు.
View Answer

Answer: 4

(A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) అనేది (A)కు సరైన వివరణ కాదు.

Question: 3

కింది శీతోష్ణస్థితులలో దేనిని ‘స్క్లిరాఫిల్’ పర్యావరణ వ్యవస్థ లేదా బయోమ్ అని కూడా పిలుస్తారు?

  1. మద్యధరా శీతోష్ణ స్థితి
  2. టుండ్రా శీతోష్ణ స్థితి
  3. భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి
  4. ఋతుపవన శీతోష్ణ స్థితి
View Answer

Answer: 1

మద్యధరా శీతోష్ణ స్థితి

Question: 4

క్రింది వాటిలో ఏ ఫ్లూవియల్ (నదీకృత) భూస్వరూపాలు పునరుజ్జీవింపబడిన స్థలాకృతితో సంబంధం కలిగి ఉన్నాయి?
A. ఇన్ సైజ్డ్ మియాండర్
B. ఎన్ ట్రెంచడ్ మియాండర్
C. నిక్ పాయింట్
D. నాచురల్ లెవీస్
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A, B, C మరియు D
  2. B, C మరియు D మాత్రమే
  3. A, C మరియు D మాత్రమే
  4. A, B మరియు C మాత్రమే
View Answer

Answer: 4

A, B మరియు C మాత్రమే

Question: 5

ఖండతీరపు అంచులకు (Continental Shelf) సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
A. ఖండతీరపు అంచులు సముద్రపు నీటిలో మునిగి ఉన్న ఖండతీరపు ఉపాంత (మార్జినల్) ప్రాంతాలు.
B. ఖండతీరపు అంచులు దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంబడి చాలా వెడల్పుగా మరియు విస్తృతంగా ఉంటాయి, ఇక్కడ ఎత్తైన పర్వతాలు తీరానికి చాలా దగ్గరగా మరియు సమాంతరంగా ఉంటాయి.
C. న్యూఫౌండ్ ల్యాండ్ చుట్టూ విస్తృతమైన ఖండతీరపు అంచులు కనిపిస్తాయి.
D. అనేక ఉపాంత సముద్రాలు ఉత్తర అట్లాంటిక్ యొక్క ఖండతీరపు అంచులలో ఉన్నాయి.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. A, B మరియు C మాత్రమే
  3. A, C మరియు D మాత్రమే
  4. A, B, C మరియు D
View Answer

Answer: 3

A, C మరియు D మాత్రమే

Recent Articles