Home  »  TGPSC 2024  »  Environment-1

Environment-1 (పర్యావరణం) Previous Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది ప్రకటనలలో వాతావరణ మార్పు కారణాలు మరియు పర్యవసానాల గురించిన ఏది/వి సరైనది/వి?
A. మానవ కార్యకలాపాలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు మరియు వాతావరణ మార్పులపై గణనీయమైన ప్రభావాన్ని చూపవు.
B. వాతావరణ మార్పులకు ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలతో లేదా మంచుకొండలు మరియు
హిమానీనదాలు కరగడంతో సంబంధం ఉండదు.
C. వాతావరణ మార్పు ప్రపంచ సముద్ర మట్టాలు లేదా సముద్ర పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపదు.
D. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మహాసముద్రాల ఆమ్లత్వం పెరగడం మొదలైనవి జరుగుతున్నాయి.

  1. ప్రకటన D మాత్రమే
  2. ప్రకటనలు A మరియు C
  3. ప్రకటనలు A మరియు B
  4. ప్రకటనలు B మరియు C
View Answer

Answer: 1

ప్రకటన D మాత్రమే

Question: 2

కింది వాటిలో భారతదేశంలో కార్బన్ ఫుట్ ప్రింట్ ల గురించి సరైనది ఏది?
A. భారతదేశం యొక్క కార్బన్ ఫుట్ ప్రింట్ గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా తగ్గుతోంది.
B. భారతదేశంలోని వ్యవసాయ రంగం దేశం యొక్క కర్బన్ ఉద్గారాలకు ప్రధాన కారణం
C. అడవుల పెంపకం మరియు స్థిరమైన భూ నిర్వహణలో ప్రయత్నాలు భారతదేశం యొక్క కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించడానికి దోహదం చేయవు.
D. కర్బన్ ఉద్గారాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక వంటి విధానపరమైన చర్యలను అమలు చేసింది.

  1. ప్రకటన D
  2. ప్రకటనలు A మరియు B
  3. ప్రకటన B
  4. ప్రకటన A
View Answer

Answer: 1

ప్రకటన D

Question: 3

కింది ప్రకటనలలో భారతదేశంలోని వాయు నాణ్యతా సూచిక (AQI)కి సంబంధించి ఏవి సరైనవి?
A. AQI కి గాలిలో ఆరు కేటగిరీలు ఉన్నాయి – మంచి, సంతృప్తికరమైన, మధ్యస్థంగా కలుషితమైన, హీనమైన,అతి హీనమైన మరియు తీవ్రమైన.
B. గాలి నాణ్యత కొలత ఎనిమిది కాలుష్య కారకాలపై ఆధారపడి ఉంటుంది.
C. AQI అనేది 0-50 మధ్య సంతృప్తికరంగా పరిగణించబడుతుంది.

  1. A, B మరియు C
  2. A మరియు C
  3. B మరియు C
  4. A మరియు B
View Answer

Answer: 4

A మరియు B

Question: 4

కింది ప్రకటనలలో ఓజోన్ పొర క్షీణత మరియు దాని ప్రభావం గురించిన ఏది/వి సరైనది/వి?
A. ఓజోన్ పొర క్షీణత ప్రధానంగా ప్రకృతి కారకాల వల్ల సంభవిస్తుంది మరియు దీనికి మానవ కార్యకలాపాలతో సంబంధం లేదు.
B. ఓజోన్ పొర క్షీణించడం వల్ల భూమి ఉపరితలంపైకి చేరే అతినీలలోహిత వికిరణం తగ్గుతుంది.
C. మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్-క్షీణించే పదార్థాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని తగ్గించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపదు.
D. ఓజోన్ పొర క్షీణత ఫలితంగా అతినీలలోహిత వికిరణం వ్యాప్తి చెందుతుంది, ఇది ఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణ వ్యవస్థలపై హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది.

  1. ప్రకటన D మాత్రమే
  2. ప్రకటనలు A మరియు C
  3. ప్రకటనలు B మరియు C
  4. ప్రకటనలు A మరియు B
View Answer

Answer: 1

ప్రకటన D మాత్రమే

Question: 5

కింది జతలలో గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావం మరియు దాని పరిణామాన్ని సరిగ్గా సూచించునది ఏది?
A. విపరీత వాతావరణ సంఘటనలు – కరువు మరియు హరికేనులు తరచుగా సంభవించడం పెరుగుతుంది.
B. జీవవైవిధ్యం యొక్క నష్టము – పర్యావరణ వ్యవస్థలు మరియు పర్యావరణం కోసం మెరుగైన పరిస్థితులు
C. కరుగుతున్న మంచు కొండలు- సముద్ర మట్టాల యొక్క పెరుగుదల

  1. A మరియు B
  2. A మరియు C
  3. A, B మరియు C
  4. B మరియు C
View Answer

Answer: 2

A మరియు C

Recent Articles