Home  »  TGPSC 2024  »  Central Schemes-1

Central Schemes-1 (కేంద్ర ప్రభుత్వ పథకాలు) Previous Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర ప్రభుత్వ పథకాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

స్వధార్ గృహ పథకమునకు సంబంధించి క్రింది వాఖ్యలలో ఏవి నిజమైనవి ?
A. గిరిజన మహిళలకు సంబంధించిన పథకము.
B. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమగూర్చును.
C. మహిళలకు గృహములను నిర్మించును.
D. మహిళలకు న్యాయ సహయము మరియు మార్గ దర్శకత్వము కల్పించును.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. B మరియు C మాత్రమే
  3. A, B మరియు D మాత్రమే
  4. B మరియు D మాత్రమే
View Answer

Answer: 4

B మరియు D మాత్రమే

Question: 12

ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన 2016 – 2020 కి సంబంధించి దిగువ వాటిలో ఏది/ఏవి నిజమైనవి ?
A. ఇది నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందించి ధృవీకరించే గ్రాంటు-ఆధారిత పథకం
B. దీనిలో కేంద్ర ప్రాయోజిత, కేంద్ర నిర్వహణ మరియు రాష్ట్ర ప్రాయోజిత రాష్ట్ర నిర్వాహణ అనే రెండు భాగాలు ఉండినాయి
C. ఇది పాఠశాల, కళాశాల చదువులను మధ్యంతరంగా నిలిపివేయబడిన వారికి మరియు నిరుద్యోగులకు ఇది నైపుణ్యత అభివృద్ధి శిక్షణలను అందించింది.
D. ఇది నైపుణ్యతలపై ఒక రిజిస్టరీని రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A, B మరియు C మాత్రమే
  2. A, B మరియు D మాత్రమే
  3. A, C మరియు D మాత్రమే
  4. A, B, C మరియు D
View Answer

Answer: 3

A, C మరియు D మాత్రమే

Question: 13

ఉన్నత సామర్థ్యం గల సౌర మాడ్యూల్స్ లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం (PLI) పథకంనకు సంబంధించి కింది వాటిని పరిగణించండి :
A. ఈ పథకం విద్యుత్తు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం అమలు చేస్తున్నది.
B. సౌర విద్యుత్తు ఉత్పత్తిలో స్థానిక వనరుల వినియోగానికి అవసరమయ్యే ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 2

B మాత్రమే

Question: 14

ఈ క్రింది పథకాలలో ఏది రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి ఉద్దేశించబడినది ?

  1. భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి
  2. వ్యవసాయ యాంత్రీకరణ పథకం
  3. వ్యవసాయదారుల ఉత్పత్తిదారుల సంస్థ పథకం
  4. వికసిత్ కిసాన్ భారత్ పథకం 2.0
View Answer

Answer: 1

భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి

Question: 15

జల్ జీవన్ మిషన్ భారత ప్రభుత్వ కార్యక్రమం. జల్ జీవన్ మిషన్ పరంగా, క్రింది వ్యాఖ్యలలో ఏవి సరియైనవి?

A. 2019 లో ‘హర్ ఘర్ జల్’ ప్రథమ యత్నం ప్రారంభించబడింది.
B. అగస్ట్ 2022 లో మొదటి సారిగా దృవీకరించబడ్డ హర్ ఘర్ జల్ రాష్ట్రం గోవా.
C. 2025 వరకు ప్రతి గ్రామీణ గృహాలన్నింటికి సురక్షిత త్రాగు నీరు పంపిణీ కొళాయిల ద్వారా పంపిణీచేయుటకు హర ఘర్ జల్ ఉపక్రమించబడింది.
D. 30.01.2024 నాటికి 73.7% కంటే అధికంగా గృహ యాజమానులకు కుళాయి ద్వారా నీరు అందుతుందని నివేదించారు.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. A, B మరియు C మాత్రమే
  3. A, B మరియు D మాత్రమే
  4. A, C మరియు D మాత్రమే
View Answer

Answer: 3

A, B మరియు D మాత్రమే

Recent Articles