Home  »  TGPSC 2024  »  Disaster Management-1

Disaster Management-1 (విపత్తు నిర్వహణ) Questions and Answers in Telugu

These Disaster Management (విపత్తు నిర్వహణ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది ఘటనలను అవి జరిగిన క్రమం ఆధారంగా అంటే ప్రారంభం నుండి ఇటీవలి వరకు కాలక్రమానుసారం అమర్చండి.
A. మధ్యప్రదేశ్లోని భోపాల్లో పురుగు మందుల కర్మాగారంలో మిథైల్ ఐసోసయనేట్ వాయువు బయటకి వెలువడి వేలాది మంది మరణాలకు, అలాగే దీర్ఘకాలిక భూ కాలుష్యానికి దారితీసింది.
B. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం, కాలుష్య నియంత్రణ చర్యల అమలు ద్వారా కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో గంగానది ప్రక్షాళనకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
C. ధూళి కణాల (PM) స్థాయిలను తగ్గించడానికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా మరియు వివిధ కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేయడం ద్వారా భారతదేశం అంతటా నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించాలన్నది భారత ప్రభుత్వం ప్రారంభించిన NCAP లక్ష్యం.

  1. A, B, C
  2. B, A, C
  3. B, C, A
  4. C, B, A
View Answer

Answer: 1

A, B, C

Question: 7

ఈ క్రింది ప్రకటనలలో భారతదేశం యొక్క వాయు కాలుష్యం గురించి ఏది/వి సరైనది/వి?
A. భారతదేశంలో వాయు కాలుష్యం ప్రధానంగా దుమ్ము తుఫానులు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి సహజ కారకాల వల్ల సంభవిస్తుంది.
B. భారత ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఎటువంటి కార్యక్రమాలను అమలు చేయలేదు.
C. భారతదేశం యొక్క జాతీయ స్వచ్చ వాయు కార్యక్రమము (NCAP) 2024 నాటికి కణాల కాలుష్యాన్ని 20-30% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
D. ఢిల్లీ వంటి భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం ప్రధానంగా వాహనాల ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు జీవరాశి దహనం వల్ల సంభవిస్తుంది.

  1. ప్రకటన A మరియు C
  2. ప్రకటన B మరియు C
  3. ప్రకటన A మరియు B
  4. ప్రకటన D
View Answer

Answer: 4

ప్రకటన D

Question: 8

క్రింది ప్రకటనలలో భూకంప మాపింగ్ కి సంబంధించి ఏదీ సరైనది?
A. దేశంలో భూకంపాల చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలోని మొత్తం ~59% భూభాగం భూకంపాలకు గురి అవుతుంది.
B. దేశ భూకంప మండలాల (zone) మాపింగ్ ప్రకారం, మొత్తం భూభాగాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజించారు.
C. మండలం-I భారత దేశంలో అతి తక్కువ భూకంప తీవ్రత కలిగిన మండలం.

  1. ప్రకటనలు A, B మరియు C
  2. A కానీ లేదా B కానీ ఏదీ సరైనది కాదు
  3. ప్రకటనలు B మరియు C మాత్రమే
  4. ప్రకటనలు A మరియు B
View Answer

Answer: 4

ప్రకటనలు A మరియు B

Question: 9

కింది ప్రకటనల్లో భారతదేశంలో భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం మరియు తుఫానుల గురించిన ఏది/వి సరైనది/వి?
A. భారతదేశం భూకంప క్రియాశీల ప్రాంతంలో లేదు మరియు భూకంపాలకు అవకాశం లేదు.

B. భారతదేశంలో కొండచరియలు విరిగిపడటం ప్రధానంగా తేలికపాటి వర్షపాతం మరియు వృక్షసంపద పెరుగుదల వంటి కారణాల వల్ల సంభవిస్తుంది.
C. భారతదేశంలోని తీర ప్రాంతాలు వర్షాకాలంలో తుఫానులకు గురికావు.
D. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం విపత్తు సంసిద్ధత మరియు ఉపశమన చర్యలను అమలు చేసింది.

  1. ప్రకటనలు A మరియు C
  2. ప్రకటనలు B మరియు C
  3. ప్రకటనలు A మరియు B
  4. ప్రకటన D మాత్రమే
View Answer

Answer: 4

ప్రకటన D మాత్రమే

Recent Articles