Home  »  TGPSC 2024  »  Environment-1

Environment-1 (పర్యావరణం) Previous Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది కార్యక్రమాలను ప్రారంభం నుండి ఇటీవలి వరకు కాలక్రమానుసారం అమర్చండి.
A. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మరియు శక్తి, వ్యవసాయం మరియు అటవీ వంటి రంగాలలోని కార్యక్రమాలతో సహా వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా వ్యూహాలను వివరించే NAPCCని భారత ప్రభుత్వం ప్రారంభించింది.
B. వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందాన్ని భారతదేశం ఆమోదించింది, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తీవ్రతను తగ్గించడానికి మరియు అటవీకరణ ద్వారా కార్బన్ సింక్ను పెంచడానికి కట్టుబడి ఉంది.
C. పారిస్ ఒప్పందం ప్రక్రియలో భాగంగా భారతదేశం తన INDC లను సమర్పించింది, 2005 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి GDPలో 33-35% ఉద్గారాల తీవ్రతను తగ్గించాలని ప్రతిజ్ఞ చేసింది.

  1. B, C, A
  2. C, B, A
  3. A, C, B
  4. A, B, C
View Answer

Answer: 3

A, C, B

Question: 12

దిగువ ఇచ్చిన ప్రకటనల ఆధారంగా, ఎంపికలలో సరైనది ఏది ?
1. శిలాజ ఇంధనాలు – బొగ్గు, చమురు మరియు వాయువు – ప్రపంచ వాతావరణ మార్పులకు అతిపెద్ద సహకారులు, ప్రపంచ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో 85 శాతానికి పైగా మరియు మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 95 శాతం వాటాను అవి కలిగి ఉన్నాయి.
2. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు భూమిని కప్పేస్తాయి కాబట్టి, అవి సూర్యుని వేడిని బంధిస్తాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులకు దారితీస్తుంది. నమోదైన చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా ప్రపంచం ఇప్పుడు వేడెక్కుతోంది.

  1. ప్రకటన 2 మాత్రమే సరైనది.
  2. ప్రకటనలు 1 మరియు 2 రెండూ సరైనవి.
  3. ప్రకటన 1 మాత్రమే సరైనది.
  4. ప్రకటన 1 కానీ లేదా ప్రకటన 2 కానీ ఏవి సరైనవి కావు.
View Answer

Answer: 1

ప్రకటన 2 మాత్రమే సరైనది.

Question: 13

వాతావరణ మార్పు ప్రభావానికి సంబంధించి సరియైన వ్యాఖ్యల సమితిని ఎన్నుకోండి:

  1. సముద్రమట్టం పెరగడం, ఎక్కువ తీవ్రమైన హరికేన్ లు (intense hurricanes), జాతుల (species) వలస
  2. గ్లోబల్ ఉష్ణోగ్రత తగ్గడం, సముద్ర మంచు పెరగడం, ఉష్ణమండల అడవులు విస్తరణ కావడం
  3. సముద్రపు ఆమ్లత్వం తగ్గడం, CO, ఉద్గారం తగ్గడం, హిమనీనద (glacier) ద్రవ్యరాశి పెరగడం
  4. వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం, పునరుత్పాదక శక్తి వనరులు తగ్గడం, ధ్రువపు ఎలుగుబంటి జనాభా పెరగడం
View Answer

Answer: 1

సముద్రమట్టం పెరగడం, ఎక్కువ తీవ్రమైన హరికేన్ లు (intense hurricanes), జాతుల (species) వలస

Question: 14

ధ్రువ సుడిగుండం విచ్చిన్నము ఓజోన్ పొర స్థిరీకరణకు దోహదం చేస్తుంది ఎందుకంటే :

  1. ఓజోన్ ను తగ్గించు రసాయనాలను పోగు చేస్తాయి
  2. ఓజోన్ ను నాశనం చేసే క్లోరిన్ రూపాలను విక్షేపనం చేస్తాయి
  3. ఓజోన్ ను తగ్గించు చర్యలు వేగాలను పెంచుతాయి
  4. స్టాటోస్పియర్ లోనికి అదనపు క్లోరీన్ ను విడుదల చేయటాన్ని ప్రేరేపిస్తుంది
View Answer

Answer: 2

ఓజోన్ ను నాశనం చేసే క్లోరిన్ రూపాలను విక్షేపనం చేస్తాయి

Question: 15

కింది చట్టాలను/నియమాలను వాటిని ఆమోదించిన సంవత్సరంతో జత పర్చుము :
భారత దేశంలోని చట్టం/నియమం
A. అడవి (పరిరక్షణ) చట్టం
B. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం
C. వన్య ప్రాణుల (భద్రత) చట్టం
D. ప్రమాదకరమైన వ్యర్థాలు (నిర్వహణ, నిర్వహించడం మరియు సరిహద్దులు దాటి నిర్వహించడం) మొదటి సవరణ చట్టాలు
E. జీవ వైవిధ్య చట్టం
అమోదించిన సంవత్సరం
I. 2010
II. 2016
III. 2002
IV. 1972
V. 1980
VI. 2020
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-V; B-I; C-IV; D-III, E-VI
  2. A-I; B-IV; C-V; D-III, E-II
  3. A-VI; B-V; C-IV; D-II, E-III
  4. A-V; B-I; C-IV; D-II, E-III
View Answer

Answer: 4

A-V; B-I; C-IV; D-II, E-III

Recent Articles