Home  »  TGPSC 2024  »  Indian Economy-1

Indian Economy (ఇండియన్ ఎకానమీ)-1 Previous Questions and Answers in Telugu

These Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 ప్రకారం, 2019 – 21 మధ్య మొత్తం జనాభాలో బహుముఖ పేదరిక శాతం ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చుము :
A. మేఘాలయ
B. ఉత్తర ప్రదేశ్
C. ఝార్ఖండ్
D. బీహార్
సరైన క్రమాన్ని ఎంచుకొనుము:

  1. A, B, C, D
  2. B, C, D, A
  3. D, C, A, B
  4. D, A, B, C
View Answer

Answer: 3

D, C, A, B

Question: 12

భారత దేశ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి క్రింది వ్యాఖ్యాలలో ఏవి ఒప్పు?
A. ‘పేదరిక నిర్మూలన’ అనేది ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశాలలో ఒకటి.
B. స్థిరత్వంతో కూడిన వృద్ధిని సాధించటం నాల్గవ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉద్దేశాలలో ఒకటి.
C. ఏడవ పంచవర్ష ప్రణాళిక ఆహారం, ఉపాధి మరియు ఉత్పాదకతపై దృష్టిసారించింది.
D. సమ్మిళిత వృద్ధి (Inclusive Growth) ని సాధించటం తొమ్మిదవ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. B, C మరియు D మాత్రమే
  2. A, B మరియు C మాత్రమే
  3. A మరియు D మాత్రమే
  4. A, B, C మరియు D
View Answer

Answer: 2

A, B మరియు C మాత్రమే

Question: 13

మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 కి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ?
A. కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయంలో లింగ బడ్జెట్ వాటా 6% కంటే ఎక్కువగా ఉంది.
B. అంచనా వేయబడిన ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తిలో 5% కంటే ఎక్కువగా ఉంది.
C. అంచనా వేయబడిన పన్నురాబడి 25 లక్షల కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉంది.
D. 2023 – 24 బడ్జెట్ అంచనాలతో పోల్చినప్పుడు, 2024 – 25 బడ్జెట్ లో లింగ బడ్జెట్ కేటాయింపు 20% ఎక్కువగా ఉంది.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. B మరియు C మాత్రమే
  3. C మరియు D మాత్రమే
  4. A, B మరియు D మాత్రమే
View Answer

Answer: 1

A మరియు B మాత్రమే

Question: 14

గృహ వినియోగ వ్యయ సర్వే 2022 – 23 ప్రకారం, క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
A. చత్తీస్ ఘడ్ యొక్క గ్రామీణ మరియు పట్టణ ప్రాంత నెలసరి తలసరి వ్యయం (MPCE) అతి తక్కువగా ఉంది.
B. మేఘాలయాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య సగటు నెలసరి తలసరి వ్యయంలో తేడా అతి తక్కువగా ఉంది.
C. సిక్కిం యొక్క గ్రామీణ మరియు పట్టణ నెలసరి తలసరి వ్యయం అతి ఎక్కువగా ఉంది.
D. చండీఘడ్ యొక్క నెలసరి తలసరి వ్యయం పట్టణ ప్రాంతాలలో అతి తక్కువగా ఉంది.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. B మరియు C మాత్రమే
  3. A మరియు C మాత్రమే
  4. B మరియు D మాత్రమే
View Answer

Answer: 4

B మరియు D మాత్రమే

Question: 15

సుస్థిరాభివృద్ధి లక్ష్యం 2 యొక్క సాధించిన పురోగతికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ?

A. 2030 నాటికి ప్రపంచం శూన్య లేదా సున్నా ఆకలి లక్ష్యాన్ని సాధించే పరిస్థితిలో లేదు.
B. వివిధ రకాలుగా ఉన్న పోషకాహారలోపం యొక్క భారం ఒక సవాలుగా ఉంది.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కాదు
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Recent Articles