Home  »  TGPSC 2024  »  Indian History-7

Indian History-7 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది ప్రకటనలలో సరైనది/వి ఎంచుకోండి
ప్రకటన A: ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా శాసనోల్లంఘన ఉద్యమం 6 ఏప్రిల్ 1930న ప్రారంభమైంది.
ప్రకటన B: గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మహాత్మా గాంధీ కాంగ్రెస్ యొక్క ఏకైక ప్రతినిధిగా ఉండటానికి అంగీకరించారు.

  1. ప్రకటన A మాత్రమే సరైనది
  2. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి
  3. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి కావు
  4. ప్రకటన B మాత్రమే సరైనది.
View Answer

Answer: 4

ప్రకటన B మాత్రమే సరైనది.

Question: 7

కింది వాటిని సరిగ్గా జతపరచండి.
వర్గం -I
a. నీలిమందు తిరుగుబాటు
b. ముండా తిరుగుబాటు
c. పాబ్నా తిరుగుబాటు
d. దక్కన్ అల్లర్లు
వర్గం -II
1. 1875
2. 1873
3. 1899-1900
4. 1859-60

  1. a-4, b-3, c-2, d-1
  2. a-1, b-4, c-3, d-2
  3. a-4, b-2, c-3, d-1
  4. a-1, b-2, c-3, d-4
View Answer

Answer: 1

a-4, b-3, c-2, d-1

Question: 8

1905 నాటి స్వదేశీ ఉద్యమం గురించి A మరియు B అనే రెండు ప్రకటనలు క్రింద ఇవ్వబడ్డాయి. ప్రకటనలను చదవండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన A: బంకిం చంద్ర ఛటర్జీ మరియు వివేకానంద రచనలు విద్యావంతులైన బెంగాలీ యువతలో జాతిని బట్టి గర్వించే ధోరణి మరియు సామాజిక సేవాభావాన్ని పెంపొందించాయి.
ప్రకటన B: స్వదేశీ ఉద్యమం అనేది బెంగాల్లో రహస్య సంఘాల యొక్క కార్యకలాపాల్లో పుంజుకుంది.

  1. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి కావు
  2. ప్రకటనలు A మరియు B రెండు సరైనవి
  3. ప్రకటన B మాత్రమే సరైనది
  4. ప్రకటన A మాత్రమే సరైనది.
View Answer

Answer: 2

ప్రకటనలు A మరియు B రెండు సరైనవి

Question: 9

ఈ ప్రశ్నలో అబనీంద్రనాథ్ ఠాగూర్ భరతమాత చిత్రణ గురించి A మరియు B అనే రెండు ప్రకటనలు ఉన్నాయి. ఈ ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించండి మరియు దిగువ ఇవ్వబడ్డ ఎంపికల్లో సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన A: ఇందులో నాలుగు చేతుల హిందూ దేవత కాషాయ రంగు దుస్తులు ధరించి, పుస్తకం,వరి పనలు, మాల, తెలుపు వస్త్రం పట్టుకున్నట్టు చిత్రీకరించబడింది.
ప్రకటన B: స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయులలో జాతీయ భావనను పెంపొందించేకు మాతృదేవతా రూపాన్ని ఒక చిహ్నంగా చిత్రీకరించబడింది.

  1. ప్రకటన B మాత్రమే సత్యము
  2. ప్రకటన A మాత్రమే సత్యము
  3. ప్రకటనలు A మరియు B రెండూ సత్యాలు
  4. ప్రకటనలు A మరియు B రెండూ అసత్యాలు
View Answer

Answer: 3

ప్రకటనలు A మరియు B రెండూ సత్యాలు

Question: 10

కింది వాటిలో ఏ క్రమం జైన తీర్థంకరుల సరైన ఆరోహణ క్రమం?

  1. రిషభనాథ, అభినందననాథ, సంభవనాథ, అజితనాథ
  2. రిషభనాథ, అజితనాథ, సంభవనాథ, అభినందననాథ
  3. రిషభనాథ, సంభవనాథ, అజితనాథ, అభినందననాథ
  4. రిషభనాథ, అజితనాథ, అభినందననాథ, సంభవనాథ
View Answer

Answer: 2

రిషభనాథ, అజితనాథ, సంభవనాథ, అభినందననాథ

Recent Articles