Home  »  TGPSC 2024  »  Indian Polity-2

Indian Polity-2 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత రాజ్యాంగంలో, ఈ క్రింది వాటిలోని ఏ అధికరణం క్రింద సమన్యాయ పాలన అనే భావన అందించబడింది?

  1. అధికరణం 20
  2. అధికరణం 19
  3. అధికరణం 14
  4. అధికరణం 18
View Answer

Answer: 3

అధికరణం 14

Question: 7

భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ సవరణను ప్రస్తావిస్తూ, క్రింది జతలలో ఏది సరైనది?

  1. రాజ్యాంగ (యాభై-రెండవ సవరణ) చట్టం 1985 – ప్రాథమిక హక్కు
  2. రాజ్యాంగ (డెబ్భై-మూడవ సవరణ) చట్టం 1992 – పంచాయతీ రాజ్ సంస్థ
  3. రాజ్యాంగ (ఇరవై ఐదవ సవరణ) చట్టం 1971- సిక్కింను పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చారు
  4. రాజ్యాంగ (తొంభై-రెండవ సవరణ) చట్టం 2003 – ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్
View Answer

Answer: 2

రాజ్యాంగ (డెబ్భై-మూడవ సవరణ) చట్టం 1992 – పంచాయతీ రాజ్ సంస్థ

Question: 8

భారత రాజ్యాంగంలోని క్రింది ముఖ్యమైన లక్షణాలను వాటి వివరణలతో జతపరచండి.
కీలక అంశాలు
1. సమాఖ్య వాదము
2. ప్రాథమిక హక్కులు
3. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు
4. పార్లమెంటరీ వ్యవస్థ
వివరములు
A. కేంద్ర అధికారం మరియు వివిధ రాజ్యాంగ సంస్థల మధ్య అధికారం విభజించబడిన ప్రభుత్వ వ్యవస్థ.
B. రాజ్యాంగంలోని భాగం IIIలో పొందుపరచబడినవి, ఇవి వ్యక్తులకు ప్రాథమిక స్వేచ్ఛలు మరియు ఏకపక్ష రాజ్య చర్యలకు వ్యతిరేకంగా రక్షణలను అందిస్తాయి.
C. రాష్ట్ర పౌరులకు సామాజిక మరియు ఆర్థిక న్యాయం మరియు సంక్షేమాన్ని స్థాపించడానికి మార్గదర్శక సూత్రాలు..
D. ప్రధానమంత్రి ప్రభుత్వా ఆధినేతగా, శాసనసభకు కార్యనిర్వాహక అధికారి బాధ్యత వహించే ప్రభుత్వ వ్యవస్థ.

  1. 1-C, 2-D, 3-A, 4-B
  2. 1-A, 2-B, 3-C, 4-D
  3. 1-D, 2-A, 3-B, 4-C
  4. 1-B, 2-C, 3-D, 4-A
View Answer

Answer: 2

1-A, 2-B, 3-C, 4-D

Question: 9

కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ఓటింగ్ వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించింది?

  1. 42వ సవరణ
  2. 61వ సవరణ
  3. 44వ సవరణ
  4. 24వ సవరణ
View Answer

Answer: 2

61వ సవరణ

Question: 10

కింది వాటిలో ఏది ‘గ్రాస్ రూట్ ప్రజాస్వామ్యం’ సిద్ధాంతంను ఉత్తమంగా వివరిస్తుంది?

  1. రాష్ట్రాల మధ్య మండలి
  2. పంచాయతీరాజ్ వ్యవస్థ
  3. ప్రాంతీయ రాజకీయాలు
  4. లోక్ పాల్
View Answer

Answer: 2

పంచాయతీరాజ్ వ్యవస్థ

Recent Articles