Home  »  TGPSC 2024  »  Indian Polity-2

Indian Polity-2 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారత రాజ్యాంగం యొక్క అవలోకనం మరియు దాని సవరణలకు సంబంధించి నాలుగు జతలు ఇవ్వబడ్డాయి, ఒక జత సరైనది మరియు మిగిలిన మూడు తప్పు. సరైన జతను గుర్తించండి

  1. 74వ సవరణ- ప్రాథమిక విధులను ఏర్పాటు చేసింది.
  2. 42వ రాజ్యాంగ సవరణ – ‘మినీ రాజ్యాంగం’గా ప్రసిద్ధి
  3. అధికరణం 370 – విద్యాహక్కుకు సంబంధించినది
  4. భారత రాజ్యాంగం- ద్వంద్వ పౌరసత్వాన్ని అందిస్తుంది
View Answer

Answer: 2

42వ రాజ్యాంగ సవరణ – ‘మినీ రాజ్యాంగం’గా ప్రసిద్ధి

Question: 12

రాష్ట్ర శాసనసభకు సంబంధించి జాబితా-I ను జాబితా-II తో జతపర్చండి.
జాబితా-I
A. అధికరణ 210
B. అధికరణ 171
C. అధికరణ 187
D. అధికరణ 177
జాబితా-II
i. శాసనసభలో ఉపయోగించాల్సిన భాష
ii. సభలకు సంబంధించి మంత్రులు, అడ్వొకేట్ జనరల్ హక్కులు
iii. శాసన మండళ్ల కూర్పు
iv. రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్

  1. A-i, B-iii, C-iv, D-ii
  2. A-iii, B-iv, C-i, D-ii
  3. A-iv, B-iii, C-i, D-ii
  4. A-ii, B-i, C-iii, D-iv
View Answer

Answer: 1

A-i, B-iii, C-iv, D-ii

Question: 13

క్రింది వాక్యాలను పరిగణించుము :
ధృవీకరణ (A) : ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అణగారిన మరియు అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలకు వారి సామూహిక బేరసారాలకు మరియు స్థానిక పాలన మిరియు అభివృద్ధి ప్రక్రియలో వారికి తగిన వాటాను పొందడానికి అవకాశం అందిస్తుంది.
కారణం (R) : వికేంద్రీకరణ మరియు ప్రజాస్వామ్యీకరణ ప్రక్రియ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళలు వంటి అత్యంత మినహాయించబడిన సామాజిక సమూహాల ప్రయోజనాలను పరిరక్షించడానికి సహాయ పడుతుంది.

సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. (A) నిజం, కానీ (R) తప్పు.
  2. (A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A)కు సరైన వివరణ.
  3. (A) తప్పు, కానీ (R) నిజం.
  4. (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) అనేది (A)కు సరైన వివరణ కాదు.
View Answer

Answer: 2

(A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A)కు సరైన వివరణ.

Question: 14

కింది చట్టాలను వాటి సంవత్సరాలతో జతపర్చుము :
చట్టం
A. SC మరియు ST లపై దురాగతాల (అట్రాసిటీ) నిరోధక చట్టం
B. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి చట్టం
C. బాలకార్మిక (నియంత్రణ నిషేదం) చట్టం
D. వికలాంగుల హక్కుల చట్టం
సంవత్సరం
I. 2016
II. 1986
III. 1993
IV. 1989
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-I; B-II; C-IV; D-III
  2. A-II; B-I; C-III; D-IV
  3. A-III; B-IV; C-I; D-II
  4. A-IV; B-III; C-II; D-I
View Answer

Answer: 4

A-IV; B-III; C-II; D-I

Question: 15

అధికరణం 15 గురించి క్రింది వాటిలో ఏ వాక్యం/వాక్యాలు సరైనది/సరైనవి ?
A. ప్రభుత్వం పౌరుల పట్ల మత, వర్ణ, కుల, లింగ, పుట్టిన ప్రదేశాల లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఎలాంటి వివక్ష చూపరాదు.
B. ప్రభుత్వం స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడాన్ని ఈ అధికరణం నిరోధించదు.
C. చట్టం ముందు సమానత్వం.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మరియు B మాత్రమే
  2. A మరియు C మాత్రమే
  3. A, B మరియు C
  4. B మాత్రమే
View Answer

Answer: 1

A మరియు B మాత్రమే

Recent Articles