Home  »  TGPSC 2024  »  International Relations-1

International Relations-1 (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu

These International Relations (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలను వాటి సంబంధిత వివరణలు లేదా ఫలితాలతో జతపరచండి.
శిఖరాగ్ర సమావేశం
1. G20 శిఖరాగ్ర సమావేశం
2. ASEAN శిఖరాగ్ర సమావేశం
3. బ్రిక్స్ (BRICS ) శిఖరాగ్ర సమావేశం
వివరణలు లేదా ఫలితాలు
A. ఆర్థిక సహకారం, రాజకీయ సమన్వయం మరియు సాంస్కృతిక మార్పిడిపై దృష్టి సారించే ఐదు ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుండి నాయకుల వార్షిక సమావేశం.
B. ప్రపంచ ఆర్థిక సమస్యలను చర్చించడానికి మరియు విధానాలను సమన్వయం చేయడానికి ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల నాయకుల కోసం ఒక వేదిక.
C. ప్రాంతీయ సమస్యలు, ఆర్థిక సహకారం మరియు రాజకీయ విషయాలపై చర్చించడానికి ఆగ్నేయాసియా దేశాల నాయకుల సాధారణ సమావేశం.

  1. 1-B, 2-C, 3-A
  2. 1-C, 2-B, 3-A
  3. 1-B, 2-A, 3-C
  4. 1-C, 2-A, 3-B
View Answer

Answer: 1

1-B, 2-C, 3-A

Question: 7

UN యొక్క ఇవ్వబడిన సంస్థలకు మరియు వాటి సంస్థాపన సంవత్సరాలకు సంబంధించిన జాబితా-IIతో జాబితా-Iని జతపరచండి.
జాబితా-I
A. UN మహిళలు
B. యునిసెఫ్ (UNICEF)
C. యు ఎన్ ఇ పి (UNEP)
D. డబ్ల్యూ హెచ్ ఒ (WHO)
జాబితా-II
i. 1972
ii. 1948
iii. 2010
iv. 1946

  1. A-iv, B-i, C-ii, D-iii
  2. A-ii, B-iii, C-iv, D-i
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-iii, B-i, C-iv, D-ii
View Answer

Answer: 3

A-iii, B-iv, C-i, D-ii

Question: 8

కింది అంతర్జాతీయ సంస్థలు మరియు ఏజెన్సీలను వాటి సంబంధిత పాత్రలు లేదా విధులతో జతపరచండి.
సంస్థలు మరియు ఏజెన్సీలు:
1. WTO
2. IAEA
3. UNESCO
పాత్రలు లేదా విధులు:
A. విద్య, విజ్ఞాన, సంస్కృతి, కమ్యూనికేషన్ రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
B. దేశాల మధ్య వాణిజ్యం యొక్క ప్రపంచ నియమాలను పర్యవేక్షిస్తుంది.
C. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధిస్తుంది.

  1. 1-B, 2-A, 3-C
  2. 1-C, 2-B, 3-A
  3. 1-C, 2-A, 3-B
  4. 1-B, 2-C, 3-A
View Answer

Answer: 4

1-B, 2-C, 3-A

Question: 9

ఈ క్రింది అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులు మరియు ఒప్పందాలను పరిగణించండి. వాటిని సంబంధిత వివరణలు లేదా ఫలితాలతో జతచేయండి.
శిఖరాగ్ర సదస్సుల ఒప్పందాలు:
1. SCO సదస్సు
2. UN జనరల్ అసెంబ్లీ
3. పారిస్ ఒప్పందం
వివరణలు లేదా ఫలితాలు:
A. భద్రత, అభివృద్ధి, మానవ హక్కులతో సహా ప్రపంచ సమస్యలపై సభ్య దేశాల నాయకులు చర్చించే వార్షిక సమావేశం.
B. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు, అనుసరణ మరియు ఆర్థికానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) లోని ఒక అంతర్జాతీయ ఒప్పందం 2015 లో ఆమోదించబడింది.
C. యురేషియా దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, భద్రతా సంబంధిత సహకారంపై దృష్టి సారించిన షాంఘై సహకార సంస్థ సమావేశం.

  1. 1-C, 2-A, 3-B
  2. 1-B, 2-A, 3-C
  3. 1-B, 2-C, 3-A
  4. 1-C, 2-B, 3-A
View Answer

Answer: 1

1-C, 2-A, 3-B

Question: 10

బ్రెట్టన్ ఉడ్స్ కాన్ఫరెన్సుకు సంబంధించి కింది అంశాలను గ్రహించుము :
A. ఈ కాన్ఫరెన్స్ 1944 లో అమెరికాలోని న్యూ హ్యంప్ షైర్ లో, యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక క్రమం (economic order) ను చర్చించడానికి జరిగింది.
B. ఈ కాన్ఫరెన్సు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మరియు ప్రపంచ బ్యాంక్ ఏర్పాటుకు దారి తీసింది.

పైన ఇవ్వబడిన వాఖ్యాలలో ఏది/ఏవి ఒప్పు ?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Recent Articles