Home  »  TGPSC 2022-23  »  Indian Polity-12

Indian Polity-12 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

నీతి ఆయోగ్ ఛైర్మన్ ఎవరు?

  1. రాష్ట్రపతి
  2. ఆర్థిక మంత్రి
  3. ప్రధాన మంత్రి
  4. ప్రణాళిక మరియు అభివృద్ధి మంత్రి
View Answer

Answer: 3

ప్రధాన మంత్రి

Explanation:

  • నీతి ఆయోగ్ను (NITI Aayog నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) 2015 జనవరి 1న కేంద్ర మంత్రి వర్గ తీర్మానం ఆమోదం ద్వారా ఏర్పాటు చేశారు.
  • ప్రణాళికల రూపకల్పనలో ప్రణాళికా సంఘం పై నుంచి కిందికి (Top to Bottom) పద్దతిని అనుసరించింది.
  • నీతి ఆయోగ్ జనరల్ కౌన్సిల్ను 2015 ఫిబ్రవరి 2న మొదటిసారి ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ ప్రధాన మంత్రి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు (వైస్ ఛైర్మన్), ముఖ్య కార్యనిర్వహణాధికారిని (సీఈవో) ప్రధాన మంత్రి నియమిస్తారు. దీనిలోని శాశ్వత సభ్యుల సంఖ్య
  • నీతి ఆయోగ్ రాజ్యాంగేతర, చట్టబద్ధతలేని సంస్థ.

Question: 2

జస్టిస్ జి. రోహిణి కమిషన్ దేనికి సంబంధించినది:

  1. ఇతర వెనుకబడిన తరగతుల (OBC లు) ఉప-వర్గీకరణ  
  2. షెడ్యూల్డ్ కులాల (SC లు) ఉప వర్గీకరణ
  3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు
  4. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు
View Answer

Answer: 1

ఇతర వెనుకబడిన తరగతుల (OBC లు) ఉప-వర్గీకరణ

Explanation:

  • OBC వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమీషన్:
  • వెనుకబడిన వర్గాలు (OBC) వర్గీకరణను పరిశీలించేందుకు ఆర్టికల్ 340 కింద భారత రాష్ట్రపతి 2017 అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రోహిణి అధ్యక్షతన 4గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు.

కమిటీలోని సభ్యులు :

  1. జస్టిస్ రోహిణి (రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు సి.జె)
  2. డా॥ జె.కె. బజాజ్ (సెంటర్ ఫర్ పాలసీస్టడీస్ – డైరెక్టర్)
  3. యాంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా- డైరెక్టర్ 4. రిజిస్టర్ జనరల్ & సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియా
  • ఈ కమీషన్ ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రపతి నియమించగా తన నివేదికను 2023 ఆగస్టు 01న రాష్ట్రపతి ద్రౌపరి మురుకు అందించింది.
  • ఈ కమీషన్ దాదాపుగా 1,30,000 ఉద్యోగాలు కొన్ని ఉన్నత విద్యాసంస్థలలో, ఉన్నత ఉద్యోగాలలో బి.సి.ల నియామకాలను, ఎలా ఉన్నది అనేది కమీషన్ అధ్యయనం చేసింది.
  • ఈ కమీషన్ రిపోర్టు ప్రకారం మొత్తం బి.సి లలో 97% ఉద్యోగాలలో 25% ఉద్యోగాలు OBCలు ఆక్రమిస్తున్నారు అని పేర్కొంది. ఈ 25%లో 10 బి.సి. కమ్యూనిటీలు ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తున్నారు.
  • 983 OBC కమ్యూనిటీలకు 0% ప్రాతినిధ్యంగా ఉంది.
  • 994 OBC ఉపకులాలకు 68% ప్రాతినిధ్యం ఉన్నట్లుగా పేర్కొంది.
  • ఈ కమీషన్ తన రిపోర్టు ఆలస్యంగా రిపోర్టు ఇవ్వడానికి గల కారణం సరియైన సమాధానం లేకపోవడం, దేశంలో కులం ఆధారంగా జనాభా గణన లేకపోవడం కారణంగా పేర్కొంది.
  • ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో కులం ఆధారంగా జనాభా గణన చేయగా కొందరు పాట్నా హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు ప్రభుత్వాన్ని సమర్థించింది.

Question: 3

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరులందరికీ కింది హక్కులనుకల్పిస్తుంది, అయితే కింది వాటిలో దానిలో భాగం కానిది ఏది ?

  1. వాక్ స్వాతంత్ర్యం మరియు భావవ్యక్తీకరణ
  2. శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సమావేశపరచడం
  3. భారతదేశ భూభాగం అంతటా స్వేచ్ఛగా వెళ్లడం
  4. ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలు
View Answer

Answer: 4

ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలు

Explanation:

 రాజ్యాంగం లో ప్రాథమిక హక్కులలో ఆర్టికల్  19-22 స్వాతంత్ర్యపు హక్కు గురించి పేర్కొన్నాయి

ప్రాథమిక స్వాతంత్ర్యాలు :

  • 19వ అధికరణ భారత పౌరులకు 6 స్వాతంత్ర్యాలను ప్రసాదిస్తున్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు 7 స్వాతంత్ర్యాలు కలవు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిని సంపాదించడం, అనుభవించడం, మరియు అన్యాక్రాంతం చేయడం అనే
  • అంశాన్ని 19వ అధికరణ నుండి తొలగించుట వలన ప్రస్తుతం ఆరు స్వాతంత్ర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి,
  • 19 (1) : వాక్ స్వాతంత్య్రం మరియు భావప్రకటన స్వాతంత్య్రం
  • 19 (1బి)) : ఎలాంటి ఆయుధాలు ధరించకుండా ప్రశాంత వాతావరణంలో సభలు, సమావేశాలు నిర్వహించుకొనే స్వాతంత్య్రం 19 (1 సి) : సంఘాలు, సంస్థలు, సహకార సంస్థలు (97వ సవరణ ద్వారా) స్థాపించుకొనే స్వాతంత్య్రం
  • 19 (1 డి) : భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించే స్వాతంత్ర్యాన్ని కలిగిఉంటారు.
  • 19 (1 ఇ) : భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించుటకు మరియు స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండటం. 19 (1 ఎఫ్): ఆస్తిని సంపాదించి, అనుభవించి, అన్యాక్రాంతం చేసే స్వేచ్ఛకు సంబందించింది. ( 44వ రాజ్యాంగ సవరణద్వారా ఈ స్వాతంత్ర్యాన్ని తొలగించడం జరిగింది)
  • 19 (1 జి) : వ్యక్తి జీవించడానికి అవసరమైన జీవనభృతిని పొందడం కోసం తనకు ఇష్టమైన వృత్తిని చేపట్టే స్వాతంత్ర్యం.
  • 2012లో 97వ రాజ్యాంగ సవరణను అనుసరించి 19 (1సి)లో సంఘాలు, సంస్థలతో పాటు సహకార సంస్థలు అనే అంశాన్నిచేర్చడం జరిగింది.

Question: 4

భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం భారత రాష్ట్రపతి దీనిని ప్రకటించవచ్చు.
బి. దీని కింద, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత అన్ని ద్రవ్య గ బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయబడతాయి.
సరైన వాక్యా(ల)ను ఎంచుకోండి:

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ & బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation:

  • దేశ ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగినపుడు అదేవిధంగా దేశ ఆర్థిక పరపతికి భంగం వాటిల్లినపుడు రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర (ఆర్టికల్ 360) పరిస్థితి విధిస్తారు
  • ఇప్పటివరకు మనదేశంలో 360వ అధికరణను వినియోగించలేదు. అనగా ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు.
  • అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించే మార్పులు :
  • రాష్ట్రపతి మినహా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా దేశంలోని అన్నిరకాల ఉన్నత పదవుల్లో ఉన్నవారి జీతభత్యాల్లో కోత విధించవచ్చును.
  • కేంద్రం కోరినచో రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాలి.
  • పొదుపు చర్యలతో సహా కేంద్రం యొక్క ఆర్థిక ఆదేశాలు రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. 275వ అధికరణ ప్రకారం కేంద్రం
  • రాష్ట్రాలకందించే సహాయక గ్రాంట్లను నిలిపివేయవచ్చును. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో రూపొందించు చట్టాలు అత్యవసర పరిస్థితి అనంతరం 6 నెలల వరకు అమలులో ఉంటాయి. రాష్ట్రాల యొక్క బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశింపవచ్చును

Question: 5

భారతదేశంలో విద్యకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. విద్య రాష్ట్ర జాబితాలో భాగం.
బి. విద్యకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని భాగం -III లో చూడవచ్చు.
సరైన వాక్యా(ల)ను ఎంచుకోండి:

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ & బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Explanation:

విద్యకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని భాగం -III లో చూడవచ్చు.

  • 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 లో ఆర్టికల్ 21 ఎ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడంతో 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని తెలుపుతున్నది
  • ప్రస్తుతం కేంద్ర జాబితా లో 98, రాష్ట్ర జాబితాలో 59 ,ఉమ్మడి జాబితాలో 52 అంశాలు కలవు 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య, అడవులు ,తునికలు కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ ఉమ్మడి జాబితా లోకి చేర్చారు
Recent Articles