Home  »  TGPSC 2022-23  »  Indian History-2

Indian History-2 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

dian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రిందివాటిలో హెూయసల స్మారక చిహ్నాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి?

  1. హంపి మరియు బళ్లారి
  2. హెూస్పేట్ మరియు బేలూర్
  3. బెంగళూరు, బేలూరు మరియు హెలిప్యాడ్
  4. హెలిప్యాడ్ మరియు హెూస్టేట్
View Answer

Answer: 1

హంపి మరియు బళ్లారి

Explanation:

హోయసాలులు

  • వంశ మూలపురుషుడు- సాలుడు
  • స్వతంత్ర పాలకుడు  – రెండవ వీరబల్లాలుడు
  • గొప్పవాడు మూడవ వీరబల్లాలుడు

రాజధానులు- ద్వార సముద్రం, కన్ననూరు

  • చివరి వాడు- 4వ బల్లాలుడు
  • మొదటి మతం- జైనం
  • ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కర్ణాటకలోని ‘హోయసల’ ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు(SEPTEMBER2023) యునెస్కో (UNESCO) వెల్లడించింది.
  • ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని ‘హోయసల’ (Hoysala) ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో (UNESCO) వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హళేబీడ్, సోమనాథ్పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ లోని ‘శాంతినికేతన్’కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలు ఈ జాబితాలో చేరడం విశేషం.

Question: 2

చోళ రాజ్య గ్రామ పరిపాలన గురించి కింది శాసనాలలో పేర్కొన్నది ఏది?

  1. తిరుక్కలూరు శాసనం
  2. తిరువనంతపురం శాసనం
  3. ఉత్తరమేరూరు శాసనం
  4. తంజావూరు శాసనం
View Answer

Answer: 3

ఉత్తరమేరూరు శాసనం

Explanation:

  • ఉత్తర మెరూరు శాసనం నవీన చోళ రాజైనమొదటి  పరాంతకుడు వేయించాడు
  • ఇది చోళుల యొక్క గ్రామీణ పరిపాలన గురించి తెలుపుతుంది
  • చోళుల పరిపాలనలో గ్రామ పాలనకు విశిష్టమైన స్థానం ఉంది. వీరి గ్రామ పరిపాలన గురించి పరాంతకుని ఉత్తర మేరూర్ శాసనం, కులోత్తుంగుని శాసనాలు . విపులంగా వివరిస్తున్నాయి.
  • ప్రధానంగా 3 రకాలైన గ్రామాలు వీరి శాసనాల్లో కనిపిస్తున్నాయి.
  1. ఉర్ – బ్రాహ్మణేతరులైన రైతు ప్రతినిధులను ఎన్నుకునే సభ
  2. సభ – బ్రాహ్మణులు నివసించే అగ్రహారాలలో ఉండే సభ
  3. నగరమ్ – వర్తకసంఘాల ప్రతినిధులుండేవారు.
  •  ప్రతి గ్రామాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు 30 వార్డులుగా విభజించారు. వీటినే కుడుంబులు అనేవారు.
  • గ్రామపెద్దల సభను పెరుంగూరు అని పిలుస్తారు.

Question: 3

ఈ క్రింది వాటిని సరిపోల్చండి..

రచయితలు

ఎ. మాధవ వర్మ-2

బి. దిన్నాగా

సి. ప్రవరసేన-2

డి. ఉగ్రదిత్యాచార్య

రచనలు

1. సేతుబంధ

2. కల్యాణ కారక

3. జనాశ్రయ ఛందోవిచ్చితి

4. ప్రమాణ సముచ్చాయ

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A-IV; B-III; C-II, D-I
  2. A-III; B-IV; C-I; D-II
  3. A-III; B-IV; C-II; D-I
  4. A-II; B-I; C-IV; D-III
View Answer

Answer: 3

A-III; B-IV; C-II; D-I

Question: 4

‘జోర్వే’ సంస్కృతికి ఏ దశకు చెందినది.

  1. చాల్కోలిథిక్ దశ
  2. మెగాలిథిక్ దశ
  3. మెసోలిథిక్ దశ
  4. ఇనుప యుగం
View Answer

Answer: 1

చాల్కోలిథిక్ దశ

Explanation:

  • జోర్వే సంస్కృతి అనేది చాల్‌కోలిథిక్ పురావస్తు సంస్కృతి , ఇది పశ్చిమ భారతదేశంలోని ఇప్పుడు మహారాష్ట్ర రాష్ట్రంలోని పెద్ద ప్రాంతాలలో ఉనికిలో ఉంది మరియు ఉత్తరాన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోకి కూడా చేరుకుంది .

రాగి/తామ్ర శిలాయుగం (Chalco Lithic Age)

  • ఈ యుగంలో మానవుడు క్రమంగా లోహాలను ఉపయోగించడం నేర్చుకున్నాడు.
  • మానవుడికి శిలాయుగం నుండి లోహ యుగానికి మారడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది.
  • మానవుడు ఉపయోగించిన మొదటి లోహం – రాగి
  • ఈ యుగంలో మానవుడు శిలా పనిముట్లను, రాగి పనిముట్లను రెండింటిని ఉపయోగించాడు.
  • ఈ యుగంలో నదీతీర ప్రాంతాలలో గ్రామీణ జనపదాలు ఏర్పడినవి.

Question: 5

ఋగ్వేదం గురించి కిందివాటిలో సరికాని వాక్యం ఏది?

  1. ఋగ్వేదం వర్ణం గురించి ప్రస్తావించింది
  2. ఋగ్వేదంలో బానిసత్వం ప్రస్తావన లేదు.
  3. సభ గురించి ఋగ్వేదంలో ప్రస్తావించారు.
  4. ఋగ్వేదంలో రాజన్ అనే పదం చాలాసార్లు ప్రస్తావించారు.
View Answer

Answer: 2

ఋగ్వేదంలో బానిసత్వం ప్రస్తావన లేదు.

Explanation:

వేదాలు 4 అవి ఋగ్వేదం, యజుర్వేదం,సామవేదం,అదర్వణ వేదం

  • ప్రపంచం లో అతి ప్రాచీన సాహిత్యం,మొదటి గ్రంధం ఋగ్వేదం
  • 10 వ మ౦డలం లోగల పురుష సూక్తం విశ్వ జననం వర్ణవ్యవస్థ ను గురించి తెలుపుతుంది
  • యజ్ఞయాగాదులు, కర్మకాండల గురించి తెలుపుతుంది. ధ్వని తరంగాల ప్రసారం గురించి తెలుపుతుంది. * పర్యావరణ సంబంధిత విషయాలను వివరించింది. మేఘాల ద్వారా వర్షాలు కురిసే విధానం తెలుపబడింది. శస్త్రచికిత్స, రేఖాగణిత విషయాలను తెలిపింది.
Recent Articles