Home  »  TGPSC 2022-23  »  Indian Polity-3

Indian Polity-3 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాటిలో భారత పౌరుల ప్రాథమిక కర్తవ్యం కానిది ఏది?

  1. భారతదేశ ఐక్యత మరియు సమగ్రతకు రక్షణ
  2. పౌరుల ప్రైవేట్ ఆస్తికి రక్షణ
  3. మానవతావాదం అభివృద్ధి
  4. దేశ రక్షణ
View Answer

Answer: 2

పౌరుల ప్రైవేట్ ఆస్తికి రక్షణ

Explanation: 

  • ప్రాథమిక విధులు భాగం -4A (ఆర్టికల్ – 51A) లో ఉన్నాయి. 1950, జనవరి 26 నుండి అమలులోకి వచ్చిన మొదటి అసలు రాజ్యాంగం లో ఈ విధులు లేవు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా వీటిని రాజ్యాంగంలో చేర్చారు. మొత్తం 11 విధులు ఉన్నాయి. స్వరన్ సింగ్ కమిటీ సూచనల ఆధారంగా ఈ విధులను రాజ్యాంగంలో ఉంచారు.
  1. భారత రాజ్యాంగానికి కట్టుబడి, దాని ఆదర్శాలను మరియు సంస్థలను, జాతీయ జెండాను మరియు జాతీయ గీతంను గౌరవించాలి
  2. స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయ పోరాటాన్ని కారణభూతమైన గొప్ప ఆదర్శాలను గౌరవించాలి మరియు వాటిని అనుసరించాలి
  3. భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించాలి మరియు కాపాడాలి.
  4. దేశాన్ని రక్షించాలి మరియు పిలుపునిచ్చినప్పుడు దేశ సేవ చేయాలి.
  5. మత, భాషా మరియు ప్రాంతీయ లేదా సమూహ వైవిధ్యాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరి మధ్య సామరస్యాన్ని మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి మరియు స్త్రీల గౌరవాన్ని కించపరిచే పద్ధతులను త్యజించాలి.
  6. భిన్న సంస్కృతి కలిగిన దేశం యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వాలి మరియు సంరక్షించాలి.
  7. అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం మరియు జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం.
  8. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం మరియు విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయాలి
  9. ప్రజా ఆస్తులను రక్షించడం మరియు హింసను విరమించుకోవాలి.
  10. వ్యక్తిగత మరియు సమాజ అన్ని రంగాలల శ్రేష్ఠతకు కృషి చేయాలి, తద్వారా దేశం నిరంతర కృషి మరియు సాధనలో ఉన్నత స్థాయికి ఎదుగుతుంది.
  11. ఆరు మరియు పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు విద్యకు అవకాశాలను అందించాలి. (ఈ విధి 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా జోడించబడింది)

Question: 2

భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధులకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1. రిట్ అధికార పరిధి ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయవచ్చు.
2భారత రాజ్యాంగం ఆమోదించబడినప్పటి నుండి ప్రాథమిక విధులుఅందులో భాగంగా ఉన్నాయి.
3. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రాథమిక విధులు రాజ్యాంగంలో భాగమయ్యాయి.
4. ప్రాథమిక విధులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.

దిగువ ఇవ్వబడిన కోడ్ నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. 1, 2 & 3
  2. 1, 2 & 4
  3. 2 & 3
  4. 3 & 4
View Answer

Answer: 4

3 & 4

Explanation:

  • ప్రాథమిక విధులకు న్యాయబద్ధత లేదు అంటే కోర్టుల ద్వారా వాటి అమలును కోరలేము. రిట్లను జారీ చేసేది కోర్టులు. అందువలన రిట్ల అధికార పరిధి ద్వారా కూడా విధులు అమలు చేయబడలేవు.
  • స్వరణ్ సింగ్ కమిటీ(1976) సూచనల ఆధారంగా విధులను రాజ్యాంగంలో ఉంచారు.
  • ప్రాథమిక విధులు భాగం -4A (ఆర్టికల్ – 51A) లో ఉన్నాయి. 1950, జనవరి 26 నుండి అమలులోకి వచ్చిన రాజ్యాంగం లో ఈ విధులు లేవు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా వీటిని రాజ్యాంగంలో చేర్చారు. ఈ విధులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.

Question: 3

ఆదేశిక సూత్రాలకు సంబంధించి, కింది రాజ్యాంగ నిబంధనలు (జాబితా-1) మరియు సవరణలు (జాబితా-2) సరైన కోడిని ఎంచుకోవడం ద్వారా రాజ్యాంగంలోని పార్ట్-IVలో చొప్పించబడ్డాయి.
జాబితా-1 (నిబంధన)

ఎ. ఆర్టికల్ 39-ఎ

బి. కొత్త ఆర్టికల్ 45

సి. ఆర్టికల్ 43-బి

డి. ఆర్టికల్ 48-ఎ

జాబితా-2 (సవరణలు)

1. 44వ సవరణ
2. 42వ సవరణ
3. 86వ సవరణ.
4. 97వ సవరణ
5. 95వ సవరణ

  1. ఎ-1, బి-2, సి-4, డి-5
  2. ఎ-2, బి-3, సి-4, డి-2
  3. ఎ-3, బి-2, సి-4, డి-3
  4. ఎ-1, బి-2, సి-2, డి-3
View Answer

Answer: 2

ఎ-2, బి-3, సి-4, డి-2

Explanation:

  • 42వ రాజ్యాంగ సవరణ చట్టం , 1976  రాజ్యాంగానికి గణనీయమైన మార్పులు చేసింది. అందువలన ఈ చట్టాన్ని ” చిన్న రాజ్యాంగం”  (Mini Constitution) అంటారు.  ఇది ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో  చేసిన చట్టం. ఈ సవరణ ద్వారా కింది మార్పులు చేయబడ్డాయి.
  1. రాజ్యాంగ ప్రవేశికలో 3 కొత్త పదాలను చేర్చింది . తద్వారా రాజ్యాంగం దృష్ట్యా భారతదేశం యొక్క వర్ణన “సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం ” నుండి “సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం “గా మారింది మరియు “జాతి ఐక్యత” అనే పదాలను “జాతి ఐక్యత మరియు సమగ్రత”గా మార్చింది.
  2. ప్రాధమిక విధులు (భాగం – 4 A) చేర్చారు.
  3. కొత్త ఆదేశిక సూత్రాలను జోడించింది. అవి ఆర్టికల్ 39A, ఆర్టికల్ 43A మరియు ఆర్టికల్ 48A.
  4. న్యాయ సమీక్ష(Judicial Review) లేకుండా రాజ్యాంగంలోని ఏదైనా భాగాలను సవరించడానికి పార్లమెంటుకు అనియంత్రిత (Unconditional) అధికారం ఇవ్వబడింది.
  • ప్రధానంగా ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన 42వ రాజ్యాంగ సవరణ లోని కొన్నిటిని మార్చడానికి మొరార్జీ దేశాయి ప్రభుత్వం ఈ 44వ సవరణ చేసింది

44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 :

  1. ప్రాధమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తీసివేసి దానిని కేవలం చట్టపరమైన హక్కుగా మార్చింది.
  2. జాతీయ అత్యవసర పరిస్థితి లో 20 మరియు 21 అధికరణలు కల్పించు ప్రాధమిక హక్కులు ఎత్తివేయబడరాదు అని సవరించింది.

86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 :

  1. 6 – 14 మధ్య వయసు గల బాలలకు విద్యను అందించడానికి రాష్ట్రాలు కృషి చేయాలని ఆర్టికల్ 45 ను సవరించింది.
  2. ఆర్టికల్ 51 – A లో మరొక ప్రాధమిక విధిని చేర్చింది.
  3. ప్రాధమిక విద్యను ప్రాధమిక హక్కుగా మార్చింది.

95వ రాజ్యాంగ సవరణ చట్టం, 2009 :

  1. SC, STలకు లోక్ సభ మరియు రాష్ట్ర శాసన సభలలో  రిజర్వేషన్ లను   మరియు ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని మరో పదేళ్ళు పొడిగించింది.

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 :

  1. సహకార సంఘాలను ఏర్పరచుకునే హక్కు ప్రాధమిక హక్కుగా చేయబడింది.
  2. భాగం – 9B జోడించబడింది.
  3. ఆర్టికల్ 43B ద్వారా మరో ఆదేశిక సూత్రం చేర్చబడింది

Question: 4

ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడిన పంపిణీ న్యాయం యొక్క ఆదర్శం ఈ క్రింది రాజ్యాంగంలోని ఏ అధికరణంలో ఉంది?

  1. ఆర్టికల్స్ 39 (1 & 2)
  2. ఆర్టికల్స్ 39 (2 & 3)
  3. ఆర్టికల్స్ 39 (3 & 4)
  4. ఆర్టికల్స్ 39 (ఇ & ఎఫ్)
View Answer

Answer: 2

ఆర్టికల్స్ 39 (2 & 3)

Explanation:

అధికరణ 39 :

  • రాష్ట్రం అనుసరించాల్సిన కొన్ని విధాన సూత్రాలు
  1. పౌరులు, పురుషులు మరియు మహిళలు సమానంగా, తగిన జీవనోపాధికి హక్కు కలిగి ఉంటారు;
  2. సమాజం యొక్క భౌతిక వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ఉమ్మడి మేలు కోసం ఉత్తమంగా పంపిణీ చేయబడుతుంది.
  3. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమాన పనికి సమాన వేతనం ఉండాలి.
  4. కార్మికులు, పురుషులు మరియు స్త్రీల ఆరోగ్యం మరియు బలం ఇంకా పిల్లల లేత వయస్సు దుర్వినియోగం చేయబడరాదు మరియు ఆర్థిక అవసరాల రీత్యా పౌరులు వారి వయస్సు లేదా శక్తికి సరిపోని వృత్తిలో ప్రవేశించడానికి బలవంతం చేయబడరాదు.
  5. పిల్లలు ఆరోగ్యవంతమైన రీతిలో, స్వేచ్ఛ మరియు గౌరవ పరిస్థితులలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు మరియు సౌకర్యాలు అందించబడాలి మరియు బాల్యం మరియు యువత దోపిడీకి, నైతిక మరియు భౌతిక పరిత్యాగం నుండి రక్షించబడాలి.

Question: 5

2010లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తిపై అతని అనుమతి లేకుండా నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహిస్తే, అది రాజ్యాంగంలోని ఏ అధికరణం కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుంది.

  1. 20 (1)
  2. 20 (2)
  3. 20 (3)
  4. 22
View Answer

Answer: 3

20 (3)

Explanation:

  • నార్కో లేదా లై డిటెక్టర్ పరీక్షలు వ్యక్తి మీద అసంకల్పిత నిర్వహణ వల్ల అది వ్యక్తి యొక్క “మానసిక గోప్యత”లోకి చొరబడుతుందని  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సెల్వి vs కర్ణాటక రాష్ట్రం(2010) కేసులో ఇవ్వబడింది. అంతేకాకుండా నార్కో పరీక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం స్వీయ నేరారోపణ దృష్ట్యా ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తాయని, ఎటువంటి నేరానికి పాల్పడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా తననే సాక్షిగా ఉండమని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
Recent Articles