Home  »  TGPSC 2022-23  »  Indian Polity-8

Indian Polity-8 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఒక నిర్దిష్ట కార్యాలయ యజమాని చట్టబద్ధమైన విధులు నిర్వర్తించడం లేదని, తద్వారా ఒక వ్యక్తి యొక్క హక్కును ఉల్లంఘిస్తున్నారని కోర్టు గుర్తించినప్పుడు ఈ క్రింది వాటిలో ఏది జారీ చేయబడుతుంది?

  1. మాండమస్
  2. సెర్టియోరారి
  3. హెబియస్ కార్పస్
  4. క్వో వారంటో
View Answer

Answer: 1

మాండమస్

Explanation:

మాండమస్ :

  • ఇది ఒక న్యాయపరమైన పరిష్కారం. ఒక  ప్రభుత్వ అధికారి తను చేయవలసిన చట్టపరమైన పనిని చేయకుంటే ఆ విధులను నిర్వర్తించమని న్యాయస్థానం జారీచేస్తుంది.
  • ఇది తన విధులను నిర్వర్తించమని ప్రభుత్వ అధికారికి కోర్టు జారీ చేసే ఆదేశం. ఇది ప్రభుత్వ అధికారికి మాత్రమే కాదు ప్రభుత్వ సంస్థలకు, వ్యవస్థలకు, దిగువ కోర్టులకు ట్రిబ్యునల్(Tribunal)కు విధించబడును. ప్రైవేటు వ్యక్తులపై లేదా వ్యవస్థలపై జారీ చేయబడదు.

Question: 2

భారత సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించి కింది వాంగ్మూలాలలో ఏది సరైనది?
ఎ. ఇది హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేయగలదు.
బి. ఇది కేసులను ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు బదిలీ చేయగలదు.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ మరియు బి రెండూ కాదు
View Answer

Answer: 4

ఎ మరియు బి రెండూ కాదు

Explanation:

  • అధికరణ 217 ప్రకారం హై కోర్ట్ న్యాయమూర్తులు రాష్ట్రపతిచే నియమించబడతారు.
  • అధికరణ 222 : ఒక హై కోర్ట్ నుండి మరొక హై కోర్ట్ కు న్యాయమూర్తి ని రాష్ట్రపతి బదిలీ చేయగలరు.
  • అధికరణ 139A (2) ( article 139A clause 2 ) : సుప్రీం కోర్ట్, న్యాయనిర్ణయం కోసం ఏదైనా హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఏదైనా కేసు, అప్పీల్ లేదా ఇతర విచారణలను ఏదైనా ఇతర హైకోర్టుకు బదిలీ చేయవచ్చు.     ( బదిలీ చేయడం సముచితమని భావిస్తేనే )

Question: 3

భారత రాజ్యాంగం ప్రకారం, ఎంత మంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు?

  1. 8
  2. 12
  3. 16
  4. 18
View Answer

Answer: 2

12

Explanation:

  • రాజ్యసభకు రాష్ట్రపతిచే 12 మంది నామినేట్ చేయబడతారు. దీని గురించి అధికరణ 80లో తెలుపబడింది.

అధికరణ 80 :

  • రాష్ట్రాల యొక్క మండలి లేదా రాజ్యసభ కూర్పు
  1. రాజ్య సభ సభ్యులు
  2. ఈ అధికరణలోని క్లాజ్ 3 నిబంధనల ప్రకారం రాజ్యసభకు 12 మంది రాష్ట్రపతిచే నామినేట్ చేయబడతారు.
  3. మొత్తం 238 మంది సభ్యులు రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహిస్తారు.
  4. నాలుగవ షెడ్యూల్లోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్లు కేటాయించబడాలి.
  5. క్లాజ్ (1) లోని సబ్ క్లాస్ (a) లో తెలుపబడిన విధంగా రాజ్యసభకు నామినేట్ చేయబడే 12 మంది సభ్యులు కింది వాటిలో ప్రత్యేక జ్ఞానం కలిగి ఉండాలి
  • సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళలు లేదా సామాజిక సేవ.
  1. ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులచే ఒకే బదిలీ ఓటు కలిగిన దామాషా ప్రాతినిధ్యం (Proportional Representation of Single Transferrable Vote) ప్రకారం ఎన్నుకోబడతారు.
  2. పార్లమెంటు చట్టం ద్వారా నిర్దేశించిన రీతిలో కేంద్రపాలిత ప్రాంతాల నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్న సభ్యులు ఎంచుకోబడతారు.

Question: 4

రాజ్యసభ సభ్యులు …… సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.

  1. నాలుగు
  2. ఐదు
  3. ఆరు
  4. ఏడు
View Answer

Answer: 3

ఆరు

Explanation:

  • రాజ్యసభ సభ్యుల పదవీ కాలము ఆరు సంవత్సరాలు. రాజ్యాంగము రాజ్యసభ సభ్యుల పదవీ కాలాన్ని నిర్ణయించలేదు ఆ అధికారాన్ని పార్లమెంటుకే వదిలివేసింది. తత్కారణంగా పార్లమెంటు ప్రజాప్రతినిధ్య చట్టం, 1951లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలుగా నిర్ణయించింది.

Question: 5

భారతదేశంలో, మంత్రుల మండలి నేతృత్వంలో ఉంటుంది.

  1. ప్రధానమంత్రి
  2. రాష్ట్రపతి
  3. గవర్నర్
  4. ఉపరాష్ట్రపతి
View Answer

Answer: 1

ప్రధానమంత్రి

Explanation:

  • కేంద్రంలో మంత్రి మండలికి నేతృత్వం వహించేది ప్రధానమంత్రి.
  • దీని గురించి ఆర్టికల్ 74(1)లో ఇవ్వబడింది.

అధికరణ 74 :

  1. రాష్ట్రపతికి తన విధులను నిర్వర్తించే విషయంలో సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక మంత్రి మండలి ఉండాలి. అటువంటి సలహాను పునః పరిశీలించమని మంత్రి మండలిని రాష్ట్రపతి కోరవచ్చు పిదప వారి సలహాను అమలు పరచాలి.
  2. ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహా ఏ కోర్టులోనూ విచారించబడదు.
Recent Articles