Home  »  TGPSC 2022-23  »  Indian Polity-7

Indian Polity-7 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఆగస్టు 2023 నాటికి, భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ద్విసభ శాసనసభ లేదు?

  1. కర్ణాటక
  2. ఆంధ్రప్రదేశ్
  3. బీహార్
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 4

పశ్చిమ బెంగాల్

Explanation: 

  • భారతదేశ శాసన వ్యవస్థ ద్విసభా విధానం కలిగి ఉంది.
  • కేంద్ర శాసన విభాగం –  లోక్ సభ ( దిగువ సభ మరియు రాజ్యసభ ( ఎగువ సభ ).
  • రాష్ట్రాల శాసన విభాగంశాసన సభ ( విధాన సభ ) మరియు శాసన మండలి  (విధాన పరిషత్ ).
  • అధికరణ 169 ప్రకారం రాష్ట్రాలు కనుక రాష్ట్ర శాసన మండలి ఏర్పాటుకు లేదా రద్దుకు మూడింట రెండు వంతుల మెజారిటీకి తక్కువ కాని మెజారిటీతో ఒక తీర్మానం చేస్తే ఆ రాష్ట్ర తీర్మానానికి అనుగుణంగా (మండలి ఏర్పాటుకు లేదా రద్దుకుపార్లమెంటు చట్టం చేయవచ్చు.
  • ప్రస్తుతం శాసన మండలి కలిగి ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక , బీహార్ , మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్.

Question: 2

భారత రాజ్యాంగం యొక్క సందర్భం ప్రకారం కింది ఏ జంట ‘ఆర్టికల్-ప్రొవిజన్’ సరిగ్గా సరిపోలింది?
ఎ. ఆర్టికల్ 5 – రాజ్యాంగం ప్రారంభంలో పౌరసత్వం.
బి. ఆర్టికల్ 10 – భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation: 

  • భారత దేశ పౌరసత్వాన్ని సంబంధించిన అధికరణలు భాగం – 2 (పార్ట్ – II) లో అధికరణలు 5 నుండి 11 మధ్య పొందుపరచబడ్డాయి. పౌరసత్వానికి సంబంధించిన శాశ్వత లేదా సుదీర్ఘమైన నిబంధనలను రాజ్యాంగం ఇవ్వలేదు కేవలం రాజ్యాంగ ప్రారంభ సమయంలో ఎవరు పౌరులు అవుతారని మాత్రమే ఈ అధికరణల ద్వారా తెలిపింది.
  • రాజ్యాంగ ప్రారంభం తరువాత పౌరసత్వం పొందడం లేదా కోల్పోవడం వంటి అంశాల పై ఈ అధికరణలు లేవు. ఆ అంశాల పై చట్టం చేయగల అధికారం రాజ్యాంగం పార్లమెంటు కు ఇచ్చింది. తత్సంకల్పంతో పార్లమెంటు పౌరసత్వ చట్టం, 1955 ను చేసింది.

అధికరణ 5 :

  • రాజ్యాంగం ప్రారంభంలో పౌరసత్వం ఈ రాజ్యాంగం ప్రారంభంలో భారతదేశ భూభాగంలో తన నివాసాన్ని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి మరియు-
  1. భారతదేశ భూభాగంలో జన్మించిన వ్యక్తి లేదా
  2. వ్యక్తి తల్లితండ్రులు భారతదేశ భూభాగంలో జన్మించినవారైనా లేదా
  3. రాజ్యాంగ ప్రారంభానికి ముందు ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా భారతదేశ భూభాగంలో సాధారణంగా నివసించినవారు
  • భారతదేశ పౌరులు అవుతారు.
  • భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారి పౌరసత్వ హక్కుల గూర్చి తెలిపే నిబంధన, అధికరణ 8.

అధికరణ 10 : 

  • పౌరసత్వం యొక్క హక్కుల కొనసాగింపు ఈ భాగంలోని పైన పేర్కొనబడిన నిబంధనల ప్రకారం భారత దేశ పౌరుడిగా ఉన్న లేదా భావించబడుతున్న ప్రతి వ్యక్తి , పార్లమెంటు ద్వారా  రూపొందించిన లేదా రూపొందించబడే ఏదైనా చట్టం యొక్క నిబంధనలకు లోబడి, పౌరుడిగా కొనసాగాలి.

Question: 3

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 కింది వాటిలో దేనిని అందిస్తుంది?

  1. నేరాలకు సంబంధించిన శిక్షకు సంబంధించి రక్షణ
  2. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ
  3. వివక్షకు వ్యతిరేకంగా హక్కు
  4. వాక్ స్వాతంత్ర్యం మొదలైన వాటికి సంబంధించిన కొన్ని హక్కుల రక్షణ
View Answer

Answer: 2

మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ

Explanation: 

  • అధికరణ 29 మైనారిటీ ప్రయోజనాల పరిరక్షణ
  1. భారతదేశంలో నివసిస్తున్న ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతి కలిగిన ఏదేని ఒక పౌర సమూహానికి తమ తమ భాష, లిపి లేదా సంస్కృతిని కాపాడుకునే హక్కు కలదు.
  2. ఏ పౌరుడుకి కూడా మత, జాతి , కుల లేదా భాష ప్రతిపాదికన రాష్టంచే నడుపబడే విద్యా సంస్థల్లో ప్రవేశం నిలిపివేయబడరాదు.
  • పౌర సమూహం ( Section of Citizens ) అనే పదం మూలంగా మైనారిటీలతో పాటు మెజారిటీలకు కూడా ఈ అధికరణ వర్తిస్తుందని సుప్రీం కోర్ట్ పేర్కొంది.
  • భాషా పరిరక్షణ హక్కు అంటే భాష రక్షణ కోసం నిరసన చేసే హక్కు కూడా ఉంటుందని సుప్రీం కోర్ట్ తెలిపింది.

Question: 4

భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ లో ‘స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వస్తువుల రక్షణ’ కోసం అందిస్తుంది?

  1. ఆర్టికల్ 35
  2. ఆర్టికల్ 39
  3. ఆర్టికల్ 45
  4. ఆర్టికల్ 49
View Answer

Answer: 4

ఆర్టికల్ 49

Explanation: 

అధికరణ 49 :

  • జాతీయ ప్రాముఖ్యత ఉన్న కళాత్మక లేదా చారిత్రక స్మారక కట్టడాలను , ప్రదేశాలను మరియు వస్తువులను రాజ్యం పరిరక్షించాలి.
  • రాజ్యం అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు.
  • అధికరణ 49  మేధో ఉదారవాద ఆదేశిక సూత్రం.

అధికరణ 45 :

  • ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య సదుపాయంకు సంబంధించిన నిబంధన.
  • పిల్లలందరికీ ఆరు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది.

అధికరణ 39 :

  • రాష్ట్రం అనుసరించాల్సిన కొన్ని విధాన సూత్రాలు
  • రాష్ట్రం ప్రత్యేకించి కింది వాటి కోసం తన విధానాన్ని నిర్దేశించుకోవాలి
  1. పౌరులు, పురుషులు మరియు మహిళలు సమానంగా, జీవనోపాధికి తగిన మార్గాల హక్కును కలిగి ఉండడం కోసం
  2. సమాజం యొక్క భౌతిక వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ఉమ్మడి ప్రయోజనానికి ఉపకరించడానికి ఉత్తమంగా పంపిణీ చేయబడడం కోసం ;
  3. ఆర్ధిక వ్యవస్థ యొక్క పనితీరు సంపద కేంద్రీకరణకు మరియు ఉత్పత్తి సాధనాల సాధారణ నష్టానికి దారితీయకుండా ఉండడం కోసం
  4. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమాన పనికి సమాన వేతనం కల్పించడం కోసం
  5. కార్మికులు, పురుషులు మరియు స్త్రీల ఆరోగ్యం మరియు బలం మరియు పిల్లల లేత వయస్సు దుర్వినియోగం చేయబడదని మరియు ఆర్థిక అవసరం కారణంగా పౌరులు వారి వయస్సు లేదా శక్తికి సరిపోని వృత్తిలో ప్రవేశించడానికి బలవంతం చేయబడరని

Question: 5

పౌరుల ప్రాథమిక విధులు కూడా భారత రాజ్యాంగంలో____ద్వారాపేర్కొనబడ్డాయి.

  1. 32వ సవరణ
  2. 34వ సవరణ
  3. 42వ సవరణ
  4. 44వ సవరణ
View Answer

Answer: 3

42వ సవరణ

Explanation: 

  • 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా ప్రాధమిక విధులు రాజ్యాంగం లో చేర్చారు.
  • 42వ రాజ్యాంగ సవరణ చట్టం , 1976  రాజ్యాంగానికి గణనీయమైన మార్పులు చేసింది. అందువలన ఈ చట్టాన్ని ” చిన్న రాజ్యాంగం”  (Mini Constitution) అంటారు.  ఇది ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో  చేసిన చట్టం. ఈ సవరణ ద్వారా కింది మార్పులు చేయబడ్డాయి.
  1. రాజ్యాంగ ప్రవేశికలో 3 కొత్త పదాలను చేర్చింది . తద్వారా రాజ్యాంగం దృష్ట్యా భారతదేశం యొక్క వర్ణన “సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం ” నుండి “సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం “గా మారింది మరియు “జాతి ఐక్యత” అనే పదాలను “జాతి ఐక్యత మరియు సమగ్రత”గా మార్చింది.
  2. ప్రాధమిక విధులు (భాగం – 4 A) చేర్చారు.
  3. కొత్త ఆదేశిక సూత్రాలను జోడించింది. అవి ఆర్టికల్ 39A, ఆర్టికల్ 43A మరియు ఆర్టికల్ 48A.
  4. న్యాయ సమీక్ష(Judicial Review) లేకుండా రాజ్యాంగంలోని ఏదైనా భాగాలను సవరించడానికి పార్లమెంటుకు అనియంత్రిత (Unconditional) అధికారం ఇవ్వబడింది.
Recent Articles