Home  »  TGPSC 2022-23  »  Indian History-9

Indian History-9 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో, బార్డోలీ సత్యాగ్రహానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. బార్డోలీలో రైతు ఉద్యమం 1918లో జరిగింది.
బి. ఈ ఉద్యమానికి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించారు.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 2

కేవలం బి

Explanation: 

  • బార్డోలీ సత్యాగ్రహం చేపట్టిన సం|| : 1928
  • మరో పేరు: కిసాన్ ఉద్యమం
  • నాయకత్వం: సర్దార్ వల్లభాయ్ పటేల్
  • ముఖ్య కారణం: భూమి శిస్తును పెంచడం
  • గుజరాత్ లో ని బార్టోలీ ప్రాంతంలో 1928లో పంటలకు సరైన గిట్టుబాటు ధర లభ్యంకాలేదు. అదే సమయంలో బ్రిటీషు వారు భూమిశిస్తును 22% పెంచారు.
  • దీనికారణంగా పట్టీదార్ మండలి సభ్యులు కల్యాణ్ మెహతా, కున్వర్ జీ మెహతా బ్రిటీష్ కు  వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు.
  • తర్వాత వల్లభాయ్ పటేల్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు.
  • అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో నినాదం అయిన “NO TAXATION WITHOUT REPRESENTATION” అనేనినాదమును వ్యాప్తి చేశాడు.
  • దీనికి భయపడిన బ్రిటీషు వారు “మాక్స్ వెల్డ్ బ్రూమ్ఫల్డ్” కమిటీని ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటీష్ ప్రభుత్వం 22% పన్ను హెచ్చును రద్దు చేయడానికి శిస్తు వసూలును, ఆపివేయడానికి నిర్ణయించింది.
  • ఈ సందర్భంగా గాంధీజీ వల్లబాయ్ పటేల్ కు “సర్దార్” అనే బిరుదును ఇచ్చాడు.

Question: 2

భారతదేశంలో 19వ శతాబ్దపు సంఘ సంస్కరణోద్యమాల నేపథ్యంలో కిందివాటిలో ‘కళాశాల – స్థాపన సంవత్సరం’ ఏ జత సరిగ్గా సరిపోలింది?

ఎ. ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్, అలీఘర్ – 1875
బి. ఖల్సా కాలేజ్, అమృత్సర్ – 1878
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation: 

  • ముస్లింల అభివృద్ధికి విద్య ముఖ్యమైనది అని భావించి 1875లో అలీఘడ్ లో  సర్ సయ్యద్ అహ్మద్  ఖాన్ మహ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేశారు.
  • 1877లో ఇది కళాశాలగా మారింది.
  • 1916 తర్వాత ఇది అలీఘడ్ విశ్వవిద్యాలయంగా మారింది.
  • నోట్: ధ్యాన్ చంద్ (హాకీ), జాకీర్ హుసేన్ (మాజీరాష్ట్రపతి), షేక్అబ్దుల్లా (కాశ్మీర్ మాజి ముఖ్యమంత్రి) తదితరులు ఈ విశ్వవిద్యాలయా పూర్వ విద్యార్థులు.
  • 1892లో సింగ్ సభ ఉద్యమ నాయకులచే ఉన్నత విద్యా సంస్థ అయిన ఖల్సా కళాశాల స్థాపించబడింది.
  • భారతదేశంలోని బ్రిటిష్ రాజ్ సమయంలో సిక్కు పండితులు పంజాబ్‌లోని సిక్కులు మరియు పంజాబీలకు ఉన్నత విద్యను అందించడం కొరకు ఖల్సా కళాశాల ఒక విద్యా సంస్థగా మారింది

Question: 3

భారతదేశంలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది?

  1. 1874
  2. 1878
  3. 1884
  4. 1888
View Answer

Answer: 2

1878

Explanation: 

వెర్ణాకులర్ ప్రెస్ యాక్ట్

  • ఈ చట్టాన్ని అప్పటి భారత వైస్రాయ్ లిట్టన్ ప్రతిపాదించారు. వైస్రాయ్ కౌన్సిల్ 14 మార్చి 1878న ఏకగ్రీవంగా ఆమోదించింది.
  • ఈ చట్టం ఆంగ్ల భాషా ప్రచురణలను మినహాయించి, ఓరియంటల్ భాషలలోని ప్రచురణలలో ప్రతిచోటా బ్రిటీష్  విద్రోహ రచనలను నియంత్రించడానికి చట్టం చేశారు.
  • దక్షిణ భారత దేశం లో ఈ చట్టాన్ని మినహాయించారు.
  • ఈ చట్ట౦తో అమృత బజార్  పత్రికను నియంత్రించారు.
  • లార్డ్ రిప్పన్ ఈ చట్టాన్ని తొలగించారు.

Question: 4

ఈ క్రింది వాటిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం వర్తింపజేయడం ద్వారా మొదట విలీనం చేయబడిన రాజ్యం ఏది?

  1. సతారా
  2. ఉదయపూర్
  3. నాగ్పూర్
  4. ఝాన్సీ
View Answer

Answer: 1

సతారా

Explanation: 

  • లార్డ్ డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం బ్రిటీషు వారి సామ్రాజ్యవాదానికి పరాకాష్ఠ అయినది.
  • డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం ద్వారా వివిధ రాజ్యాలను బ్రిటీష్ ఈస్ట్ఇండియా కంపెనీ రాజ్యంలో విలీనం చేశాడు.
  • సతారా (1848),జైత్పూర్ (1849), సంబాల్ పూర్ (1849),పంజాబ్  (1849)
  • సిక్కిం  (1850),  ఉదయపూర్ (1852) ఝాన్సీ  (1853)
  • భరత్పూర్ (1853) అయోద్య (అవధ్) (1856)
  • నోట్ : సతారా పాలకుడైన అప్పాసాహెబ్ 1848లో మరణించగానే అతనికి వారసులు లేరనే నెపంతో సతారా రాజ్యాన్ని డల్హౌసీ విలీనం చేసుకున్నాడు.
  • రాజ్యసంక్రమణ నేపథ్యంలో విలీనం చేసుకున్న మొదటి రాజ్యం సతారా

Question: 5

వేద సమాజానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?

ఎ. 1864లో మద్రాసు (చెన్నై)లో వేద సమాజం స్థాపించబడింది.

బి. దాని సభ్యులు ఒకే దేవుణ్ణి విశ్వసించారు.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు.
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Explanation: 

  • 1864లో చెన్నైలో కేశవ్  చంద్ర సేన్ స్థాపించిన వేద సమాజ్ ప్రాచీన వేద సంస్కృతి సూత్రాలను ప్రచారం చేస్తుంది.
  • ఇది ఆచారాలు, ఆధ్యాత్మికత మరియు జ్ఞాన సాధనపై దృష్టి పెడుతుంది.
  • సామాజిక సామరస్యం, నైతిక విలువలు మరియు విద్యా వృద్ధిని నొక్కిచెప్పడం, వేద సమాజం సమకాలీన సమాజంలో సాంప్రదాయ వైదిక పద్ధతులను పునరుద్ధరించడం మరియు కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Recent Articles