Home  »  TGPSC 2022-23  »  Indian Economy-17

Indian Economy-17 (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రణాళికా సంఘం యొక్క ఎక్స్-అఫిషియో చైర్పర్సన్ ఎవరు?

  1. ఆర్థిక మంత్రి
  2. ప్రధాన మంత్రి
  3. లోక్సభ స్పీకర్
  4. RBI గవర్నర్
View Answer

Answer: 2

ప్రధాన మంత్రి

Explanation:

  • ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఉపాధ్యక్షుడుగా డిప్యూటీ చైర్మన్ ఇతనిని ప్రధానమంత్రి నియమిస్తాడు.

సభ్యులు:

  1. పదవి రీత్యా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి , కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి
  2. పూర్తికాల సభ్యులు 4 to 7
  3. ముఖ్య కార్య నిర్వహణ అధికారి
  4. ఇందులో తాత్కాలిక సభ్యులు ఉండరు (నీతి అయోగ్ లో తాత్కాలిక సభ్యులు ఉంటారు)

Question: 2

నీతి ఆయోగ్ ‘NITI’ అంటే ఏమిటి?

  1. నేషనల్ ఇన్నోవేషన్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్, ఇండియా
  2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్, ఇండియా
  3. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా.
  4. నేషనల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా.
View Answer

Answer: 2

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్, ఇండియా

Explanation:

  • ప్రణాళిక సంఘం నీ  2014 aug 13 రద్దు చేయడం జరిగింది 2015 jan 1 లో నీతి అయోగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
  • NITI అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా. దీని ఉద్దేశపూర్వకంగా భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థగా పెట్టడం జరిగింది.

నీతి అయోగ్ లక్ష్యాలు:

  1. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం
  2. సబ్ కాసాత్- సబ్కా వికాస్
  3. బాటమ్ టు టాప్
  4. కేంద్ర రాష్ట్రాల మధ్య వారధి టీమిండియా అని పేరుతో గ్రూప్ అందిస్తుంది.

Question: 3

భారతదేశంలో, 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012) సమయంలో లక్ష్యం మరియు వాస్తవ వృద్ధి రేట్లు ?

  1. 5% & 5.5%
  2. 7% & 9%
  3. 9% & 5%
  4. 9% & 7.5%
View Answer

Answer: 4

9% & 7.5%

Explanation:

  • 11వ పంచవర్ష ప్రణాళిక అనుకున్న వృద్ధి రేటు 9% , సాధించిన వృద్ధిరేటు 7.5%. ఈ ప్రణాళిక ప్రాధాన్యత సత్వర సమ్మిళిత అభివృద్ధి సాధించడం.
  • దీనిని ఎల్పిజి నమూనా మరియు విద్యా ప్రణాళిక అంటారు. పదవ ప్రణాళిక కంటే 120 % ఎక్కువగా ఈ ప్రణాళిక వ్యయం అయింది.

Question: 4

కింది వాటిలో, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం రోలింగ్ ప్లాన్ ను మొదట ఏ ఆర్థికవేత్త ప్రతిపాదించారు?

  1. అమర్త్య సేన్
  2. గున్నార్ మిర్థాల్ సంత
  3. పిసి మహలనోబిస్
  4. పిఆర్ బ్రహ్మానంద
View Answer

Answer: 2

గున్నార్ మిర్థాల్ సంత

Explanation:

  • అవసరాన్ని బట్టి కాలానుగుణంగా మార్పు చేస్తూ నిరంతరంగా కొనసాగే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు. దీని రూపకర్త గున్నార్ మీర్ధల్ (స్వీడన్) ఈయన రచన ఏషియన్ డ్రామా.
  • ప్రపంచంలో మొదటిసారిగా ఈ ప్రణాళిక నెదర్లాండ్స్ ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో ఈ ప్రణాళిక రూపకర్త డి టి లక్డావాలా 1978 -1983 వరకు నిర్ణయించడం జరిగింది కానీ 1980 లో  కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయబడింది.
  • ఈ ప్రణాళికల అమలుపరచినప్పుడు ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్.

Question: 5

బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, మాంద్యం, రుణ భారం మొదలైన వాటి వల్ల దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కింది పంచవర్ష ప్రణాళికల్లో ఏది ఆమోదించబడింది?

  1. నాల్గవ ప్రణాళిక
  2. ఆరవ ప్రణాళిక
  3. ఎనిమిదవ ప్రణాళిక
  4. తొమ్మిదో ప్రణాళిక
View Answer

Answer: 3

ఎనిమిదవ ప్రణాళిక

Explanation:

  • ఆర్థిక సక్షోభం, బడ్జెట్ లోటు వంటి కారణాల వలన 8 వ ప్రణాళిక వెంటనే ప్రవేశపెట్టలేదు ఏడవ ప్రణాళిక తర్వాత ఆర్థిక సంస్కరణ ప్రవేశ పెట్టడం జరిగింది.
  • ఈ ప్రణాళికలు ప్రైవేటీకరణ ప్రపంచీకరణ పెట్టుబడుల ఉపసంహరణ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించబడ్డాయి భారతదేశ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందే క్రమంలో తొలిదశ ప్రారంభం అయింది.
  • ఈ ప్రణాళిక మానవ వనరులు అభివృద్ధి గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన, ప్రాధాన్యత ఇచ్చారు. ప్రణాళిక అన్నిటిలో అత్యంత విజయవంతమైన ప్రణాళిక ఇదే.
Recent Articles