Home  »  TGPSC 2022-23  »  Indian History-4

Indian History-4 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బ్రిటీష్ వారు భారతదేశంలో తమ మొదటి వాణిజ్య స్థావరాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు?

  1. కలకత్తా
  2. మద్రాసు
  3. మచిలీపట్నం
  4. సూరత్
View Answer

Answer: 4

సూరత్

Explanation:

బ్రిటీష్

  • క్రీ.శ 1600 లో రాణి ఎలిజబెత్ అనుమతితో లండన్ లోని వర్తకులు భారతదేశంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్థాపించారు. కంపెనీ స్థాపనకు అనుమతి ఇచ్చినవారు – ఎలిజబెత్ -1 వీరి స్థావరం సూరత్
  • ఆంధ్రాలో వీరి మొదటిస్థావరం – మచిలీపట్నం (గోల్గొండ నవాబు అనుమతితో 1611లో బ్రిటీష్వారు ఈ స్థావరాన్ని స్థాపించారు)
  • 1510లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 3 ప్రధాన స్థావరాలు
  1. బొంబాయి
  2. మద్రాసు
  3. కలకత్తా

Question: 2

తనను తాను ‘దేవుని నీడ’ అని సంభోదించుకున్న ఢిల్లీ సుల్తాన్ పేరు ?

  1. బాల్బన్
  2. అలావుద్దీన్ ఖిల్జీ
  3. మహమ్మద్ బిన్ తుగ్లక్
  4. ఫిరోజ్ షా తుగ్లక్
View Answer

Answer: 1

బాల్బన్

Explanation:

  • క్రీ . శ .1206-1506 వరకు డిల్లీ ని 5 రాజు వంశాలు పాలించాయి అవి బానిస,ఖిల్జీ,తుగ్లక్ సయ్యద్,లోడీ . బానిస వంశం లో గొప్పవాడు బాల్బన్ .
  • రాజరికం దైవదత్తం అనే సిద్దాంతాన్ని ప్రవేశపెట్టాడు.  భగవంతుని నీడ (జిల్లి ఇల్లాహ్)అనే బిరుదును ధరించాడు. మధ్యయుగ భారతదేశపు ఉక్కుమనిషి అంటారు

Question: 3

వాదన (A) : 14వ మరియు 16వ శతాబ్దాలలో దక్కన్ లోకి ఉత్తర భారత సూఫీల రాక రాజకీయ మరియు మతపరమైన అంశంలో లోతైన మార్పులను తీసుకువచ్చింది.
కారణం (R ) : డెక్కన్ పీఠభూమిపై ఖిల్జీ మరియు తొలి తుగ్లక్ దండయాత్రలను సమర్ధించేందుకు వారు వచ్చారు.
సరైన సమాధానం ఎంచుకోండి :

  1. (A) మరియు (R) రెండూ సరైనది మరియు (R) అనేది (A) యొక్క సరైన వివరణ
  2. (A) మరియు (R) రెండూ సరైనవే కానీ (R) సరైనది కాదు
  3. (A) సరైనది, కానీ (R) సరైనది కాదు
  4. (A) సరైనది కాదు, కానీ (R) సరైనది
View Answer

Answer: 3

(A) సరైనది, కానీ (R) సరైనది కాదు

Question: 4

వాదన (A) : అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీలో మద్యం అమ్మకాలు మరియు వాడకాన్ని నిషేధించారు.
కారణం (R) : అతను ప్రజల మతపరమైన మరియు నైతిక ప్రమాణాలను నిలబెట్టాలని కోరుకున్నాడు.
సరైన సమాధానం ఎంచుకోండి :

  1. (A) మరియు (R) సరైనది. (R) అనేది (A)కి సరైన వివరణ
  2. (A) మరియు (R) సరైనది. (A) యొక్క సరైన వివరణ (R) కాదు
  3. (A) సరైనది అయితే (R) సరైనది కాదు
  4. సరైనది కాదు అయితే (R) సరైనది
View Answer

Answer: 3

(A) సరైనది అయితే (R) సరైనది కాదు

Explanation:

అల్లా ఉద్దీన్ ఖిల్జీ సంస్కరణలు

  • అల్లా ఉద్దీన్ మంచి తెలివైన రాజకీయ వేత్త, రాజనీతిజ్ఞుడు మరియు గొప్ప పరిపాలనాదక్షుడు. ఇతను ఆకాలంలో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి పరిపాలనలోను, సైన్యంలోను, ఆర్ధిక విధానాలలోనూ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు
  • మొదటగా అతను పన్ను రహిత భూములను, ముస్లిం మతాధికారులకు ఇచ్చే మాన్యాలను జప్తు చేశాడు. రెండు, నిఘా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, ప్రముఖుల ఇళ్ళల్లో జరిగే రహస్య లావాదేవీలను వెంటనే సుల్తాన్కు చేరవేసే విధంగా చర్యలు తీసుకొన్నాడు. మూడు, బహిరంగ ప్రదేశాలలో మద్యం, మాదక ద్రవ్యాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాడు. నాలుగు, ప్రముఖుల ఇళ్ళల్లో సలా సమావేశాలను అదుపుచేసేందుకు ఉత్తర్వులు జారీ చేశాడు. ఉన్నత పదవిలో ఉన్న అధికారులు, వారి కుటుంబ సభ్యుల వివాహాలను ఇతర సభ్యులతో కుదుర్చుకొనే ముందు సుల్తాన్ యొక్క ముందస్తు అనుమతిని తప్పనిసరి చేశాడు.

Question: 5

అత్యధిక బిడ్డర్ కు ఆదాయాన్ని సేకరించే హక్కును వేలం వేసే వారన్ హేస్టింగ్స్ ప్రయోగం దాదాపుగా దేనినిపోలి ఉంటుంది.

  1. విజయనగరాల పాలిగార్ వ్యవస్థ
  2. ఢిల్లీ సుల్తానుల ఇక్తా వ్యవస్థ
  3. మొఘలుల జాగీర్ వ్యవస్థ
  4. మొఘలుల ఇజారా వ్యవస్థ
View Answer

Answer: 4

మొఘలుల ఇజారా వ్యవస్థ

Explanation:

ఇజరేదారి వ్యవస్థ:

  • బెంగాల్‌లో వారెన్ హేస్టింగ్స్ 1773లో ఇజరేదారీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • ఇజరేదారీ వ్యవస్థ భారతదేశంలో బ్రిటిష్ వారు అమలు చేసిన మొదటి భూ యాజమాన్య విధానం. ఈ విధానంలో, ఒక నిర్దిష్ట ప్రాంతానికి ఆదాయాన్ని సేకరించే హక్కు అత్యధిక బిడ్డర్‌కు వేలం వేయబడింది.
  • రైతులు, దుకాణదారులు మరియు వంటి సమాజంలోని నిర్దిష్ట వ్యక్తులు
  • వ్యాపారులు తమ పన్నులను ఇజరేదార్‌కు చెల్లించవలసి వచ్చింది
  • వారెన్ హేస్టింగ్స్ మొదట వార్షిక నుండి 5 సంవత్సరాల వరకు మరియు తరువాత వార్షికంగా అంచనా వేశారు.
Recent Articles