Home  »  TGPSC 2022-23  »  Indian History-10

Indian History-10 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) స్థాపనతో కింది వారిలో ఎవరు సంబంధం కలిగి ఉన్నారు?
ఎ. భగత్ సింగ్

బి. ఖుదీరామ్ బోస్

సి. చంద్రశేఖర్ ఆజాద్

డి. సుభాష్ చంద్రబోస్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి & డి మాత్రమే
  3. డి మాత్రమే
  4. ఎ & సి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి & సి మాత్రమే

Explanation: 

హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)

  • సహాయ నిరాకరణోద్యమం నిలిపివేసిన తర్వాత అనేక విప్లవ సంఘాలు వెలిశాయి.
  • తదుపరి అఖిల భారత స్థాయిలో ఒక విప్లవ సంఘం ఉండాలనే ఆలోచనతో దేశంలోని వివిధ ప్రాంతాల విప్లవకారులు 1924 అక్టోబర్ లోకాన్పూర్ లో  సమావేశమయ్యారు.
  • ఈ సమావేశంలోనే విప్లవకారులంతా కలిసి అఖిల భారత విప్లవ సంఘంగా ఏర్పడి హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్  (HRA)ను కాన్పూర్లో 1924లో స్థాపించారు.

కాన్పూర్ – విప్లవాల కేంద్రం అని పిలిచే ప్రాంతం.

  • చంద్రశేఖర ఆజాద్, సచ్ఛీంద్రనాథ్ సన్యాల్ మరియు రాంప్రసాద్ బిస్మిల్ అనే విప్లవకారులు దీనిని స్థాపించారు.
  • సంస్థ (HRA) లక్ష్యాలు; భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా ఏర్పరచడం.
  • రిపబ్లిక్ ను  సాధించడం.
  • తదుపరి 1928, సెప్టెంబర్ 8న HRAను హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (HSRA)గా మార్చబడింది
  • HSRA ఆశయం – ఇండియాలో సోషలిజాన్ని స్థాపించడం.
  • ఈ సంస్థ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని ఏర్పాటు చేసింది. దీని సేనాధిపతి – చంద్రశేఖర్ ఆజాద్

Question: 2

భారత జాతీయ ఉద్యమ క్రమంలో ఈ క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా ఏర్పాటు చేయండి:
ఎ. చౌరీ చౌరా సంఘటన
సి. చంపారన్ సత్యాగ్రహం
బి. రౌలత్ సత్యాగ్రహం
డి. మోపలా తిరుగుబాటు
సరైన జవాబు ని ఎంచుకోండి.

  1. సి, ఎ, డి, బి
  2. డి, ఎ, సి, బి
  3. బి, డి, సి, ఎ
  4. ఎ, సి, డి, బి
View Answer

Answer: 1

సి, ఎ, డి, బి

Explanation: 

  • రెండో ప్రపంచ యుద్ధంలో (1939-1945) చోటుచేసుకున్న అత్యంత హింసాత్మక ఘటనల్లో ఇదీ ఒకటి.
  • 1941 డిసెంబర్ 7వ తేదీన అమెరికా పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి చేసింది.

Question: 3

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నౌకాదళ స్థావరంపై జపాన్ చేసిన ఆకస్మిక దాడి ఈ క్రింది వాటిలో ఏది?

  1. హవాయిలోని పెర్ల్ హార్బర్
  2. కాలిఫోర్నియాలోని పోర్ట్ శాన్ డియాగో
  3. కుక్ దీవులలోని అరుతంగ నౌకాశ్రయం
  4. పనామాలోని బాల్బోవా నౌకాశ్రయం
View Answer

Answer: 1

హవాయిలోని పెర్ల్ హార్బర్

Explanation: 

  • 1930 లో సూర్య సేన్ నాయకత్వం లో చిట్టగాంగ్ ఆయుధాగారం పై దాడి చేసి దోచుకున్నాడు
  • సూర్యాసేన్ చిట్టగాంగ్లో బ్రిటీషుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇతను 10-15 సం॥ల పిల్లలతో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే సైనిక దళాన్ని ఏర్పాటు చేశాడు.
  • ఈ దళంతో చిట్టా గాంగ్ ని ఆయుధ కర్మాగారం, ఆఫీసర్స్ క్లబ్, టెలికమ్యూనికేషన్స్ స్థావరాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
  • దీనినే చిట్టగాంగ్ కుట్ర అంటారు. బ్రిటీష్ వారు ఈ తిరుగుబాటును అతి దారుణంగా అణచివేసి సూర్యాసేనను ఉరి తీశారు. ఇతనికి సహకరించిన మహిళ ప్రీతీలత వడ్డేదార్.

Question: 4

చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ ను ఏ సంస్థ సభ్యులు చేపట్టారు?

  1. ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ
  2. ఇండియన్ నేషనల్ ఆర్మీ
  3. తాత్కాలిక విప్లవ సైన్యం
  4. భారత జాతీయ కాంగ్రెస్
View Answer

Answer: 3

తాత్కాలిక విప్లవ సైన్యం

Question: 5

భారతదేశంలో పురపాలక పరిపాలనలో స్వపరిపాలన సూత్రాలను ప్రవేశపెట్టడం ఈ క్రింది వాటి ఫలితమే :

  1. జూలై 1866 లార్డ్ కర్జన్ యొక్క తీర్మానం
  2. లార్డ్ డల్హౌసీ ఏప్రిల్ 1901 యొక్క తీర్మానం
  3. ఫిబ్రవరి 1903 సర్ విలియం బెంటింక్ యొక్క తీర్మానం
  4. మే 1882 లార్డ్ రిప్పన్ యొక్క తీర్మానం
View Answer

Answer: 4

మే 1882 లార్డ్ రిప్పన్ యొక్క తీర్మానం

Explanation: 

లార్డ్ రిప్పన్  (1880-84):

  •  ఇతను రైతు స్నేహితుడు. సివిల్ సర్వీసెస్ గరిష్ట పరిమితిని 19 సం|| నుండి – 21 కి పెంచాడు.
  • 1882లో ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని రద్దు చేశాడు. 1881లో ఫ్యాక్టరీ చట్టము చేయబడింది.
  • కలకత్తాలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ని  1882లో స్థాపించాడు.  1881లో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో దశాబ్ద జనాభా లెక్కలను చేపట్టాడు. (254 మిలియన్లు)
  • 1882 స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టాడు. ఇతనిని భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు1883 ఇల్ బర్ట్ బిల్లు  వివాదం (ఈ బిల్లు ప్రకారం భారతీయులు బ్రిటీష్ / యూరోపియన్లను విచారించే అధికారం కల్పించాడు)
  • 1883లో కరువు నియమావళి (కరువును ఎదుర్కొనే  విధానం) ప్రవేశపెట్టాడు.
  • విద్యాభివృద్ధికై హంటర్ కమీషను ఏర్పాటు చేశాడు.
  • 1882 మైసూర్ రాజ్యంను తిరిగి ఒడయార్ కుటుంబానికి అప్పగించాడు.
Recent Articles