Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-8

Telangana Movement-8 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1953లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ లో ఈ క్రింది వారిలో సభ్యుడు కాని వారు ఎవరు?

  1. KM ఫణిక్కర్

  2. హృదయనాథ్ కుంజ్రు

  3. సయ్యద్ ఫజల్ అలీ

  4. కెఎస్ వాంచూ

View Answer

Answer: 4

కెఎస్ వాంచూ

Explanation:

  • 1953 డిసెంబర్ 29 న సయ్యద్ ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
  • దీనిలోని సభ్యులు:
  • సయ్యద్ ఫజల్ అలీ(ఒడిశా గవర్నర్)- అధ్యక్షుడు
  • H.N కుంజ్రూ
  • K.M ఫణిక్కర్
  • నివేదిక: 1955 సెప్టెంబర్ 30
  • 5 వ చాప్టర్- హైదరాబాద్ రాష్ట్రం, 6 వ ఛాప్టర్- ఆంధ్రరాష్ట్రం
  • అభిప్రాయాలు:
  • 1. హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన మూడు భాగాలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విశాలాంధ్ర ఏర్పాటుచేయడం
  • 2. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ లోని 10 జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయడం
  • 3. హైదరాబాద్ రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచడం.
  • Additional Info:
  • కైలాస్ నాథ్ వాంఛ కమిటీ: 1953
  • మద్రాస్ రాష్ట్రాన్ని విభజించి నూతన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల వచ్చే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు
  • సూచనలు: ఆంధ్రరాష్ట్రానికి మద్రాసు  ఉమ్మడి రాజధానిగా 4 టాప్ సంవత్సరాలు ఉంచాలని సూచించింది.
  • అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి: C. రాజగోపాలచారి
 

Question: 2

చిన్న, పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సూచించిన మూడు పారామీటర్లు:

  1. భాష, ప్రాంతం మరియు పోలీసు

  2. జనాభా, భాష మరియు ఆర్థిక సామర్థ్యం

  3. భాష భూభాగం మరియు సహజ వనరులు

  4. జనాభా, ప్రాదేశిక పరిధి మరియు ఆర్థిక స్వయం సమృద్ధి

View Answer

Answer: 4

జనాభా, ప్రాదేశిక పరిధి మరియు ఆర్థిక స్వయం సమృద్ధి

Explanation:

  • చిన్న రాష్ట్రాలపై BR. అంబేడ్కర్ రచించిన పుస్తకం: Thoughts on linguistic states.
  • చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల రాక్ రాష్ట్రంలో సమర్థపాలన ఏర్పడి మైనారిటీ వర్గాలు బలహీన కులాలకు మెజారిటీ ప్రజల నుండి రక్షణ లభిస్తుంది అని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు
  • అంబేడ్కర్  “ఒక రాష్ట్రం- ఒక భాష”  భావన:
  • ‘ఒక్క భాష- ఒక రాష్ట్రం’: ఒకే భాష కలిగిన వారందరితో కలిపి ఒకే రాష్ట్రం ఏర్పాటు
  • ‘ఒక్క రాష్ట్రం- ఒక బాష’: ఒక్క భాష మాట్లాడేవారితో ఎన్ని రాష్ట్రాలైన ఉండవచ్చు
  • అంబేడ్కర్ రెండవ అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు.
  • చిన్న రాష్ట్రాల ఏర్పాటులో ఆయన మూడు కొలమానాలు:
    1. జనాభా
    2. భౌగోళిక విస్తీర్ణం
    3. ఆర్థిక స్వావలంబన
  • ఒక్క భాష మాట్లాడే ప్రజలను ఎన్ని రాష్ట్రాల విభజించవచ్చు అనే అంశాలు:
    1. మెజారిటీ మరియు మైనారిటీ ల నిష్పత్తి
    2. సమర్థ వంతమైన పరిపాలన
    3. వివిధ ప్రాంతాల మనోభావాలు
    4. వివిధ ప్రాంతాల అవసరాలు

Question: 3

ఈ క్రింది వారిలోఎవరు ఫిబ్రవరి 25, 1970న సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేశారు?

  1. మర్రి చెన్నా రెడ్డి

  2. కాళోజీ నారాయణరావు

  3. ఈశ్వరి బాయి

  4. మైదం రామ చంద్రయ్య

View Answer

Answer: 4

మైదం రామ చంద్రయ్య

Explanation:

  • 1970 ఫిబ్రవరి 25 న సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ ప్రాంతంలో అమరవీరుల స్తూపాన్ని నగర డిప్యూటీ మేయర్ M. రామచంద్రయ్య శంకుస్థాపన చేశారు
  • 1970 ఫిబ్రవరి 23 న గన్‌పార్క్ అమరవీరుల స్తూపాన్ని నగర మేయర్ S. లక్ష్మినారాయణ శంకుస్థాపన చేశారు.
  • ఈ రెండు స్థూపాలు 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్ధం నెలకొల్పారు
  • స్తూపాన్ని చెక్కినవారు: యొక్క ఎక్కా యాదగిరి రావు
  • అమరవీరుల స్తూపం ప్రత్యేకతలు
  •  స్తూపం యొక్క అడుగు భాగం నల్లరాతితో తయారు చేయబడింది
  • ఈ నల్లరాతిపై నాలుగువైపుల శిలా ఫలకాలు ప్రతి వైపున 9 రంధ్రాలు అప్పటి తెలంగాణ 9 జిల్లాలను సూచిస్తాయి.
  • పైభాగంలో అశోకచక్రం ఉంటుంది.
 

Question: 4

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిన 1969లో తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం :

  1. ఎనిమిది పాయింట్ల ఫార్ములా

  2. ఫైవ్ పాయింట్ ఫార్ములా

  3. తెలంగాణ రక్షణ పథకం

  4. సిక్స్ పాయింట్ ఫార్ములా

View Answer

Answer: 1

ఎనిమిది పాయింట్ల ఫార్ములా

Explanation:

  • 8 పాయింట్ ఫార్ములా: 11 ఏప్రిల్ 1969
  •  తెలంగాణ ఉద్యమ తీవ్రతను గమనించి లోకసభలో తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకాన్ని ప్రకటించారు
  • 1) తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి సుప్రీం కోర్ట్ జడ్జ్ నేతృత్వంలో ఉన్నతాధికార సంఘం
  • 2) మిగులు నిధుల తరలింపు వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించడానికి కావాల్సిన నిధుల సమకూర్పు
  • 3) తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికల కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రాంతీయ అభివృద్ధి సంఘం
  • 4) ప్రణాళికల అమలుకు రణాళిక సంఘం సలహాదారుని అధ్యక్షతన ఒక అధికారుల కమిటీ
  • 5) తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం
  • 6) తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకే కేటాయించేలా రాజ్యాంగపరమైన ఏర్పాటు
  • 7) తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగుల సర్వీసుల సమస్య పరిష్కారానికి UPSC ఆధ్వర్యంలో ఒక కమిటీ
  • 8) తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన చాలా చాలా చాలాపై కేంద్ర ప్రభుత్వం ఆరు నెల ఆరు నెలలకు ఒకసారి ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలు జరుపుట.

Question: 5

పెద్దమనుషుల ఒప్పందానికి \’నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్\’ చేసిన ముఖ్యమైన

  1. ఆంధ్ర మరియు హైదరాబాద్ లను కలిపి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన తర్వాత కొత్త రాష్ట్రం పేరును మార్చింది.

  2. ఇది ఎటువంటి మార్పు చేయలేదు.

  3. తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ అవసరం లేదని అభిప్రాయపడింది.

  4. ఇది ప్రాంతీయ కౌన్సిలు ప్రాంతీయ స్టాండింగ్ కమిటీగా మార్చింది మరియు దాని అధికారాలను తగ్గించింది.

View Answer

Answer: 4

ఇది ప్రాంతీయ కౌన్సిలు ప్రాంతీయ స్టాండింగ్ కమిటీగా మార్చింది మరియు దాని అధికారాలను తగ్గించింది.

Explanation:

  • పెద్ద మనుషుల ఒప్పందం: 1956 ఫిబ్రవరి 20, ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్.
  • కేంద్రహోంమంత్రి గోవింద్ వల్లభ్‌పంత్ సమక్షంలో జరిగింది
  • హాజరైన నాయకులు:
  • తెలంగాణ– బూర్గుల రామకృష్ణారావు, K.V. రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి, J.V నర్సింగరావు
  • ఆంధ్ర– బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు.
  • ఈ ఒప్పందంలో 14 అంశాలున్నాయి
  • పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యమైన ఉల్లంఘన-
  • పార్లమెంట్‌లో పెద్ద మనుషుల ఒప్పందం- నోట్ టర్న్ ఆన్ సేఫ్ గార్డ్స్ పేరుతో ప్రవేశపెట్టే సమయానిక
  • తెలంగాణ ప్రాంతీయ మండలికి బదులు తెలంగాణ ప్రాంతీయ ప్రతిపాదించారు.
  • నిర్మా ణం లోనూ అధికారంలోనూ ప్రాంతీయ కమిటీ, ప్రాంతీయ మండలి కంటే బలహీనమైనది.
Recent Articles