Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-4

Telangana Movement-4 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని క్లాజ్ 14-ఎ లో ఉన్న సమస్య ఏమిటి?

  1. అన్ని పోస్టులకు హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా పరిగణించడం

  2. పోలీసు అధికారుల నియామకం కోసం హైదరాబాద్ ను ఫ్రీ జోన్ పరిగణించడం.

  3. 15% స్థానికేతరుల కోటాను ఓపెన్ కోటాగా పరిగణించడం

  4. రాష్ట్రాన్ని 7 జోన్లుగా విభజించడం

View Answer

Answer: 2

పోలీసు అధికారుల నియామకం కోసం హైదరాబాద్ ను ఫ్రీ జోన్ పరిగణించడం.

Explanation:

రాష్ట్రపతి ఉత్తర్వులు (ఆర్టికల్ 371 d) – 18 అక్టోబర్ 1975 నాడు రాజ్యాంగం లో ని ఆర్టికల్ 371(d) ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పటి రాష్ట్రపతి: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
దీనిలోని ముఖ్యాంశాలు:
1. ఉద్యోగాల నియామకాల కోసం రాష్ట్రాన్ని 6 జోన్లు గా విభజించారు.
– ఆంధ్ర కు 1,2,3,4 జోన్లు,
– రాయలసీమ కు 5 వ జోనూ
– తెలంగాణ కు 5,6 జోన్లు.
2. స్థానిక రెజర్వేషన్లు: జిల్లా స్థాయి -80%, జోనల్ స్థాయి నాన్-గెజిటెడ్- 70%, జోనల్ స్థాయి గెజిటెడ్- 60%.
3. స్థానికత: ఒక విద్యార్థి 4-10వ తరగతి వరకు 4 సంవత్సరాలు ఎ ప్రాంతంలో చదువుతాడో, ఆ జోను కు స్థానికుడు అవుతాడు.
4. ఉత్తర్వుల్లో 14 వ పేరా ప్రకారం కొన్ని కార్యాలయాల నియామకాలకు స్థానిక నియమాలు వర్తించవు. అవి:
 14 ఏ- సెక్రటేరియట్, 14 బి- శాఖాధిపతుల కార్యాలయాలు, 14 సి- ప్రత్యేక సంస్థలు, 14 డి- రాష్ట్రస్థాయి కార్యాలయాలు, 14 ఈ- భారీ ప్రాజెక్ట్ ల లో గెజిటెడ్, ఆపై స్థానాలు, 14 ఎఫ్- జంటనగరాల్లో పోలీస్ నియామకాలు.
5. అక్టోబర్ 9 2009 న సుప్రీం కోర్ట్ డివిజన్ బెంచ్ రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14- ఎఫ్ ప్రకారం జంటనగరాలను పోలీస్ నియామకాలకు సంబంధించి ఫ్రీ జోన్‌గా పరిగణించాలని తీర్పునిచ్చింది
6. సుప్రీం కోర్ట్ తీర్పును నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు 21 అక్టోబర్ 2009 న సిద్దిపేటలో ‘ఉద్యోగ గర్జన’ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Question: 2

ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే, కేసీఆర్ కు బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు?

  1. జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ

  2. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

  3. జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి

  4. కాకాని పెదపేని రెడ్డి

View Answer

Answer: 3

జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి

Explanation:

  • 29 నవంబర్ 2009 న కెసీఆర్ సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లిలో దీక్ష చేయడానికి కరీంనగర్ నుంచి బయలుదేరగా, అలగనూరు సెంటర్ దగ్గర రోశయ్య ప్రభుత్వం అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించింది.
  • కేసీఆర్‌తోపాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, విజయరామారావు, నాయిని నర్సింహారెడ్డి తదితరులను 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు.
  • కేసీఆర్ ఖమ్మం జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించాడు.
  • దీక్ష పైన కెసిఆర్ కుమార్తె కవిత ఇచ్చిన పిటిషన్ మేరకు అప్పటి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ బి సుభాషణ్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్‌ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో  NIMS కు  తరలించారు.

Question: 3

2001లో నియమించబడిన JM గిర్లానీ కమిషన్ యొక్క ఆదేశం

  1. తెలంగాణ మిగులు ఇతర ప్రాంతాలకు మళ్లించడాన్ని పరిశీలించడం

  2. ముల్కీయేతర ఉద్యోగులను వారి ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించడాన్ని పరిశీలించడం

  3. ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరుల పంపిణీని సూచించడం

  4. GO Ms. 610 అమలులో జరిగిన అన్యాయాన్ని పరిశీలించి, అంగ నోట్లను క్రమబద్ధీకరించడం.

View Answer

Answer: 4

GO Ms. 610 అమలులో జరిగిన అన్యాయాన్ని పరిశీలించి, అంగ నోట్లను క్రమబద్ధీకరించడం.

Explanation:

జె ఎమ్ గిర్ గ్లాని కమిషన్  (J.M Girglani Commission)

  • 610 జీవో అమలును పరిశీలించడానికి జూన్ 25, 2001న జె.ఎమ్ గిర్ గ్లాని కమిటీ ఏర్పాటు చేసింది- అప్పటిముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
  • ఇది ఏకసభ్య విచారణ కమిటీ.
  • ఈ కమిటీకి ప్రభుత్వం పెట్టిన గడువు: 90 రోజులు.
  • ఈ కమిటీ విచారణకు ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 2001 అక్టోబర్ లో తొలి నివేదికను 25% ఉద్యోగుల జాబితాతో ప్రభుత్వానికి సమర్పించింది.
  • మొదటి మధ్యంతర నివేదికలో 25% ఉద్యోగుల తొలి జాబితా తయారు చేయబడింది
  • గిర్ గ్లానీ తన తుది నివేదికను 30 సెప్టెంబర్ 2004 న అప్పటి ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.
  • రాష్ట్రపతి ఉత్తర్వు లు 126 పద్ధతుల్లో ఉల్లంఘించబడ్డాయని వాటిని 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కార మార్గాలను సూచించారు

సూచనలు:

  • ఈ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో అమలు కోసం కొన్ని చర్యలను సూచించింది:
  • సర్వీసు పుస్తకాలలో స్థానికత నమోదు జరగాలి
  • ఉల్లంఘలను సరిచేసిన తరువాత కొత్త నియమాకాలు, పదోన్నతులు చేపట్టాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వులు(1975) అమలుపై శాశ్వత సభా కమిటీని ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వులు(1975) అమలుపై శాశ్వత మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వుల్లో(1975) అమలుపై శాశ్వత అధికారుల కమిటీని నియమించాలి
  • సాధారణ పరిపాలన శాఖ చూసే సర్వీసు నిబంధనల విభాగం బలోపేతం చేయాలి
  • జీవో 610 అమలులో ఉల్లంఘనలను అధ్యయనం చేసేందుకు  రాష్ట్ర శాసనసభ ఒక  హౌస్ కమిటీని నియమించింది.

Question: 4

తెలంగాణపై వివిధ రాజకీయ పార్టీలు మరియు UPA భాగస్వాముల అభిప్రాయాలను సేకరించేందుకు 2005లో UPA నేతృత్వంలోని భారత ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు ఎవరు?

  1. ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్ మరియు జైరాం రమేష్

  2. ఎకె ఆంటోనీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్ మరియు శరద్ పవార్

  3. ఎకె ఆంటోనీ, శరద్ పవార్ మరియు సుశీల్ కుమార్ షిండే

  4. ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్ మరియు దయానిధి మారన్

View Answer

Answer: 4

ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్ మరియు దయానిధి మారన్

Explanation: 

  • ఈ కమిటీ ని 2005 జనవరిలో యూపీఏ ప్రభుత్వం  నియమించింది
  • వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపి విస్తృత స్థాయి అంగీకారం కోసం ప్రయత్నించడానికి ఈ కమిటీని నియమించారు
  • రఘువంశ్ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదల్ కు సంబంధించిన మంత్రి
    దయానిధి మారన్ డి ఎం కె పార్టీ కి చెందిన మంత్రి
  • ఈ కమిటీకి ఇచ్చిన సమయం ఎనిమిది వారాలు
    తెలంగాణపై అభిప్రాయం తెలపాలని ఈ కమిటీ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
  • యూపీఏ కూటమిలోని 13 పార్టీలలోని 11 పార్టీలు, ప్రతిపక్షమైన ఎన్డీఏ కూటమిలోని ఎనిమిది పార్టీలు, పలు స్వతంత్ర సభ్యులు తెలంగాణ రాష్ట్రం పట్ల తమ సమ్మతిని రాత పూర్వకంగా తెలిపాయి.

Question: 5

2001లో ఏర్పాటైన TRS తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

  1. జల దృశ్యం

  2. తెలంగాణ భవన్

  3. బూరుగుల రామకృష్ణారావు భవన్

  4. తెలుగు తల్లి భవన్

View Answer

Answer: 1

జల దృశ్యం

Explanation:

  • 27 ఏప్రిల్ 2001 న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్టీ ని కొండా లక్ష్మణ్ బాపూజీ స్వగృహమైన జలదృశ్యంలో స్థాపించాడు.
  • 1997 నవంబర్ నుండి తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా జలదృశ్యం ఉండేది.
    టీఆర్ఎస్ పార్టీ తొలి సభ: 17 మే 2001 న సింహగర్జన అనే పేరుతో కరీంనగర్‌లో ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజ్ లో తొలి బహిరంగ సభను నిర్వహించారు.
  • ఈ సభకు అధ్యక్షుడు: గొట్టే భూపతి
  • ముఖ్య అతిథి: శిబూ సోరెన్(జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు).
  • కేసీఆర్: 17 ఫిబ్రవరి, 1954 కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో జన్మించారు.
  • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలో 1900 83 లో చేరారు టిడిపి తరఫున నాలుగు సార్లు(1985,1989,19994,1999) సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
  • చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో రవాణా శాఖ మంత్రిగా, 1999 2001 వరకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Recent Articles