Home  »  TGPSC 2022-23  »  Indian History-11

Indian History-11 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

విప్లవకారులు

ఎ. భగత్ సింగ్

బి.సూర్యనే

సి. వాంచి అయ్యర్

డి. అష్ఫాకుల్లా

సంఘటనలు

1. కాకోరి కుట్ర కేసు

2. తిన్నెపల్లి కుట్ర కేసు

3. చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్

4. లాహోూర్ కుట్ర కేసు

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A-III; B-IV, C-I; D-II
  2. A-IV, B-II; C-III, D-I
  3. A-II; B-III; C-IV; D-I
  4. A-IV; B-III; C-II; D-I
View Answer

Answer: 4

A-IV; B-III; C-II; D-I

Explanation: 

లాహోర్ కుట్ర కేసు

  • లాఠీ చార్జిలో లాలాలజపతిరాయ్ మృతికి ఆగ్రహించిన భగత్ సింగ్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ తరపున మొదటి కార్యక్రమంగా 1928 డిశంబర్ లో సాండర్స్ ను హత్య చేసాడు.
  • ఇది లాహోర్ కుట్ర కేసుగా చరిత్రలో ప్రసిద్ధమైంది.
  • చిట్టగాంగ్ ఆయుధశాల దాడి దీన్ని చిట్టగాంగ్ తిరుగుబాటు, అని కూడా పిలుస్తారు.
  • ఇది 1930 ఏప్రిల్ 18న సూర్య సేన్ నేతృత్వంలోని యోధులు భారత స్వాతంత్ర్యం కోసం బెంగాల్ ప్రెసిడెన్సీ ఆఫ్ బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లోని చిట్టగాంగ్ ఆయుధశాల పై దాడి చేసారు. ఈ చిట్టగాంగ్ సాయుధ పోరాటం ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ చేపట్టింది

కకోరి కుట్ర కేసు

  • 1925 లో HINDUSTHAN REPUBLIC ASSOCIATION  సభ్యులు 40 మంది కకోరి వద్ద రైలు లో వస్తున్న ధనమును రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వం లో దోపిడి చేయాలని నిర్ణయించారు.
  • అందరినీ బ్రిటీష్ పోలీస్ లు ముందే అరెస్ట్ చేశారు .

Question: 2

ఈ క్రింది భారత రాష్ట్రపతిలలో ఎవరు భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు?

  1. వివి గిరి
  2. ఎస్. సంజీవ రెడ్డి
  3. జాకీర్ హుస్సేన్
  4. ఆర్. వెంకట్రామన్
View Answer

Answer: 1

వివి గిరి

Question: 3

ఈ క్రింది వాటిని సరిపోల్చండి

జాబితా-1

(ఎ) జమీందారీ వ్యవస్థ

(బి) డ్రెయిన్ ఆఫ్ వెల్త్

(సి) మహల్వారీ వ్యవస్థ

(డి) రైత్వారీ వ్యవస్థ

జాబితా – 2

1. విలియం బెంటింక్

2. థామస్ మున్రో

3. లార్డ్ కార్న్ వాలిస్

4. దాదాభాయ్ నౌరోజీ

  1. ఎ-3, బి-4, సి-1, డి-2
  2. ఎ-1, బి-2, సి-3, డి-4
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 1

ఎ-3, బి-4, సి-1, డి-2

Explanation: 

శాశ్వత భూమిశిస్తు విధానం (జమిందారీ పద్ధతి) :

  • 1793లో కారన్ వాలీస్ దీనిని బెంగాల్లో ప్రవేశపెట్టాడు.

1. రైత్వారీ విధానం :1820

గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్

  • 1792లో మదరాసు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని బారమహల్ కలెక్టర్ అయిన కల్నల్ రీడ్ దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టాడు. అలెగ్జాండర్ రీడ్ రైత్వారీ పద్దతిని మొదటగా తమిళనాడులోని బారామహల్లో ప్రవేశపెట్టారు. ఈ విధానాన్ని రాయలసీమలో ప్రవేశపెట్టిన వాడు – థామస్ మన్రో (1803)
  • చేన ఆదాయాన్ని బట్టి శిస్తు నిర్ణయిస్తారు.

2. మహల్వారి పద్ధతి :1833

  • ఈ పద్ధతి రూపకర్త – కల్నల్బర్డ్
  • ప్రవేశపెట్టింది – విలియం బెంటింగ్మ
  • హల్ అనగా సంస్థానం అని అర్థం.
  • గ్రామాన్ని గాని, సంస్థానాన్ని గాని ప్రామాణికంగా తీసుకున్న ఈ పద్దతికి మహళ్వారి పద్దతి అని పేరు పెట్టారు.
  • ఈ పద్దతిలో ప్రభుత్వం గ్రామ ప్రజల నుంచి నిర్ణీత మొత్తాన్ని భూమి పన్నుగా నిర్ణయించేది.
  • మహల్వారీ విధానం జమిందారీ విధానానికి, రైత్వారీ విధానానికి మధ్యే మార్గం వంటిది.
  • ఈ పద్దతి మొదట గుజరాత్, ఆగ్రాలలో ప్రవేశపెట్టబడింది.
  • భూమిశిస్తు విధానాల వల్ల సమాజంలో ఏర్పడిన వర్గాలు – జమిందారీ భూస్వామ్య వడ్డీవ్యాపార వర్గం భూమిశిస్తు విధానాల వల్ల వ్యవసాయం వ్యాపారం గా మారింది.

Question: 4

1919 లో రాజీనామా చేసిన వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో భారతీయ సభ్యుడు…………?

  1. తేజ్ బహదూర్ సప్రు
  2. BD సుకుల్
  3. BR జయకర్
  4. GS కపర్డే
View Answer

Answer: 2

BD సుకుల్

Question: 5

1928 బాల్డోలీ సత్యాగ్రహం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి:

  1. బ్రిటిష్ ఇండిగో తోటల యజమానులకు సృతిరేకంగా ఉంది.
  2. ఇది వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఉంది.
  3. ఇది రైతులకు ఆక్యుపెన్సీ హక్కులకు మద్దతు ఇచ్చింది.
  4. బొంబాయి ప్రభుత్వం భూశిస్తును 22% పెంచడాన్ని వ్యతిరేకించింది.
View Answer

Answer: 1

బ్రిటిష్ ఇండిగో తోటల యజమానులకు సృతిరేకంగా ఉంది.

Explanation: 

  • బార్డోలీ సత్యాగ్రహం చేపట్టిన సం|| : 1928
  • మరో పేరు: కిసాన్ ఉద్యమం
  • నాయకత్వం: సర్దార్ వల్లభాయ్ పటేల్
  • ముఖ్య కారణం: భూమి శిస్తును పెంచడం వల్లన
  • గుజరాత్లోని బార్టోలీ ప్రాంతంలో 1928లో పంటలకు సరైన గిట్టుబాటు ధర లభ్యంకాలేదు. అదే సమయంలో బ్రిటీషు వారు భూమిశిస్తును 22% పెంచారు.
  • దీనికారణంగా పట్టీదార్ మండలి సభ్యులు కల్యాణ్ మెహతా, కున్వర్ జీ మెహతా బ్రిటీష్ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు.
  • తర్వాత వల్లభాయ్ పటేల్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు.
  • అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో నినాదం అయిన “NO TAXATION WITHOUT REPRESENTATION” అనేనినాదమును వ్యాప్తి చేశాడు.
  • దీనికి భయపడిన బ్రిటీషు వారు “మాక్స్ వెల్డ్ బ్రూమ్ఫల్డ్” కమిటీని ఏర్పాటు చేశారు
Recent Articles