Home  »  TGPSC 2022-23  »  Indian Economy-18

Indian Economy-18 (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిలో ఏ కార్యక్రమాలు ‘జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 పరిధిలో ఉన్నాయి?
1. మధ్యాహ్న భోజన పథకం

2. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ స్కీమ్

3. ప్రజా పంపిణీ వ్యవస్థ

4. బఫర్ స్టాక్ మేనేజ్ మెంట్

  1. 1, 2 & 3
  2. 2, 3 & 4
  3. 3, 4 & 1
  4. 4, 1 & 2
View Answer

Answer: 1

1, 2 & 3

Explanation:

  • జాతీయ ఆహార భద్రత చట్టం 2013లో UPA ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది.
  • మధ్యాహ్న భోజన పథకం 1995 లో ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవల కాలంలో దీని పేరు పిఎం పోషణ్ అభియాన్ గా  2022 లో మార్చడం జరిగింది. ఈ పథకం ద్వారా 1 to 8 తరగతుల పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించడం. భారతదేశంలో మొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకం తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1984 లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు.
  • ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్1975 oct -2 ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అంగన్వాడి కేంద్రాల నుండి గర్బిణి స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు పాలుతోపాటు మంచి ఆహారం ను ప్రభుత్వం అందిస్తుంది
  • ప్రజా పంపిణీ వ్యవస్థ-1960 లో ప్రవేశ పెట్టడం జరిగింది.ఇది 1960లలో అప్పటి ఆహార కొరతకు ప్రతిస్పందనగా విస్తరించబడింది; తదనంతరం, PDS కోసం దేశీయ సేకరణ మరియు ఆహార ధాన్యాల నిల్వను మెరుగుపరచడానికి ప్రభుత్వం వ్యవసాయ ధరల కమిషన్ మరియు FCIలను ఏర్పాటు చేసింది.
  • TPDS-1997 ఇది BPL ప్రజలకి ప్రత్యేకంగా ఆహార సరఫరా లో అందించడం కోసం ప్రవేశపెట్టడం జరిగింది.

 

Question: 2

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి:
1. గ్రామీణ ఉద్యోగార్ధులకు 100 రోజుల తప్పనిసరి ఉపాధి కల్పించాలి.

2. స్త్రీ, పురుష కార్మికులకు సమాన వేతనాలు చెల్లించాలి.

3. లబ్ధిదారుల్లో మూడోవంతు మహిళలు ఉండాలి.

4. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉపాధి కల్పించాలి.

పై వాక్యాలలో ఏది సరైనది?

  1. 1, 2 & 3
  2. 2, 3 & 4
  3. 3, 4 & 1
  4. 4, 1 & 2
View Answer

Answer: 1

1, 2 & 3

Explanation:

  • ఇది 2005 లో చట్టం చేయబడింది 2006 ఫిబ్రవరి 2  లోAndhra Pradesh లోని బండ్లపల్లి అనంతపూర్ జిల్లా లో  ఈ పథకాన్ని అమలు తీసుకురావడం జరిగింది 2009న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చడం జరిగింది
  • గ్రామీణ నిరుద్యోగులు కి 100 రోజుల తప్పనిసరి ఉపాధి కల్పించాలి.
  • స్త్రీ, పురుష కార్మికులకు సమాన వేతనాలు చెల్లించాలి.
  • లబ్ధిదారుల్లో మూడోవంతు మహిళలు ఉండాలి
  • ఈ పథకం అమలు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతుంది
  • దీనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో కార్డు జార్ చేయాలి
  • నోట్: మన దేశంలో మొదటిసారిగా ఉపాధి హామీ పథకం 1972-73 లో మహారాష్ట్రలో ప్రవేశపెట్టడం జరిగింది

Question: 3

ఒక దేశం మాంద్యంలోకి ప్రవేశించినప్పుడు, అనేక ఉద్యోగాలు కోల్పోతాయి. ఈ పరిస్థితి ఏమని అంటారు:

  1. ఘర్షణ నిరుద్యోగం
  2. చక్రీయ నిరుద్యోగం
  3. కాలానుగుణ నిరుద్యోగం
  4. ముసుగు నిరుద్యోగం
View Answer

Answer: 2

చక్రీయ నిరుద్యోగం

Explanation: 

  • చక్రియ నిరుద్యోగిత: అనేది అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది  ఇది ఆ దేశంలో ఆర్థిక మాంద్యం కాలంలో ఏర్పడే   నిరుద్యోగాన్నిచక్రియ నిరుద్యోగిత. ఇది తాత్కాలిక స్వభావం కలిగినది మళ్లీ సార్దిక డిమాండ్ పెరిగినట్లయితే చక్రియ నిరుద్యోగిత అదృశ్యం అవుతుంది

Question: 4

కింది పద్ధతుల్లో ఏది సాపేక్ష పేదరికాన్ని కొలుస్తుంది?

  1. దారిద్య్ర రేఖ
  2. లోరెంజ్
  3. ఉదాసీనత వక్రత
  4. గిఫెన్ పారడాక్స్
View Answer

Answer: 2

లోరెంజ్

Explanation:

  • సాపేక్ష పేదరికం కొలిచేది గిని సూచిక . ఇది ఒక వ్యక్తి ఆదాయ అసమానతను మరియు జీవన ప్రమాణాలు కొలవడానికి ఉపయోగపడుతుంది ఇది అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుంద
  • నిరుపేక్ష పేదరికం అంటే తమ కనీస అవసరాలు పొందలేని పరిస్థితిని నిరుపేక్షపెదరికం అంటారు ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. ఇది నిజమైన పేదరికం సూచిస్తుంది. నిరుపేక్ష పేదరికాన్ని తలల లెక్కింపు పద్ధతి ద్వారా కొలుస్తారు.

Note: భారతదేశంలో పేదరికం కొలిచే పద్ధతులు:

  1. తల లెక్కింపు పద్ధతి
  2. పేదరికపు అంతర సూచి
  3. సేన్ ఇండెక్స్
  4. గిరి గుణకం
  5. కనీస అవసరాల దృక్పథం
  6. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్

Question: 5

గ్రామీణ భారతదేశంలో దారిద్య్ర లేఖ అనేది రోజువారీ క్యాలరీలను కలిగి ఉండే నెలవారీ తలసరి వ్యయ తరగతి మధ్య బిందువుగా నిర్వచించబడింది:

  1. వ్యక్తికి 2,400 కేలరీలు
  2. వ్యక్తికి 2,300 కేలరీలు
  3. వ్యక్తికి 2,200 కేలరీలు
  4. వ్యక్తికి 2,100 కేలరీలు
View Answer

Answer: 1

వ్యక్తికి 2,400 కేలరీలు

Explanation:

  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గ్రామీణ ప్రాంతాలలో ప్రతి వ్యక్తికి రోజుకు 2400 కిలో కేలరీలు మరియు పట్టణ ప్రాంతాలకు 2100 కిలో కేలరీలు ఉండాలని సిఫార్సు చేసింది. ఉండాలి
Recent Articles