Home  »  TGPSC 2022-23  »  Indian Polity-9

Indian Polity-9 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత రాజ్యాంగంలోని పార్ట్-III లోని కింది ఏ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినది?

  1. ఆర్టికల్ 14
  2. ఆర్టికల్ 15
  3. ఆర్టికల్ 16
  4. ఆర్టికల్ 17
View Answer

Answer: 3

ఆర్టికల్ 16

Explanation:

  • రాజ్యాంగంలో 3 వ భాగంలో ఆర్టికల్ 12-35 వరకు  ప్రాథమిక హక్కులు  పొందుపరిచారు
  • సమానత్వపు హక్కు(14-18)

16వ ప్రకరణ :

  • ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాన్ని 16వ ప్రకరణ ఇస్తుంది.
  • 16(1) ప్రకారం : ఏ పదవులైనా, ఉద్యోగాలైనా పౌరులం దరికీ సమానంగా వర్తిస్తాయి.
  • 16(2) ప్రకారం : మతం, జాతి, కులం, లింగం, వంశపారంపర్యం, జన్మస్థలం, నివాసం వంటి కారణా లను బట్టి ప్రభుత్యోద్యోగాలలో వివక్షత చూపరాదు.

Question: 2

భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ కి ‘మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ’తో సంబంధం ఉంది?

  1. ఆర్టికల్ 14
  2. ఆర్టికల్ 16
  3. ఆర్టికల్ 24
  4. ఆర్టికల్ 26
View Answer

Answer: 4

ఆర్టికల్ 26

Explanation:

  • రాజ్యాంగంలో 3 వ భాగంలో ఆర్టికల్ 12-35 వరకు ప్రాథమిక హక్కులు పొందుపరిచారు
  • మతస్వాతంత్రపు హక్కు(25-28)
  • 25. మత విశ్వాసాలను కల్గి ఉండే హక్కు, మత ప్రచా రం చేసుకునే హక్కు
  • 26. శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి భంగం కల్గించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చు.
  • 27. మత వ్యాప్తికై పన్నులు విధించరాదు.
  • 28. ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రత్యేక మత భోధ నిషేధం

Question: 3

ఈ క్రింది వాటిని సరిపోల్చండి

ఆర్టికల్
ఎ. 132
బి. 133
సి. 134.
నియమం
1. అప్పీల్ చేయడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతిని మంజూరు చేయవచ్చు
2. క్రిమినల్ విషయాలలో సుప్రీం కోర్ట్ హోం యొక్క అప్పీలేట్ అధికార పరిధి

3. సివిల్ విషయాలలో సుప్రీంకోర్టు అప్పీల్ అధికార పరిధి.
ఎంపికలు :

  1. ఎ-1, బి-2, సి-3
  2. ఎ-2, బి-1, సి-3
  3. ఎ-3, బి-2, సి-1
  4. ఎ-1, బి-3, సి-2
View Answer

Answer: 4

ఎ-1, బి-3, సి-2

Explanation:

  • సుప్రీంకోర్టు అధికార పరిధి (Jurisdiction and Powers of Supreme Court)
  • సుప్రీంకోర్టుకి రాజ్యాంగం ఎంతో విస్తృతమైన అధికార పరిధిని మరియు ఎన్నో అధికారాలను ఇచ్చింది. రాజ్యాంగాన్ని సంరక్షిస్తుంది. రాజ్యాంగ వ్యాఖ్యానంలో దీని తీర్పు తుది నిర్ణయంగా ఉంటుంది. పైగా దీనికి సలహా ఇచ్చే అధికారాలు మరియు నియంత్రణ చేసే అధికారాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని సుప్రీంకోర్టుల కన్నా భారత సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అధికార పరిధి మరియు అధికారాలను ఈ క్రింది విధంగా విభజించవచ్చును
  1. ప్రాథమిక అధికార పరిధి.
  2. రిట్ అధికార పరిధి.
  3. అప్పీళ్ల అధికార పరిధి.
  4. సలహా అధికార పరిధి.
  5. కోర్ట్ ఆఫ్ రికార్డ్.
  6. న్యాయ సమీక్షాధికారం.
  7. రాజ్యాంగ వివరణ.
  8. ఇతర అధికారాలు.
  • ఆర్టికల్ 132 సివిల్ విషయాలపై హైకోర్టు నుండి వచ్చే అప్పీళ్లపై సుప్రీంకోర్టుకి అప్పీళ్ల అధికార పరిధి
  • ఆర్టికల్ 133 క్రిమినల్ వ్యవహారాలపై సుప్రీంకోర్టు అప్పీళ్ల అధికార పరిధి
  • ఆర్టికల్ 134 సుప్రీంకోర్టులో అప్పీల్ సర్టిఫికెట్

Question: 4

ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FICCI) ……లో ఏర్పడింది.

  1. 1917
  2. 1920
  3. 1927
  4. 1930
View Answer

Answer: 3

1927

Explanation:

  • 1927లో, మహాత్మా గాంధీ సలహా మేరకు భారతీయ వ్యాపారవేత్త G.D. బిర్లా మరియు పురుషోత్తమదాస్ ఠాకూర్‌దాస్ ద్వారా స్థాపించబడింది.  ఇది భారతదేశంలోని అతి పెద్దది, పురాతనమైనది మరియు అత్యున్నత వ్యాపార సంస్థ.  ఇది ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని సంస్థ.  FICCI దాని సభ్యత్వాన్ని SMEలు మరియు MNCలతో సహా ప్రైవేట్ మరియు పబ్లిక్ రెండింటి నుండి కార్పొరేట్ రంగం నుండి తీసుకుంటుంది.  చాంబర్‌లో వివిధ ప్రాంతీయ వాణిజ్య ఛాంబర్‌ల నుండి 250,000 కంపెనీల పరోక్ష సభ్యత్వం ఉంది.  ఇది సెక్టార్-నిర్దిష్ట వ్యాపార నిర్మాణం, వ్యాపార ప్రమోషన్ మరియు నెట్‌వర్కింగ్‌లో పాల్గొంటుంది

Question: 5

భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పంచాయతీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలకు సంబంధించినది?

  1. 243G
  2. 243M
  3. 243Q
  4. 243W
View Answer

Answer: 1

243G

Explanation:

పంచాయితీల అధికార విధులు (243 G) :

  • రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్డ్లో గ్రామ పంచాయితీ 29 రకాల విధులను నిర్వహించాలని పేర్కొనడంజరిగింది.
  • మూడంచెల పంచాయతీరాజ్ విధానంలో మొదటి అంచె ‘గ్రామ పంచాయతీ’. దీనికి సర్పంచ్ రాజకీయ అధిపతి. సర్పంచ్కు పరిపాలనలో సహకరించేందుకు ‘పంచాయతీ కార్యదర్శి’ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరి సమన్వయంతో గ్రామ పంచాయతీ తన అధికారాలు, విధులు నిర్వహిస్తుంది.
Recent Articles