Home  »  TGPSC 2022-23  »  Telangana History-2

Telangana History-2 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

నిజాం పాలనలో ప్రైవేట్ గా నడిచే వీధి పాఠశాలలను ఎలా పిలిచేవారు:

  1. విద్యాసంస్థ
  2. తధిల్
  3. శిక్షాలయ్
  4. ఖంగి
View Answer

Answer: 4

ఖంగి

Explanation: 

  • నిజాం పాలనలో ప్రైవేటుగా నడిచే వీధి పాఠశాలలను ఖంగిలు అనేవారు.
  • నిజాం రాజ్యంలో నాడు 162 పాఠశాలలు ఉండేవి. అందులో పర్షియన్ పాఠశాలలు 105, మరాఠీ పాఠశాలలు 34, ఆంగ్ల పాఠశాలలు,కళాశాలలు  4, తెలుగు పాఠశాలలు 19 ఉన్నాయి.

Question: 2

చార్మినార్ గురించిన కింది ప్రకటనల్లో ఏది సరైనది?

ఎ. చార్మినార్ ను 1636లో సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు.

బి. 17వ శతాబ్దంలో ప్రయాణించిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి థెవెనోట్ ప్రకారం, రెండవ ఇస్లామిక్ సహస్రాబ్ది ప్రారంభానికి గుర్తుగా చార్మినార్ నిర్మించబడింది.

  1. కేవలం ఎ
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఏది కాదు
View Answer

Answer: 2

కేవలం బి

Explanation: 

  • కుతుబ్ షాహీ సుల్తానులు గొప్ప వాస్తు కళాభిమానులు. వీరి నిర్మాణాలలో ప్రధానమైనవి హైదరాబాద్ నగరం, చార్మినారు, మక్కా మసీదు, టోలీ మసీదు, పురాణాపూల్ మొదలైనవి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ కుతుబ్ షాహీల కాలంనాటి అద్భుత కట్టడము. దీని నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా . క్రీస్తుశకం 1590 – 1591లో దీని నిర్మాణం జరిగింది. ఆ కాలంలో బాగా ప్రబలి కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించినట్టు ఎక్కువమంది విశ్వసిస్తారు. 17వ శతాబ్దపు ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి థేవెనాట్ ప్రకారం , చార్మినార్ రెండవ ఇస్లామిక్ సహస్రాబ్ది ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడింది.

 

Question: 3

నిజాం పాలనలో నడిచే రైల్వేల పేరు ఏమిటి?

  1. నిజాం మంజూరు చేసిన రాష్ట్ర రైల్వేలు
  2. నిజాం సెంట్రల్ రైల్వేలు
  3. నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేలు
  4. నిజాం స్టేట్ రైల్వే
View Answer

Answer: 3

నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేలు

Explanation: 

  • హైదరాబాదు రాజ్యంలోని సికింద్రాబాద్ (బొల్లారం) ప్రాంతం దక్షిణ భారతదేశంలోని బ్రిటిష్ సైన్యానికి కేంద్రం. అందువలన ఫిబ్రవరి 29, 1864లో బొంబాయి నుంచి మద్రాస్ కి వెళ్లే రైలు మార్గం (గుల్బర్గా, వాడి, రాయచూర్, గుత్తి గుండా మద్రాసుకు పోయే రైలు మార్గాలను),  గుల్బర్గా నుంచి హైదరాబాద్ కు కలపాలని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం, హైదరాబాద్ రాష్ట్ర దివాన్ లేదా ప్రధానమంత్రి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం హైదరాబాదు రాజ్యంలోని వాడి, సికింద్రాబాద్ల మధ్య గల 110 మైళ్ళ దూరాన్ని కలుపుతూ అక్టోబర్ 8న 1874లో రైలు మార్గం ప్రజల సౌకర్యం కోసం తెరిచారు. ప్రారంభంలో రైల్వేలపై పెట్టిన పెట్టుబడికి నష్టం రావడం వల్ల ఏ ఇంగ్లీష్ కంపెనీ పెట్టుబడులు హైదరాబాద్ రాజ్యంలో రైల్వే రవాణా వ్యవస్థ పై పెట్టడానికి ముందుకు రాలేదు. అప్పుడు నిజాం ప్రభుత్వం పెట్టిన పెట్టుబడికి ఐదు శాతం గ్యారెంటీ వడ్డీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందువల్ల దీన్ని నిజాం రాజ్య గ్యారంటీడ్ స్టేట్ రైల్వే వ్యవస్థగా (NGSR) పిలిచారు.

Question: 4

తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన క్రమంలో ఈ క్రింది రాజవంశాలను సరిపోల్చండి.

ఎ. చాళుక్యులు

బి. ఇక్ష్వాకులు

సి. శాతవాహనులు

డి. విష్ణుకుండినాలు

  1. సి, డి ఎ & బి
  2. బి, సి, డి & ఎ
  3. బి, డి, ఎ & సి
  4. సి, బి, డి & ఎ
View Answer

Answer: 4

సి, బి, డి & ఎ

Explanation: 

  • తెలంగాణనే కాకుండా, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులది.
  • దక్షిణ భారతదేశంలో మొదటి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు శాతవాహనులు.
  • క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం మూడో శతాబ్దం మధ్య అంటే దాదాపుగా 250 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు శాతవాహనులు పరిపాలించారు.
  • శాతవాహన సామ్రాజ్యం పతనమైన తరువాత దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతీయ రాజ్యాలు అవతరించాయి. అందునా ముఖ్యంగా తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. వీరి పాలన కాలం క్రీ. శ 220 నుంచి క్రీ. శ. 300.
  • దక్కన్ సంస్కృతిని ప్రభావితం చేసిన ముఖ్యమైన రాజవంశం వాకాటకులది. వీరి పాలనా కాలం క్రీస్తుశకం 250 నుంచి క్రీస్తు శకం 550 వరకు మూడు శతాబ్దాలు దాదాపు. వాకాటకులు ఉత్తరాన గుప్త , నాగ వంశాలతో, తూర్పు దక్కన్ లో విష్ణుకుండినులతో, పశ్చిమ దక్కన్ లో కదంబులతో వైవాహిక సంబంధాల నేర్పరచుకున్నారు.
  • విష్ణుకుండినుల పాలనా కాలం  క్రీ. శ. 358 నుండి క్రీ. శ. 569.
  • వివిధ చాళుక్య శాఖలు  క్రీ. శ. 543 నుండి క్రీ. శ. 1157 వరకు మహారాష్ట్ర ,కర్ణాటక ప్రాంతాలు, వెంగి , పశ్చిమోత్తర తెలంగాణ ప్రాంతాలు, ఖమ్మం పరిసర ప్రాంతాలను పరిపాలించాయి. బాదామి చాళుక్యులు మాతృ మరియు ప్రధాన శాఖ. కల్యాణి చాళుక్యులు అనబడే బాదామి చాళుక్య వంశం తెలంగాణాను పాలించిన చివరి చాళుక్య రాజ వంశం.
  • రాష్ట్రకూటులు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. చాళుక్య వంశీయుల సామంతులుగా పడమర తెలంగాణ ప్రాంతాలను పరిపాలించారు తరువాత స్వతంత్ర రాజ్య స్థాపన దంతి దుర్గుడు చేశాడు. క్రీ .శ 753 లో స్వతంత్ర రాష్ట్ర రాజ్య స్థాపన జరిగింది. వీరి పాలన కాలం క్రీ . శ 753 నుండి క్రీ. శ 966 వరకు సాగింది.
  • కాకతీయ పాలన కాలం క్రీ.శ 900 నుండి క్రీ.శ 1299 .

Question: 5

ఈ క్రింది వారిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు రాజ్యాంగ సలహాదారు ఎవరు?

  1. అంతా నవాజ్ జంగ్
  2. మెహదీ నవాజ్ జంగ్
  3. సర్ వాల్టర్ మోంక్టన్
  4. మీర్జా ఇస్మాయిల్
View Answer

Answer: 3

సర్ వాల్టర్ మోంక్టన్

Explanation: 

  • మీరు ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నైజాం పాలకుడు. ఇతడు ఏడవ నిజాం. ఇతని పరిపాలనా కాలం 1911లో మొదలై 1948 తెలంగాణ విమోచన వరకు సాగింది.
  • తనకున్న రాజకుటుంబ సంబంధాల వల్ల సర్ వాల్టర్ మోంక్టన్ 7వ నిజాం రాజ్యాంగ సలహాదారుడిగా నియమింపబడ్డాడు. సర్ వాల్టర్ మోంక్టన్ బ్రిటిష్ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు.
Recent Articles