Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-1

Telangana Movement-1 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

హైదరాబాద్ ను కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చేసేందుకు విజన్ డాక్యుమెంట్ ను రూపొందించే బాధ్యతను ఎవరికి అప్పగించారు?

  1. హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (HUDA)
  2. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)
  3. GMR కన్సల్టెన్సీ
  4. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)
View Answer

Answer: 4

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA)

Explanation:

  1. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసింది.
  2. 2015-16 బడ్జెట్‌ లో భాగంగా  ప్రణాళికా శాఖ విడుదల చేసిన “రీఇన్వెంటింగ్ తెలంగాణ-ద ఫస్ట్ స్టెప్స్” పేరుతో సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్-2015లో ఈ  విజన్ డాక్యుమెంట్ ని ప్రస్తావించారు.
  3. ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించే బాధ్యత ను HMDA  కు అప్పగించారు.
  4. ఈ  డాక్యుమెంట్ గ్లోబల్ సిటీ ప్లాన్ మాత్రమే  కాకుండా,  భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని కలిగి ఉంటుంది. రాష్ట్ర రాజధానిని ప్రపంచ నగరంగా మార్చే ప్రయత్నంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (HMR) యొక్క మొత్తం ఐదు నోటిఫైడ్ మాస్టర్ ప్లాన్‌లు మరియు జోనింగ్ నిబంధనలను ఏకీకృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  5. ప్రాదేశిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఐదు జోనల్ మాస్టర్ ప్లాన్‌లను కలిపి  ఒకే  మాస్టర్ ప్లాన్‌గా రూపొందించాలని  ప్రతిపాదించబడింది.

Question: 2

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. అప్పులు చేయడం మరియు కులంతో సంబంధం లేకుండా బలవంతంగా పని చేయడం వెట్టి
బి. నిర్బంధ కార్మికులు మరియు గ్రామ సేవకుల కులాల అణచివేత అనేది బంధిత కార్మికులు.

  1. ఎ మరియు బి సరైనవి.

  2. ఎ సరైనది మరియు బి సరైనది కాదు.

  3. ఎ సరైనది కాదు మరియు బి సరైనది.

  4. ఎ మరియు బి సరైనది కాదు.

View Answer

Answer: 4

ఎ మరియు బి సరైనది కాదు.

Explanation:

  • వెట్టి : ఎటువంటి జీతం లేకుండా దొరల , భూస్వాముల ఇళ్ళల్లో ఉచితంగా పని చేయడాన్ని వెట్టి అంటారు.
  • ఈ వెట్టి వ్యవస్థలో ముఖ్యంగా దళిత వర్గాల కుటుంబాలు ఎక్కువగా  వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది.
  • భారత దేశంలో ప్రాచీన కాలం నుండీ ఉనికిలో ఉన్న సామాజిక వ్యవస్థగా  ‘వెట్టి’ ని చెప్పుకోవచ్చు.
  • ఉత్తర భారతదేశంలో దీనినే ‘జాజ్ మనీ’ వ్యవస్థ అని పిలుస్తారు.
  • వెట్టి వ్యవస్థ ని హైదరాబాద్ రాజ్యంలో తొలిసారి తన పుట్టినరోజు సందర్భంగా 7 వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1923 మార్చి 20 వ తేదీన నిషేదిస్తున్నట్టు ఫార్మాన్ జారీ చేశాడు. కానీ ఇది అమలు కాలేదు.
  • తర్వాత సాయుధ పోరాటం(1946-51), నక్సలైట్ల ఉద్యమాల కారణంగా నిలిపివేయబడింది .
  • బంధిత కార్మికులు: ఎక్కువ వడ్డీతో భూస్వాముల దగ్గర, సంవపన్న వర్గాల దగ్గర  అప్పులు తీసుకొని  వాటిని తీర్చలేక వారికి ఋణపడి ఉన్నందున వారికి చేసే వెట్టి చాకిరీ వ్యవస్థనే బంధిత కార్మికులు అంటారు.
  • నోట్: బంధిత కార్మిక వ్యవస్థ ను నిషేదిస్తూ భారత ప్రభుత్వం, బంధిత కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం-1976 ను అమలు చేసింది.
  • రాజ్యాంగం లో ని 23 వ ఆర్టికల్ బలవంతపు పనిని నిషేదిస్తుంది.

Question: 3

జాబితా -ఎ లోని అంశాలను జాబితా -బి లోని అంశాలతో సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్ లను నుండి సరైన ఎంపికను ఎంచుకోండి:
జాబితా ఎ
ఎ. దుర్గాబాయ్ దేశముఖ్
బి.ఎం.వి. భాగ్యరెడ్డి వర్మ
సి. కొండా వెంకట్ రంగారెడ్డి
డి. వై.ఎం. కాలే

జాబితా – బి

1. హైదరాబాద్ పొలిటికల్ కాన్ఫరెన్స్

2. ఆంధ్ర మహిళా సభ

3. ఆది -హిందువులు రంగారెడ్డి

4. ఆంధ్ర మహాసభ

  1. A- ili, B – i, C- ii, D – iv
  2. A-iv, B-ii, C-i, D-iii
  3. A – ii, B – iii, C- iv, D- i
  4. A- i, B – ili, C – ii, D – iv
View Answer

Answer: 3

A – ii, B – iii, C- iv, D- i

Question: 4

హైదరాబాద్ సంస్థానంలో ఈ క్రింది ప్రసిద్ధ సంస్థలను అవి స్థాపించిన సంవత్సర క్రమంలో అమర్చండి:

ఎ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
బి. ఆర్యసమాజ్
సి. ఆంధ్ర జనసంఘం
డి. ఆంధ్ర మహాసభ
ఈ క్రింది వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి:

  1. సి, బి, ఎ, డి
  2. ఎ, సి, బి, డి
  3. సి, ఎ, బి, డి
  4. బి, సి, డి, ఎ
View Answer

Answer: 4

బి, సి, డి, ఎ

Explanation:

ఆర్యసమాజ్:

  1. భారతదేశం లో 1875 లో ఆర్యసమాజ్ ను దయానంద సరస్వతి బొంబాయి లో స్థాపించారు (తరవాత దీని ప్రధాన స్థావరం బాంబే నుండి లాహోర్ కు మార్చబడినది). దయానంద సరస్వతి: గో బ్యాక్ టూ వేదాస్.
  2. నిజాం సంస్థానం లో : తొలి శాఖ థరూర్(బీడ్ జిల్లా) 1890. హైదరాబాద్ :1892 – స్వామి నిత్యానంద, గిరిజానంద సరస్వతి. తొలి అధ్యక్షుడు: కమలా పరవద్ జీ, జనరల్ సెక్రటరీ: లక్ష్మణదాస్ జీ.

ఆంధ్ర జన సంఘం:

  • ఆ 12 నవంబర్ 1921. తొలి అధ్యక్షుడు: బారిస్టర్ రాజగోపాలరెడ్డి, జనరల్  సెక్రటరీ: మాడపాటి హనుమంతరావు.
    సమావేశాలు:
    1. 1923: హనుమకొండ – రాజబహదూర్ సామాల వెంకటరెడ్డి.
    2. 1924: నల్గొండ- రాజబహదూర్ సామాల వెంకటరెడ్డి.
    3. 1925: మధిర- రాజబహదూర్ సామాల వెంకటరెడ్డి.
    4. 1928: సూర్యాపేట- kv  రంగారెడ్డి.
    (1929 లో నిజాం ప్రభుత్వం సభలు సమావేశాలను రద్దు చేస్తూ గస్తీ నిషన్ తిర్పన్(g.o-53) ని జారీ చేసింది.
  • ఆంధ్ర మహాసభ: 1921 లో స్థాపించిన ఆంధ్ర జన  సంఘమే ఆంధ్ర జానా కేంద్ర సంఘంగా(1923), ఆంధ్ర మహాసభ(1930)గా పేరు మార్చుకుంది.
  • 1930లో నే దీనికి అనుబంధంగా దుర్గాబాయి దేశముఖ్ ఆద్వర్యం లో ఆంధ్ర మహిళా సభ ఏర్పడింది.
    మొత్తం సమావేశాలు: 14
  • తొలి సమావేశం: 1930, జోగిపేట- సురవరం ప్రతాప రెడ్డి, నడింపల్లి సుందరమ్మ.
  • హైదరాబాద్ స్టేట్  కాంగ్రెస్: 1938, జులై 29– స్వామి రామానంద తీర్థ( వెంకటేశ్ భగవాన్ రావు  ఖేడ్గేకార్).

Question: 5

22-08-1948న హైదరాబాదు నగరంలోని కాచిగూడలో హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని కోరుతూ జరిగిన ప్రజా ఉద్యమానికి తన రచనల ద్వారా మద్దతు ఇచ్చినందుకు రజాకార్ల చేతిలో కిరాతకంగా హత్యకు గురైన పాత్రికేయుడు_____?

  1. షేక్ అలీ
  2. సయ్యద్ అహ్మద్
  3. షూబుల్లా ఖాన్
  4. మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్
View Answer

Answer: 3

షోయబుల్లా ఖాన్

Explanation: 

  • స్థాపించిన పత్రిక: ఇమ్రోజ్ -(నిప్పు కనిక)- ఉర్దూ వారపత్రిక.
  • ఈ పత్రిక లో రాజాకార్ల తీరును వారు చేసే అన్యాయాలను వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసినందుకు 22 ఆగస్టు 1948 న కిరాతకంగా రజాకార్లు హత్య చేశారు.
  • షోయబుల్లాఖాన్  హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలీ అని కూడా వ్యాసాలు రాశాడు.
Recent Articles