Home  »  TGPSC 2022-23  »  Telangana History-4

Telangana History-4 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది అసఫ్ జాహి పాలకులలో మొదటిసారిగా ‘నిజాం’ అనే బిరుదును ఎవరు ఉపయోగించారు?

  1. నిజాం అలీ ఖాన్
  2. ముజఫర్ జంగ్
  3. సికందర్ ఝా
  4. నిజాం-ఉల్-ముల్క్
View Answer

Answer: 4

నిజాం-ఉల్-ముల్క్

Explanation: 

  • నిజాం అని పిలువబడ్డ మొట్టమొదటి ఆసఫ్ జాహి పాలకుడు ఆసఫ్ జా – 1.
  • ఆసఫ్ జా – 1  అసలు పేరు కమురుద్దీన్ ఖాన్. ఇతడే నిజాం ఉల్ ముల్క్. ఔరంగజేబు ఇతనికి మీర్ కమర్ ఉద్ దీన్ ఖాన్ సిద్ధిఖీ  అని నామకరణం చేశాడు. నిజాం ఉల్ ముల్క్ తండ్రి ఘాజీ ఉద్ దీన్ ఫిరోజ్ జంగ్.
  • 1693లో పన్హాలను ఆక్రమించిన మరాఠాలను శిక్షించడానికి ఫిరోజ్జంగ్ తన కుమారుడు నిజాం ఉల్ ముల్క్ ను పంపించాడు. దాడికి ముందే వారంతా పారిపోయారు.
  • ఫలితంగా నిజాం ఉల్ ముల్క్ కి 1693లో ఔరంగజేబు చిన్ ఖిలిచ్ ఖాన్ అంటే కుర్రకత్తివీరుడు అనే బిరుదు ఇచ్చాడు.

Question: 2

ఈ క్రింది వాటిని సరిపోల్చండి
ఎ. పొన్నెగంటి
బి. అద్దంకి గంగాధర
సి. కంచెర్ల గోపన్న
డి. సింగనాచార్యుడు
1. తపతి సంవరణోపాఖ్యానం
2. యయాతి చరిత్ర
3. దశరథ రాజనందన చరిత్ర
4. దాశరథి శతకం
5. వైజయంతీ విలాసం
సరైన జవాబు ని ఎంచుకోండి.

  1. A-2; B-1; C-4; D-3
  2. A-3; B-2; C-5; D-1
  3. A-4; B-5; C-3; D-2
  4. A-1; B-2; C-4; D-3
View Answer

Answer: 4

A-1; B-2; C-4; D-3

Explanation: 

  • అద్దంకి గంగాధర కవి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా పోషణ అందుకున్నారు. ఈ కవి తన రచన తపతీ సంవరణోపాఖ్యానాన్ని సుల్తాన్కు అంకితమిచ్చాడు.
  • ఇబ్రహీం కులీ కుతుబ్ షా వల్ల అతని అధికారులు కూడా ప్రభావితులయ్యారు. పఠాన్ చెరువు ప్రాంతానికి అధికారిగా ఉన్న అమీన్ ఖాన్ పొన్నగంటి తెలగనార్యున్ని ఆదరించాడు. పొన్నగంటి తన గ్రంథం యయాతి చరిత్రను అమీన్ ఖాన్ కు అంకితం ఇచ్చాడు.
  • అచ్చ తెలుగులో రాసిన మొట్టమొదటి తెలుగు గ్రంథం యయాతి చరిత్ర. ఇబ్రహీం కులీ కుతుబ్ షా వారసుడైన మహమ్మద్ కాలంలో తెలుగు భాష మరింత వికాసం పొందింది .
  • సారంగతమ్మయ్య మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానానికి చెందిన తెలుగు కవి. ఇతని రచన వైజయంతీ విలాసం.
  • అదేవిధంగా ఆ తరువాత అబుల్ హసన్ తానీషా కాలంలో జటప్రోలు, గద్వాల సంస్థానాధిపతులు తెలుగు కవులను, పండితులను ఆదరించారు.
  • సుల్తాన్ రెవెన్యూ అధికారిగా (తహసిల్దారుగా) ఖమ్మం ప్రాంతానికి విధులు నిర్వహించిన కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు.
  • భక్త రామాదాసుగా కీర్తి పొందాడు. ఆయన రచన దాశరథి శతకం తెలుగు సాహిత్యంలో శాశ్వత కీర్తిని పొందింది.దశరథ రాజనందన చరిత్ర  మరింగంటి సింగరాచార్యుని విరచితము.

Question: 3

ఈక్రింది వాటిలో సరికానిదిగా ఏది సరిపోలింది?
ఎ. హనుమకొండ 1000 స్తంభాల శాసనం రుద్రమదేవి.
బి. బయ్యారం ట్యాంక్ శాసనం : మైలాంబ
సి. మోటుపల్లి శాసనం : గణపతిదేవ
డి. చందుపట్ల శాసనం : అంబదేవ

సరైన జవాబుని ఎంచుకోండి.

  1. బి మరియు డి మాత్రమే
  2. ఎ మరియు డి మాత్రమే
  3. సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 3

బి మరియు సి మాత్రమే

Explanation: 

  • హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనము కాకతీయ రాజు రుద్రదేవుడు వేయించినది. ఇది క్రీ.శ. 1063 కాలానికి చెందినది. రుద్ర దేవుడు 1063 లో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నట్లు శాసనం తెలియజేస్తుంది.
  • బయ్యారం శాసనం (ఖమ్మం) గణపతి దేవుని సోదరి కాకతి మైలాంబ వేయించింది.
  • మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు. ఆ కాలంలో విదేశీ వర్తకులకు అభయం ఇచ్చే వివరాలు ఈ శాసనంలో ఉన్నాయి.
  • అందుకే దీనిని అభయ శాసనం అంటారు.
  • చందుపట్ల శాసనాన్ని వేయించింది రుద్రమదేవి బంటు పువ్వులముమ్మడి. ఇది క్రీ. శ. 1289 లోనిది.

Question: 4

వేరి పాలనా కాలంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

  1. వశిష్టపుత్ర శ్రీశాంతమాల
  2. వశిష్టపుత్ర పులుమావి
  3. రుద్రపురుషదత్త
  4. వీరపుర్షదత్త
View Answer

Answer: 1

వశిష్టపుత్ర శ్రీశాంతమాల

Explanation: 

  • వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుని కాలంలోనే శ్రీ పర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఇతడు స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు.
  • నాలుగో పులుమావినీ తొలగించి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు వైదిక మతావలంబికుడు.

Question: 5

సాలార్ జంగ్-1 యొక్క సంస్కరణలకు సంబంధించి కింది ప్రకటనలలో సరికానివి ఏవి?
ఎ. అతను రెవెన్యూ సేకరణ వేలం వేయడాన్ని రద్దు చేశాడు, అయితే భూ ఆదాయాన్ని సేకరించేందుకు మధ్యవర్తులను కొనసాగించాడు.
బి. అతను 1857లో హాలీ సిక్కా కరెన్సీని ప్రవేశపెట్టాడు.
సి. ఆయన నవాబ్ బషీరుద్దాలాను రెవెన్యూ మంత్రిగా నియమించారు.
డి. ఆయన హైదరాబాద్ నగరంలో వేర్వేరు సివిల్ మరియు క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేశారు.
సరైన జవాబుని ఎంచుకోండి

  1. బి మరియు డి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 1

బి మరియు డి మాత్రమే

Explanation: 

  • అఫ్జల్ ఉద్దౌలా కాలంలో సాలార్జంగ్ 1 , హాలీ సిక్కా లను ప్రవేశపెట్టారు. అంతవరకూ మొఘల్ నాణేలు వాడేవారు.
  • 1858లో హాలీ సిక్కాల వాడకం మొదలైంది. హాలీ సిక్కా ఒక వెండి నాణెం. ఈ నాణానికి ఒకవైపు చార్మినార్ బొమ్మ ఉండి బొమ్మ చుట్టూ పర్షియన్ భాషలో నిజాంఉల్ముల్క్ బహదూర్ అసఫ్ జాహీ‘ అని రాసి ఉంటుంది.
  • ఇక రెండో వైపు నాణెం విలువ ఉంటుంది.  బ్రిటిష్ నాణేల కన్న 15% విలువ తక్కువ కలవి హాలీ సిక్కాలు. 1955లో ఇవి పూర్తిగా రద్దు చేయబడ్డాయి.
  • సాలార్జంగ్ – 1 రెవెన్యూ శాఖ మంత్రిగా నవాబ్ ముఖరం ఉద్ధౌల బహదూర్ ను నియమించారు. బషీరుద్ధౌల బహదూర్ న్యాయ, జైళ్ళ శాఖామంత్రిగా పనిచేశారు.
  • సాలార్జంగ్ 1872లో న్యాయపరమైన కీలక మార్పులు చేశారు. కోర్ట్ ఆఫ్ అప్పిల్ ను  మహాక్మా – ఎ – మురఫ – ఎ – అజ్లా అనే పేరుతో స్థాపించాడు.
  • దీనిలో అన్ని రకాల సివిల్ , క్రిమినల్ విన్నపాలను, నగరాల నుంచి జిల్లాలనుంచి వచ్చే విజ్ఞప్తులను విచారించేవారు.
Recent Articles