Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-5

Telangana Movement-5 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ ఉద్యమంలో ఏ తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలు ప్రదర్శించబడ్డాయి?

  1. తోలు బొమ్మలు

  2. వైతాళికుల చిత్రాలు

  3. పురాణ కథలు మరియు ఇతిహాసాలు

  4. పీరీలు, బతుకమ్మ, బోనాలు

View Answer

Answer: 4

పీరీలు, బతుకమ్మ, బోనాలు

Explanation:

  • తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో భాగంగా కళాకారులు, కవులు, రచయితలు, మేధావులు కలిసి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ కార్యక్రమాలు నిర్వహించారు.
  • వీటిలో భాగంగా- ధూం-ధాం పేరుతో కళా ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ ఉద్యమాన్ని పల్లెల్లో విస్తరించారు. తొలి ధూం-ధాం 2002 సెప్టెంబర్ 30 న కామారెడ్డి లో ప్రదర్శించబడింది.
  • తెలంగాణ జాగృతి- బతుకమ్మ కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత 2008 లో ప్రారంభించారు.
  • తెలంగాణ ను పాలించిన షియా రాజులు కూతుబ్షాహిళ ద్వారా పరిచయమైన పీరీల పండగను తెలంగాణ లోని హిందువు-ముస్లిములు కలిసి శోధర భావంతో జరుపుకుంటారు.
  • ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవానికి నాంది పలికారు మేధావులు.

Question: 2

1989 తెలంగాణ తల్లిని రూపొందించిన శిల్పి ఎవరు?

  1. పిట్ రెడ్డి

  2. బివిఆర్ చారి

  3. రవీందర్ రెడ్డి

  4. గణపతి స్తపతి

View Answer

Answer: 2

బివిఆర్ చారి

Explanation:

  • తెలంగాణ తల్లి విగ్రహాన్ని B.S రాములు సూచనలతో బైరోజు వెంకటరమణా చారి రూపొందించాడు.
  • ఇతడు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నగరానికి చెందినవాడు.
  • కేసీఆర్ తన పార్టీ కార్యాలయంలో 2007 నవంబర్ 15న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు:

  • తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజలకు ప్రతీక మాతృదేవత.
  • ఎడమచేతిలో బతుకమ్మ మరియు కుడిచేతిలో మొక్కజొన్నతో విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది.
  • తలపై కిరీటంలో కోహినూర్ వజ్రం అమర్చారు.
  • తెలంగాణ తల్లి విగ్రహం మెడలో బంగారు హారం ఉంటుంది.
  • విగ్రహం గద్వాల్ మరియు పోచంపల్లి పట్టు చీరతో అలంకరించబడింది.
  • ఈ విగ్రహం బంగారు వడ్డాణం దానిలో జాకబ్ వజ్రం మరియు కాలి ఉంగరాలతో ప్రదర్శించబడింది.
  • కాలి ఉంగరాలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వెండిని సూచిస్తాయి.

Question: 3

పల్లె పల్లె పల్లెకు మొలిచె తెలంగాణలోనా, మన పంట చేల లోనా\” అనే పాటను ఏ కవి రచించాడు?

  1. మిత్ర

  2. గద్దర్

  3. అందెశ్రీ

  4. ఏది కాదు

View Answer

Answer: 1

Explanation: 

పల్లె పల్లె పల్లెకు మొలిచె తెలంగాణలోనా, మన పంట చేల లోనా\” అనే పాటను రాసిన వారు మిత్ర.

Explanation:

  •  ఈ పాటను CPI(ML) జనశక్తి నాయకుడైన  కూర దేవేందర్ అలియాస్ అమర్ రచించాడు.
  • ఆయన కలం పేరు ‘మిత్ర’.

రచించిన పాటలు:

  • పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే..
  • అలై బాలయి తీసుకో ఆగకుండా సాగిపో..
  • పాడరా పాడరా మన పాట..
  • ఛలో ధూమ్ ధాం తెలంగాణ జాతరొచ్చేరా..
  • తగబోతే నీళ్ళు లేకా- తుమ్మెదాలో 

Question: 4

మొదటి ధూమ్ ధామ్ ఎక్కడ జరిగింది?

  1. గోదావరి ఖని

  2. కరీంనగర్

  3. కామారెడ్డి

  4. హైదరాబాద్

View Answer

Answer: 3

Explanation:

  • మొదటి ధూమ్ ధామ్ కామారెడ్డి లో జరిగింది
  • తెలంగాణ లో తొలి ధూం-ధాం ప్రదర్శన కామారెడ్డిలో సెప్టెంబర్ 30, 2002 నాడు ప్రారంభం అయింది.
  • ప్రారంభించినవారు: రసమయి బాలకిషన్, అంతడుపుల నాగాజు, కే సి ఆర్ తదితరులు.
  • ఈ సభకు దాదాపు 50 వేల మంది హాజరయ్యారు.
  • రెండవ ప్రదర్శన హైదరాబాద్ లో ని పబ్లిక్ గార్డెన్ లో ని ‘తెలుగు లలిత కళాతోరణం’ ఆడిటోరియం లో జరిగినది.
  • దీనిలో గద్దర్ తో సహా తెలంగాణ గాయకులు కళాకారులు అందరూ పాల్గొన్నారు.

Question: 5

తెలంగాణ సాధించడానికి ప్రొఫెసర్ కె. జయశంకర్ సూచించిన మూడు ప్రాథమిక ప్రాంతాలు ఏమిటి?

  1. రాస్తారోకో, ఆర్థిక ప్రయోజనాల దిగ్బంధనం, పార్లమెంటులో బిల్లు

  2. తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామా, రాజ్యాంగ సంక్షోభం, జాతీయ పార్టీల ఆమోదం

  3. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మే, సాగరహారం

  4. స్పృహ, ఉద్యమం మరియు రాజకీయ ప్రక్రియ

View Answer

Answer: 4

స్పృహ, ఉద్యమం మరియు రాజకీయ ప్రక్రియ

Explanation:

  • తెలంగాణ సిద్దాంతకర్త- ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు వరంగల్ జిల్లా అక్కం పేట గ్రామంలో 6 ఆగస్టు 1934 లో జన్మించారు.
  • 1952 ముల్కీ ఉద్యమంలో విద్యార్థి దశలో నే పాల్గొన్నారు.
  • బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి M.A. economics, ఉస్మానియా యూనివర్సిటీ నుండి P.hd పూర్తిచేశారు.
  • తెలంగాణ ఉద్యమం మూడు దశల్లో జరగాలన్నారు. మొదటిది, తెలంగాణ భావజాల వ్యాప్తి, రెండవది, వివిధ రూపాల్లో ఉద్యమాలు, ఆందోళనలు, మూడవది రాజకీయ ప్రక్రియ.
  • రచనలు:
  • తెలంగాణ రాష్ట్రం- ఒక డిమాండ్
  • తల్లడిల్లుతున్న తెలంగాణ
  • తెలంగాణ రాష్ట్రం పై విస్తృత అంగీకారం-నిజాలు
  • వొడువని ముచ్చట- జయశంకర్ జీవిత చరిత్ర- కొంపల్లి వెంకటగౌడ్
  • – CIEFL- ప్రస్తుత EFLU లో రిజిస్ట్రార్
  • – కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (1991-94)
  • సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ అభివృద్ది సంఘం.
Recent Articles