Home  »  TGPSC 2022-23  »  Telangana History-1

Telangana History-1 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

వరంగల్ కోట మరియు దాని అంతర్గత నిర్మాణాల గురించి ఈక్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. షితాబ్ ఖాన్ వరంగల్ కోటలో కుష్ మహల్ని నిర్మించాడు, ఇది మండూ వద్ద హిందోళ మహల్’కి ప్రతిరూపం.
బి. ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర మరియు క్రీడాభిరామం వరంగల్ కోటపై ఆసక్తికరమైన వివరణలు ఉన్నాయి.
సి. ప్రతాప చరిత్ర ప్రకారం, వరంగల్ కోటలో 88 బురుజులు లేదా కొట్టాలములు ఉన్నాయి.
డి. శివయోగ సారము ప్రకారం వరంగల్ కోట పునాది గణపతిదేవునిచే వేయబడింది.

పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ మరియు బి మాత్రమే

Explanation: 

  • వరంగల్ కోట లేదా ఓరుగల్లు కోట కాకతీయులు  నిర్మించినటువంటి 13వ శతాబ్దము నాటి చారిత్రక కట్టడం.
  • ఈ ఓరుగల్లు కోటకు పునాది వేసింది మరియు పాక్షిక నిర్మాణం ప్రారంభం చేసింది రుద్రదేవుడు. ఆ తరువాత రెండోసారి నిర్మాణం ప్రారంభించి దాదాపుగా మొత్తం నిర్మాణం పూర్తి చేసింది గణపతి దేవుడు. ఆ తరువాత రుద్రమదేవి కోటకు మెట్లను నిర్మించి పూర్తిగా కోట నిర్మాణాన్ని చేసింది కావున కోట నిర్మాణం పూర్తి చేసింది రుద్రమదేవి .
  • షితాబ్ ఖాన్ అసలు పేరు సీతాపతి . ఈయన బోయ కులానికి చెందినవాడు. బహమనీ రాజు హుమయున్ సీతాపతిని షితాబ్ ఖాన్ గా మార్చాడు. సితాబ్ ఖాన్ రాచకొండలో బహమనీ ప్రతినిధిగా పనిచేశారు. 1512లో ఓడిషా గజపతుల ఆస్థానంలో రాజప్రతినిధిగా పనిచేశాడు. ఒడిశా గజపతులు షితబ్ ఖాన్ ను వరంగల్లో తమ  ప్రతినిధిగా నియమించారు. ఆ సమయంలో షితాబ్ ఖాన్ వరంగల్ కోటలో కుష్ మహల్ ను  నిర్మించాడు. కుశ్ మహల్ T  ఆకారంలో ఉంటుంది.
  • సింహాచలం వద్ద జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు సైన్యం షితాబ్ ఖాన్ ను  హతమార్చింది.
  • ప్రతాప చరిత్రను రచించినది ఏకామ్రనాధుడు. ప్రతాప చరిత్రలో కాకతీయుల చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి.
  • సిద్దేశ్వర చరిత్ర రచయిత కాసె సర్వప్ప. కాకతీయుల చరిత్రపై కొంత సమాచారాన్ని ఇస్తుంది ఈ సిద్దేశ్వర చరిత్ర.
  • క్రీడాభిరామం రచయిత వినుకొండ వల్లభరాయుడు. ఓరుగల్లు కోట లోపల నివసిస్తున్న అష్టాదశ ప్రజల జీవన పరిస్థితిని వివరిస్తుంది ఈ క్రీడాభిరామం.
  • శివయోగసారం రచయిత కొలను గణపతి దేవుడు. గణపతి దేవుని కొలవులో ఉన్న ఇందులూరి నాయకుల చరిత్ర ఈ శివయోగసారంలో ఉంది.

Question: 2

కాకతీయుల కాలం నాటి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. కాకతీయుల కాలంలో సాధారణంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పద్ధతి ‘అష్టాదశప్రజా’గా పేర్కొనడం.
బి. ఈ కాలంలోని ప్రజలు కార్పొరేట్ జీవితాన్ని నడిపించారు.

సి. కాకతీయుల కాలంలో వ్యక్తిగత కులాలు వారి శ్రేయస్సును చూసుకోవడానికి ‘సమయాచార’ అనే వారి కార్పొరేట్ సంఘాలను నిర్వహించాయి.
డి. బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా ‘అసంఖ్యాతులు’ అనే సంఘంగా ఏర్పడ్డాయి.
పై వాక్యాలలో సరికానిది ఏది ?

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. సి మరియు డి
  4. ఎ మరియు డి
View Answer

Answer: 3

సి మరియు డి

Explanation: 

  • కాకతీయుల కాలంలో కుల సంఘాలను సమయములు అని అన్నారు. ఈ సమయముల అధిపతులను( Head ) సమయాధిపతి లేదా శ్రేష్టి లేదా సమయాచర అనేవారు.
  • బ్రాహ్మణ సంఘాలను మహాజనులు లేదా అసంఖ్యాతులు  అని,  వైశ్య సంఘాలను నకరములు అని అనేవారు.
  • ప్రధానంగా 5 కులసంఘాలు ఉండేవి వాటిని వీరపంచాలులు/ పంచాణం అంటారు.

Question: 3

19 వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాదులో జొరాస్ట్రియన్ ఇరానీ వలసదారులు ఏమి ప్రవేశపెట్టారు?

  1. బిర్యానీ
  2. హలీమ్
  3. ఖుబానీ కా మీఠా
  4. చాయి
View Answer

Answer: 4

చాయి

Explanation: 

  • ఇరాన్ లో సఫావిడ్ రాజ్య స్థాపన మరియు పాలన తదనంతర పరిస్థితులలో అణచివేతకు గురి అయిన జొరాస్ట్రియన్లు భారతదేశానికి వచ్చారు. ఈ జొరాస్ట్రియన్ ఇరానీ వలసదారులు 19వ శతాబ్దంలో చాయ్ కేఫ్ లను ఏర్పాటు చేశారు. ఆ రకంగా ఇరానీ చాయ్ ను ఇక్కడ పరిచయం చేశారు.

Question: 4

కుతుబ్ షాహీ కాలంలో హిందూ, ముస్లిం ఉన్నత వర్గాలు కులాహ్, ఖాబాలతో కూడిన దుస్తులను ధరించేవారు. ఈ రెండు పదాల అర్థం ఏమిటి?

  1. టోపీ మరియు పొడవాటి కోటు
  2. ప్యాంటు మరియు బెల్ట్
  3. చొక్కా మరియు ధోతీ
  4. హెడ్-బ్యాండ్ మరియు టై
View Answer

Answer: 1

టోపీ మరియు పొడవాటి కోటు

Explanation: 

  • కులాహ్ అంటే టోపీ.
  • ఖాబా అంటే పొడవాటి కోటు.

Question: 5

కాకతీయుల కాలంలో ముగ్గురు ఆచార్యులు ‘పండిత త్రయ’ గా ప్రసిద్ధి చెందారు. ఈ క్రింది వారిని గుర్తించండి..

  1. మల్లికార్జున పండిత, పాల్కురికి సోమనాథ మరియు విశ్వేశ్వర పండిత
  2. శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత మరియు మంచన పండిత
  3. విశ్వేశ్వర పండిత, మల్లికార్జున పండిత మరియు మంచన పండిత
  4. శ్రీపతి పండిత, పాల్కురికి సోమనాథ మరియు మంచన పండిత
View Answer

Answer: 2

శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత మరియు మంచన పండిత

Explanation: 

  • ఆరాధ్యశైవంలో 12 మంది గురువులు ఉండేవారు.
  • వారిని నాలుగు త్రయములుగా విభజించారు.
  1. పండిత త్రయం
  2. ఆచార్య త్రయం
  3. సిద్ధ త్రయం
  4. ఆరాధ్య త్రయం
  • పండిత త్రయం : శ్రీపతి పండిత , మల్లిఖార్జున పండిత మరియు మంచన పండిత.
  • ఆచార్య త్రయం : కంఠాచార్య , పరిదత్తాచార్య మరియు భాస్కరాచార్య.
  • సిద్ధ త్రయం : రేవణ , మరళ మరియు ఏకారామ.
  • ఆరాధ్య త్రయం : ఉద్భటచార్య, వేమనరాధ్యా, విశ్వరాధ్యా.
Recent Articles