Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-2

Telangana Movement-2 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1952లో బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం ఏది?

  1. నాగర్ కర్నూల్
  2. మహబూబ్ నగర్
  3. వనపర్తి
  4. షాద్ నగర్
View Answer

Answer: 4

షాద్ నగర్

Explanation:

  1. 1952 మార్చ్ 6 న బూర్గుల రామకృష్ణ రావు షాద్ నగర్ శాసన సభ నియోజకవర్గం నుండి గెలిచి ముఖ్య మంత్రిగా హైదరాబాద్ లో గల జూబ్లీ హాల్ లో ప్రమాణ స్వీకారం చేసినారు.
  2. ఆయన నిర్వహించిన శాఖలు: ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ల్యాండ్ రెవెన్యూ.
  3. బూర్గుల రామకృష్ణారావు: ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా, పడకళ్ళు గ్రామం.
  4. ప్రముఖ రచనలు: సారస్వతవ్యాస ముక్తావళి, కృష్ణ శతకం, పండితరాజ పంచామృతం, పుష్పాంజలి.
  5. ఆయన యంగ్ మెన్ యూనియన్ అనే సంస్థ ను స్థాపించారు.
  6. కేరళ కు తొలి గవర్నర్ గా (1962-66),  ఉత్తర్ ప్రదేశ్ గోవర్నర్ గా (1960-62), రాజ్యసభ సభ్యులు గా (1962-66) పని చేశారు.

Question: 2

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2013లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో ఈ క్రింది సభ్యుడు కానివారు ఎవరు?

  1. ఎకె ఆంటోనీ
  2. గులాం నబీ ఆజాద్
  3. శరద్ పవార్
  4. జై రామ్ రమేష్
View Answer

Answer: 3

శరద్ పవార్

Explanation:

  • కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం 2013 october 8 న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GOM) గా పిలవబడే విభజన కమిటీ నీ ఏర్పాటు చేసింది.
  • దీనిలో చైర్మన్: AK ఆంటోనీ (రక్షణ మంత్రి)
  • సభ్యులు: సుశీల్ కుమార్ షిండే( కేంద్ర హోం మినిస్టర్), P. చిదంబరం ( కేంద్ర ఆర్థిక మంత్రి) ,వీరప్ప మొయిలీ ( కేంద్ర పెట్రోల్ శాఖ మంత్రి), జైరాం రమేష్ (కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి), గులాం నబీ ఆజాద్ (కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి)
  • ప్రత్యేక ఆహ్వానితుడు : V నారాయణ స్వామి ( సిబ్బంది వ్యవహారాలు,ప్రధాన మంత్రి కార్యాలయ మంత్రి)

Question: 3

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్ ను ఏ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది?

  1. అంతర్జాతీయ ద్రవ్య నిధి
  2. ప్రపంచ బ్యాంకు
  3. మెక్ కిన్సే
  4. ఆసియా అభివృద్ధి బ్యాంకు
View Answer

Answer: 3

మెక్ కిన్సే

Explanation:

  1. రాష్ట్ర ముఖ్యమంత్రిగా  ఉన్న చంద్రబాబునాయుడు ప్రైవేటీకరణ లో భాగంగా అమెరికాకి చెందిన మెక్ కిన్సే అనే సంస్థ ద్వారా 337 పేజీలతో కూడిన విజన్-2020 అనే డాక్యుమెంట్ ను 1998 లో  రూపొందించారు .
  2. పేదరిక నిర్మూలన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు కనీస సేవలు అందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్టు ప్రకటించారు.
  3. దీనిలో భాగంగా 14 టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేశారు.
  4. జనవరి 1998 నుంచి విజన్-2020 అమలు చేసారు.
  • PV నర్సింహారావు  గారు ప్రధాన మంత్రి గా ఉన్న సమయంలో భారతదేశ నూతన ఆర్థిక విధానం – జులై 24, 1991 లో  LPG  సంస్కరణల ఏర్పాటు జరిగినది. దీని ప్రధాన ముఖ్యాంశం- పరిశ్రమల ఆధునీకరణ.
  • వీటిని 8 వ ప్రణాళికా సంఘం (1992-97) లో   అమలు చేశారు.

Question: 4

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని AP ప్రభుత్వం మూసివేసిన చివరి నిజాం స్థాపించిన పబ్లిక్ సెక్టార్ కంపెనీ పేరు చెప్పండి.

  1. IDPL
  2. DRDL
  3. Alwyn
  4. HMT
View Answer

Answer: 3

Alwyn

Explanation:

  • హైదరాబాద్ లో చివరి నిజాం స్థాపించిన Allwyn అనే సంస్థ గడియారాలు, స్కూటర్ లు రీఫ్రీజిరేటర్ లు, మినీ లారీలు తయారు చేసేది.
  • చంద్రబాబునాయుడు ప్రభుత్వం దీనిని 1999లో ప్రైవేటు పరం చేయగా ఆ తర్వాత అది  మూతబడినది.
  • హైదరాబాద్ Allwyn: 1942 లో మీర్ ఉస్మాన్  అలీ ఖాన్ చే  స్థాపించబడింది క్రమంగా 1990 వ దశకం లో ప్రైవేటీకరణ జరిగీ, సుమారు 180 కోట్ల నష్టంతో మూసివేయబడింది.

Question: 5

నిజాం కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు?

  1. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్
  2. అఘోర్నాథ్ చటోపాధ్యాయ
  3. HK షేర్వానీ
  4. నికోలాయ్ రోరిచ్
View Answer

Answer: 2

అఘోర్నాథ్ చటోపాధ్యాయ

Explanation:

  1. 1884 లో హైదరాబాద్ (చాదరఘాట్) స్కూల్ మరియు మదరసా-ఇ-అలియా కలిసి హైదరాబాద్ కాలేజీ గా ఏర్పడింది. ఇది 1887లో నిజాం కాలేజీగా పేరు మారింది.
  2. ఇధి మొదట మద్రాసు విశ్వవిద్యాలయనికి అనుబంధంగా ఉండేది. తర్వాత 1947లో ఉస్మానియా విశ్వవిద్యాలయనికి అనుబంధంగా మారింది.
  3. దీని వ్యవస్థాపక ప్రిన్సిపల్ గా అఘోరనాథ్ ఛటోపాధ్యాయ గారిని సయ్యద్ హుస్సైన్ బీలగ్రామీ (అప్పటి విద్యాశాఖ డైరెక్టర్) నియమించారు.
  4. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ :
  • ఛాంద రైల్వే ఉద్యమం(ముల్లా అబ్దుల్ ఖయ్యూం, దస్తూర్  ఔసగి హొషాంగ్  లతో కలిసి ఉద్యమం చేశారు).
  • యంగ్  మెన్ ఇంప్రూవ్మెంట్  అసోసియేషన్ స్థాపించారు.
Recent Articles