Home  »  TGPSC 2022-23  »  Indian Polity-15

Indian Polity-15 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత రాజ్యాంగంలోని కింది ఏ భాగం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలను పేర్కొంది?

  1. VII భాగం
  2. IX భాగం
  3. XI భాగం
  4. XII భాగం
View Answer

Answer: 3

XI భాగం

Explanation:

  • భారత రాజ్యాంగంలోని 7 వ షెడ్యూల్ ,11 భాగం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలను , అధికారాలను గురించి పేర్కొంది
  • ప్రస్తుతం కేంద్ర జాబితా లో 98, రాష్ట్ర జాబితాలో 59 ,ఉమ్మడి జాబితాలో 52 అంశాలు కలవు 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య, అడవులు ,తునికలు కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ ఉమ్మడి జాబితా లోకి చేర్చారు

Question: 2

భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్ లో సరైన క్రమం (మొదటి నుండి చివరి వరకు) ఏది?
ఎ. గవర్నర్ నియామకానికి అర్హతలు

బి. గవర్నర్ కార్యాలయ పరిస్థితులు
సి. గవర్నర్ చేత ప్రమాణం లేదా ధృవీకరణలు
ఎంపికలు :

  1. ఎ, బి, సి
  2. సి, బి, ఎ
  3. బి,ఎ, సి,
  4. ఎ, సి, బి
View Answer

Answer: 1

ఎ, బి, సి

Explanation:

  • గవర్నర్ : రాష్ట్రంలో రాజ్యాధినేత గవర్నర్. రాష్ట్ర కార్య నిర్వాహక శాఖ కు అధిపతి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారలన్నీ గవర్నర్ పేరు మీదనే అమలవుతాయి .
  • గవర్నర్ నియామకం, అర్హత ,అధికారాలు , తొలగింపు గురించిరాజ్యాంగం లోని 6 వ భాగం లో ఆర్టికల్ 153-167 వరకు ఉన్నాయి

Question: 3

భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్ల విషయానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది?
ఎ. భారత ప్రభుత్వం 2015లో ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని నోటిఫై చేసింది.
బి. ఎలక్టోరల్ బాండ్ లు జారీ చేసిన తేదీ నుండి పదిహేను క్యాలెండర్ రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి.
సి.అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ లను స్వీకరించడానికి అర్హలు
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 2

కేవలం బి

Explanation: 

  • ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి?
  • ఎలక్టోరల్ బాండ్ అనేది ఒక బేరర్ బ్యాంకింగ్ సాధనం, దీనిని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. భారతదేశంలోని అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని రూపొందించారు.
  • ఎలక్టోరల్ బాండ్ జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు చెల్లుతుంది.
  • రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటు పై సుప్రీం కోర్ట్ 2024 ఫిబ్రవరి లో  తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డి. కా చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది.
  • రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా(BJP) ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టడాన్ని ఓ ఎన్నికల సంస్కరణగా (election reform) అభివర్ణించింది. నగదు రహిత, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చామని వెల్లడించింది.

Question: 4

భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్ సంఖ్య ప్రకారం ఆరోహణ క్రమం ప్రకారం సరి అయిన క్రమాన్ని అమర్చండి

ఎ. పార్లమెంట్ లో ఉపయోగించాల్సిన భాష
బి. పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుత విషయాలు.

సి. అంచనాలకు సంబంధించి పార్లమెంటులో ప్రక్రియ

ఎంపికలు :

  1. ఎ, బి, సి
  2. ఎ, సి, బి
  3. బి, సి, ఎ
  4. సి, ఎ, బి
View Answer

Answer: 3

బి, సి, ఎ

Question: 5

భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది?
ఎ. భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం ఆరు సంవత్సరాలు.
బి. భారత ఉపరాష్ట్రపతి హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క ఎక్స్ అఫిషియో ఛైర్మన్.

ఎంపికలు :

  1. ఎమాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు.
View Answer

Answer: 4

ఎ లేదా బి కాదు.

Explanation:

  • ఉప రాష్ట్రపతి గురించి 5 వ భాగంలో ఆర్టికల్ 63-69 వరకు పేర్కొన్నారు
  • పదవీకాలం 5 సం॥రాలు. పదవీకాలం పూర్తికాక ‘పోయినా రాజీనామా చేయవచ్చు. ఇతను తన రాజీ నామాను రాష్ట్రపతికి పంపాలి (67ఎ).
  • ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసినప్పటికీ తిరిగి నూతన ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టేవరకు ఆయన అధికారాలు చెలాయిస్తాడు.
  • 2వ పర్యాయం కూడా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. ఈ విషయం గురించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
  • ఉప రాష్ట్రపతి రాజ్యసభ కు అధ్యక్షుడు
Recent Articles