Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-6

Telangana Movement-6 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

నిజాం కళాశాల అసలు పేరు ఏమిటి?

  1. హైదరాబాద్ కళాశాల

  2. అసఫియా కళాశాల

  3. దారుల్ ఉల్మ్ కళాశాల

  4. జాగీర్దారీ కళాశాల

View Answer

Answer: 1

హైదరాబాద్ కళాశాల

Explanation:

  • సాలార్జంగ్-1:
  • 1870– సిటీ హై స్కూల్ & ఇంజనీరింగ్ కాలేజీ.
  • 1872– చాదరఘాట్ స్కూల్
  • 1880– ఈ రెండు కలిపి హైదరాబాద్ కాలేజీ ప్రారంభం.
  • 1887– హైదరాబాద్ కాలేజీ నే  నిజాం కాలేజీ గా పునః ప్రారంభం.
  • మొదట ఇంగ్షీషు బోధనా భాష గా మద్రాసు యూనివర్సిటీ కి అనుబంధంగాా ప్రారంభమై, 1947 లో ఉస్మానియా యూనివర్సిటీ కి అనుబంధంగా మారింది.
  • నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపల్: అఘోరానాథ్ ఛటోపాద్యాయ.

Question: 2

ఈ కింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్ పాస్ మీద బాంబు విసిరారు?

  1. నారాయణరావు పవార్

  2. పండిట్ నరేంద్రల్

  3. వామన్ రావ్ కులకర్ణి

  4. టి.వి. నారాయణ

View Answer

Answer: 1

నారాయణరావు పవార్

Explanation:

  • నారాయణరావు పవార్  (1925 – 2010) భారత స్వాతంత్ర  సమరయోధుడు మరియు ఆర్యసమాజ్ సభ్యుడు.
  • హైదరాబాదు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను హతమార్చడానికి పథకం పన్నినారు.
  • 1947 డిసెంబర్ 4న పవార్ మరో ఇద్దరు (జగదీష్ ఆర్య మరియు గండయ్య ఆర్య)తో కలిసి ఆయన కింగ్ కోటి ప్యాలెస్ సమీపంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై బాంబు విసిరారు.
  • తృటిలో నిజాం ప్రాణాలతో బైటపడ్డాడు.
  • సెషన్స్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది, కానీ 1948లో పోలీసు చర్య తర్వాత విడుదలైనారు.

Question: 3

AP రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం:

  1. ఉమ్మడి రాజధాని నివాసితుల జీవితం, స్వేచ్ఛ మరియు ఆస్తులను రక్షించడానికి గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి

  2. ఎమర్జెన్సీ విధించే అధికారం గవర్నర్ కు ఉంటుంది.

  3. ఉమ్మడి రాజధాని ఆదాయంలో రెండు రాష్ట్రాలకు సమాన వాటా ఉంటుంది.

  4. ఉమ్మడి రాజధానిపై రెండు రాష్ట్రాలు చట్టం చేయవచ్చు

View Answer

Answer: 1

ఉమ్మడి రాజధాని నివాసితుల జీవితం, స్వేచ్ఛ మరియు ఆస్తులను రక్షించడానికి గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి

Explanation:

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టం: 12-భాగాలు, 13-షెడ్యూల్స్, 108-సెక్షన్లు.
సెక్షన్-8: ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల స్వాతంత్రం, ఆస్తులు, ప్రాణాల రక్షణ కోసం గవర్నర్ కు ప్రత్యేక బాధ్యతలుంటాయి. దీని నిర్వాహణకు ఇద్దరు సలహాదారులను నియమించుకోవచ్చు.
12 భాగాలు:
1. ప్రవేశిక
2. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ
3. చట్టసభలో ప్రాతినిధ్యం.
4. హై కోర్టు.
5. వ్యయ అధికారాలు, ఆదాయ పంపిణీ
6. అప్పులు,ఆస్తుల పంపిణీ
7. కార్పొరేషన్ సంబంధిత నియమాలు
8. అఖిల భారత సర్వీసు సంబంధిత నియమాలు
9. జల వనరుల అభివృద్ది, నిర్వాహణ
10. మౌలిక వనరుల అభివృద్ది, నిర్వహణ
11. ఉన్నత విద్యావకాశాలు
12. న్యాయ సంబంధిత నియమాలు.
పార్లమెంటు లో తెలంగాణ బిల్లు:

  • 2014:
  • Feb 13-  లోకసభలో ‘Ap పునర్విభజన బిల్లు’ – కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే
  • Feb 18- మూజువాణి వోటుతో లోకసభలో బిల్లు ఆమోదం.
  • Feb 20- రాజ్యసభలో డిప్యూటీ చైర్మెన్- కురియన్ ‘ది బిల్ ఈజ్ పాస్డ్’
  • మార్చి 1- రాష్ట్రపతి సంతకం, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

Question: 4

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన అఖిల భారత కాంగ్రెస్ జాతీయ సమావేశాలు ఎక్కడ జరిగాయి.

  1. హరిపుర

  2. కరాచీ

  3. బొంబాయి

  4. నాగ్ పూర్

View Answer

Answer: 1

హరిపుర

Explanation:

  • 1938 Feb: జాతీయ కాంగ్రెస్ సమావేశాలు:
  • హరిపుర- సుభాష్ చంద్రబోస్.
  • ఈ సమావేశానికి హైదరాబాద్ సంస్థానానికి చెందిన అనేక మంది హాజరయ్యారు.
  • హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు ఈ సమావేశమే స్పూర్తినిచ్చింది.
  • 1938 జులై HSCస్థాపకుడు: స్వామి రామానంద తీర్థ( వెంకటరావు ఖడ్గేకార్)
  • తాత్కాలిక అధ్యక్షుడు: గోవిందరావు నానల్.
  • 1938 sep 8- HSCపై నిషేదం.
  • 1946 జులై 1- HSCపై నిషేదం ఎత్తివేత.
  • 1947 జూన్- HSCప్రథమ మహాసభ; ముషీరాబాద్- రామానంద తీర్థ.
  • HSCనిర్వహించిన ఉద్యమాలు:
  • జాయిన్ ఇండియా ఉద్యమం
  • జెండా దినోత్సవం: Sep 2 1947
  • స్వామి రామానంద తీర్థ రచన: హైదరాబాద్ స్వతంత్ర పోరాటం- నా అనుభవాలు,జ్ఞయాపకాలు.

Question: 5

AP రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రత్యేకత:

  1. ఉమ్మడి రాజధానిని యుటిగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది

  2. కేంద్ర పాలిత ప్రాంతంగా లేకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధాని

  3. ఉమ్మడి రాజధాని ఆస్తులను పంపిణీ చేసే అధికారం గవర్నర్ కు ఉంటుంది

  4. ఉమ్మడి రాజధానిలో లా అండ్ ఆర్డర్ కేంద్రం పర్యవేక్షణలో ఉంటుంది

View Answer

Answer: 2

కేంద్ర పాలిత ప్రాంతంగా లేకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధాని

Explanation:

  • AP పునర్వ్యవస్తీకరణ చట్టం రెండవ భాగం, సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ 10 సంవత్సరాల వరకు ఆంధ్ర, తెలంగాణ ల కు ఉమ్మడి రాజధాని గా ఉంటుంది.
  • ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది.
  • కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటుకోసం ఒక నిపుణుల కమిటీ ని నియమిస్తుంది.
  • దీనికి అనుగుణంగా కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది.  
  • ఈ కమిటీ 6 నెలల లోపు నూతన రాజధాని ని సిఫారసు చేస్తుంది.
  • Note: ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ఉమ్మడి హై కోర్టు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేవరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హై కోర్టే ఉంటుంది.
Recent Articles