Home  »  TGPSC 2022-23  »  Telangana History-6

Telangana History-6 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మహాభారతాన్ని తెలుగులోకి అనువదించే బృహత్తర కార్యక్రమాన్ని నన్నయ_______లో ప్రారంభించాడు.

  1. పదవ శతాబ్దం
  2. పదకొండవ శతాబ్దం
  3. పదమూడవ శతాబ్దం
  4. పద్నాలుగో శతాబ్దం
View Answer

Answer: 2

పదకొండవ శతాబ్దం

Explanation: 

  • నన్నయ ఆదికవి అంటే తొలి తెలుగు కవి. నన్నయ తూర్పు చాళుక్య రాజు వేంగి రాజ్య పాలకుడు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేంగి ప్రస్తుత తీరాంధ్ర ప్రాంతం. రాజరాజ నరేంద్రుని పరిపాలనా కాలం క్రీస్తుశకం 1019 నుండి 1061.
  • నన్నయ రాజరాజ నరేంద్రుని అభీష్టం మేరకు మహాభారతాన్ని తెలుగులో రచించడం నరేంద్రుని పాలనా కాలంలోనే అంటే 11వ శతాబ్దంలోనే ప్రారంభించారు.

Question: 2

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ?

  1. ధూళికట్ట
  2. ఘణిగిరి
  3. కొండాపూర్
  4. నేలకొండపల్లి వద్ద ఉంది
View Answer

Answer: 4

నేలకొండపల్లి వద్ద ఉంది

Explanation: 

  • దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో ఉంది. ఇది శాతవాహన అనంతర కాలంలో నిర్మించబడింది.
  • ఒక మహా స్తూపం, చతుశ్శాల రకం విహారాలు, నిలువెత్తు బుద్ధుని విగ్రహాలు అనేకం ఇక్కడ బయటపడ్డాయి. క్రీస్తు శకం మూడో శతాబ్దం నుండి క్రీస్తుశకం ఆరో శతాబ్దం వరకు ఈ నిర్మాణాలు జరిగాయి.
  • బుద్ధుని కంచు విగ్రహం, పాలరాయిపై చెక్కిన తొమ్మిది బుద్ధ విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.

Question: 3

నిరుపేదలు, నిరుపేద మహిళలు, పిల్లల కోసం ఇంద్ర సేవా సదన్ను ఎవరు స్థాపించారు.

  1. జ్ఞానకుమారి హెడ
  2. ఎల్లప్రగడ సీతాకుమారి
  3. సునీతా దేవి
  4. సంగెం లక్ష్మీబాయి
View Answer

Answer: 4

సంగెం లక్ష్మీబాయి

Explanation: 

  • ఇందిర సేవా సదన్ అనే అనాథాశ్రమాన్ని స్థాపించింది సంగెం లక్ష్మీబాయమ్మ. ఈమె దీనిని హైదరాబాద్లోని సంతోష నగర్ లో స్థాపించారు. బూర్గుల రామకృష్ణారావు కుమార్తె ఇందిర పేర దీన్ని స్థాపించారు.
  • అక్కడే ఈమె  “నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు” అనే ఆత్మ కథను రాశారు. తెలంగాణ గ్రామీణ సమాజంలో జన్మించి జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఏకైక వనిత సంగెం లక్ష్మీబాయమ్మ.  సంగం లక్ష్మీబాయి తెలంగాణ తొలి తరం మహిళా పట్టభద్రురాలు.
  • ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించారు.
  • ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత మెదక్ నుంచి పార్లమెంటు(లోక్ సభ)కు ఎన్నికయ్యారు. ఈమె మేనమామ సీతారామయ్య గారు శ్రీకృష్ణదేవరాయాంద్ర భాషా నిలయ వ్యవస్థాపకుల్లో ఒకరు.

Question: 4

సంస్కృతంలో ‘నీతిసారం” అనే గ్రంథాన్ని రచించిన వారు ?

  1. జయప సేనాని
  2. రుద్రదేవ
  3. విద్యానాథ
  4. పాల్కురికి సోమనాథ
View Answer

Answer: 2

రుద్రదేవ

Explanation: 

  • నీతిసారం లేదా నీతిశాస్త్ర రచయిత రుద్రదేవుడు. కాకతీయ రుద్రదేవుడు మొదట సామంత రాజుగా ఉండి ఆ తరువాత క్రీ.శ. 1163లో సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించుకుని తెలంగాణలో మొదటిసారిగా విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనికి వినయభూషణుడని బిరుదు ఉంది.
  • రుద్రదేవుడు కళాభిమాని, కళాపోషకుడు. అనేక ఆలయాలను నిర్మించాడు. వేయి స్తంభాల గుడి ఇతని నిర్మాణమే.
  • బద్దెన రచించిన “నీతిసార ముక్తావళి” లోని ఒక పద్యం ప్రకారం నీతిశాస్త్ర రచయిత రుద్రదేవుడు.

Question: 5

శాతవాహనుల కాలంలో “తిలపాక” వృత్తి ఏమిటి?

  1. నేయడం
  2. వడ్రంగి
  3. ఆయిల్ ఎక్స్ ట్రాక్టర్లు
  4. క్లే ఎక్స్ ట్రాక్టర్లు
View Answer

Answer: 3

ఆయిల్ ఎక్స్ ట్రాక్టర్లు

Explanation: 

  • శాతవాహనుల కాలంలో తిలపాక వృత్తి అంటే నూనె తీసే(Oil Extracting) పని. నూనె తీసే వృత్తి కలిగిన వారిని తిలపిషకులు (Oil Extractors) అనేవారు.
  • శాతవాహన యుగంలో ఒక్కొక్క వృత్తిని అనుసరించిన వారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు.
  • నూనె తీసే వారి శ్రేణి తిలపషక లేదా తిలపిషక శ్రేణి. కుండలు తయారు చేసే వారిని కులరికులు అనేవారు.
  • వారిది కులరిక శ్రేణి. ఉదక యంత్రాలను తయారు చేసేవారు ఒదయంత్రికులు.
  • వారిది శ్రేణి ఒదయంత్రిక శ్రేణి. కులరిక శ్రేణి, తిలపిషకశ్రేణి, హోదా ఎంత్రిక శ్రేణి మొదలైన శ్రేణులను నాసిక్ శాసనాలు పేర్కొన్నాయి.
  • శాతవాహన యుగంలో ఇటువంటి 18 రకాల వృత్తులుండేవని శాసనాల వల్ల తెలుస్తుంది.
Recent Articles