Home  »  TGPSC 2022-23  »  Indian History-1 

Indian History-1 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశానికి వచ్చిన చైనీస్ బౌద్ధ యాత్రికులను వారి కాలక్రమానుసారంగా అమర్చండి:

(ఎ) హ్యూన్ త్సాంగ్

(బి) వాంగ్ హియున్ త్సే

(సి) ఇట్సింగ్

(డి) ఫాహిన్

  1. ఎ,సి, బి, డి
  2. సి, బి, డి, ఎ
  3. డి, ఎ, బి, సి
  4. బి, డి, ఎ, సి
View Answer

Answer: 3

డి, ఎ, బి, సి

Explanation:

  • భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు అరేబియా , చైనా, ఇటలీ, ఇంగ్లండ్ మొదలైన దేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను కలిగి ఉన్నారు. ఈ పురాతన యాత్రికులు భారతదేశ సంస్కృతిని మరియు అందాన్ని వివిధ కాలాల నుండి ప్రశంసించారు మరియు దానిని ప్రయాణ కథనాలు, పుస్తకాలు, పత్రాలు మరియు కవితల రూపంలో రాశారు.. భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు భారతదేశం గురించి అనేక పుస్తకాలు రాశారు, ఇది దాని చరిత్రలో ఒక ప్రముఖ భాగంగా మారింది
  • ఫాహియాన్ చైనా దేశానికి చెందిన ఒక బౌద్ధ యాత్రికుడు. సా.శ. 399, 412 సంవత్సరాల మధ్యలో కొన్ని బౌద్ధ గ్రంథాలను సేకరించడం కోసం 2 వ చంద్రగుప్తుని కాలంలో భారతదేశం, శ్రీలంక, నేపాల్ దేశాలను సందర్శించాడు. తన యాత్రా విశేషాలన్నీ పౌర-లో-కి ( బౌద్ధ రాజ్యం లో నా సందర్శన )  పుస్తకంలో పొందు పరచాడు. ఆ పుస్తకంలో తన అనుభవాలను, ఆనాటి స్థితి గతులను, సంస్కృతులను గ్రంథస్తం చేశాడు
  • హ్యువాన్ త్సాంగ్ (యువాన్ చ్వాంగ్), రాజు హర్షబర్ధన్ పాలనలో భారతదేశానికి వచ్చిన చైనా బౌద్ధ యాత్రికుడు. అతను క్రీ.శ.630 లో వస్తున్నాడు. అతను కాశ్మీర్, సియాల్‌కోట్, కనౌజ్ మరియు నలంద వంటి మఠాలలో హీనయాన మరియు మహాయాన బౌద్ధమతాలను అభ్యసిస్తూ 15 సంవత్సరాలు ఉన్నాడు.

ఇట్సింగ్ (635-713) :

  • ఈయన ఒక చైనా యాత్రికుడు మరియు బౌద్ధ సన్యాసి, క్రీ.శ 675 లో సుమత్రా ద్వారా సముద్రం ద్వారా భారతదేశానికి వచ్చాడు.
  • ఈయన “నలంద విశ్వవిద్యాలయంలో” 10 సంవత్సరాలు నివసించారు.
  • అక్కడి ప్రసిద్ధ ఆచార్యుల నుండి సంస్కృతం మరియు బౌద్ధమతం గ్రంథాలను చదివాడు. ‘
  • క్రీ.శ 691 లో “భారతదేశంలో ప్రబలంగా ఉన్న బౌద్ధమతం మరియు మలయ్ ద్వీపసమూహం” అనే తన ప్రసిద్ధ గ్రంథాన్ని రాశారు.

Question: 12

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

ఎ. నానాఘాట్ శాసనం

బి. హాతిగుంఫా శాసనం

సి. నాసిక్ శాసనం

డి. జునాగఢ్/ గిర్నార్ శాసనం

1. ఖరవేల

2. రుద్రదమన

3. నాగానిక

4. గౌతమి బాలశ్రీ

సరైన జవాబుని ఎంచుకోండి.

  1. A-3; B-1; C-4; D-2
  2. A-4; B-3; C-2; D-1
  3. A-2; B-4; C-1; D-3
  4. A-; B-2; C-3; D-4
View Answer

Answer: 1

A-3; B-1; C-4; D-2

Explanation:

  • నానాఘాట్ శాసనాన్ని శాతవాహన రాజు మొదటి శాతకర్ణి భార్య నాగణిక ప్రాకృత భాష లో వేయించింది. ఈ శాసనం ప్రకారం శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజసూయ యాగం 20 ఇతర క్రతువులను చేశాడు . బ్రాహ్మణులకు అనేక ఆవులు గుర్రాలు ,గ్రామాలు దానం చేశాడు
  • భారతదేశం లో మొదటి సా రిగా భూ దానాలు చేశాడు
  • హాథీగుంఫా శాసనం క్రీ. పూ 2వ శతాబ్దంలో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో ఉదయగిరి గుహలలో అప్పటి కళింగ పాలకుడు ఖారవేలుడు చెక్కించిన శిలాశాసనం. ఇది ఉదయగిరి కొండల్లో దక్షిణం వైపున ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ హాథీగుంఫా అనే గుహలో రాతిపై ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో 17 వరుసల్లో చెక్కబడి ఉంది
  • ప్రసిద్ధ నాసిక్ శాసనం గౌతమీబాలశ్రీ వేయించింది ఇది తన కుమారుడు గౌతమీపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలుపుతుంది.  నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణిని శకు ల విధ్వంసకుడిగా వర్ణిస్తుంది
  • జునాఘడ్ శాసనమును శక రాజు రుద్రదమనుడు  వేయించాడు. ఇది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శిలా శాసనం.
  • జునాఘడ్ శాసనంనకు మరో పేరు గిర్నార్ శాసనం. ఈ శాసనం సుదర్శన తటాకం గురించి తెలుపుతుంది.
  • నోట్ : సుదర్శన తటాకంను చంద్రగుప్తమౌర్యుడు నిర్మించాడు.
  • దీనికి అశోకుడు, రుద్రదామనుడు, స్కంధగుప్తుడు మరమత్తులు చేయించారు.
  • రుద్రదమనుని సైనిక విజయాల గురించి తెలుపు శాసనం గిర్నార్ శాసనం

Question: 13

ఏ శాసనం అస్మాక మహాజనపద వివరాలను తెలియజేస్తుంది?

  1. దోమకొండ శాసనం
  2. పానగల్ కోట శాసనం
  3. బయ్యారం సరస్సు శాసనం
  4. ముక్కట్రావుపేట శాసనం
View Answer

Answer: 1

దోమకొండ శాసనం

Question: 14

ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది?

  1. గాథా సప్తశతిని హాల సంస్కృత భాషలో రచించాడు.
  2. బృహత్కథలో పేర్కొన్న కథలు తెలంగాణ భౌగోళిక స్వరూపంతో ముడిపడి ఉన్నాయి.
  3. గాధా సప్తశతి ప్రేమ, ఆనందం గురించిన కథల సంకలనం
  4. గుణడ్య రచించిన బృహత్కథలో కొంత భాగాన్ని సంస్కృతంలో కథాశరిత్ సాగరంగా అనువదించారు.
View Answer

Answer: 1

గాథా సప్తశతిని హాల సంస్కృత భాషలో రచించాడు.

Explanation:

  • హాలుడు శాతవాహన రాజులలో (17వ రాజు) బిరుదు : కవివత్సలుడు
  • ఇతను ఒక కవిరాజు. ఇతను ప్రాకృతంలో గాధాసప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో 700 శృంగార పద్యాలు అప్పటి సమాజాన్ని వివరించాయి.
  • ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అంటారు.
  • ఇతడు శ్రీలంక రాకుమార్తె లీలావతిని సప్తగోదావరిలో వివాహమాడాడు.
  • ఈ వివాహంపై కుతుహలుడు లీలావతి పరిణయం (ప్రాకృతం) అనే గ్రంథంను రచించాడు

గుణాఢ్యుడు తెలంగాణ మొదటి లిఖిత కవి. ఇతడు బృహత్కథ అనే ప్రాకృత కథాకావ్యాన్ని రచించాడు.

  • గుణాఢ్యుడు బృహత్కథను మొదట  పైశాచిక ప్రాకృత భాషలో వ్రాయగా క్షేమేంద్రుడు దీన్ని బృహత్కథా  మంజరి పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు
  • బృహత్కథా మంజరిని  సోమదేవుడు విపులంగా కథాసరిత్సాగరం పేరుతో అనువదించాడు. ఇదీ బృహత్కథ పరిణామ క్రమం.

Question: 15

భారతదేశంలో సిక్కు, బౌద్ధమతాల గురించి ఈక్రింది వాటిలో సరైనది ఏది?

ఎ. సిక్కు మతం పంజాబ్ లో 15వ శతాబ్దంలో, బౌద్ధమతం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఆవిర్భవించింది.

బి. సిక్కు, బౌద్ధ మతాలు రెండూ కుల వ్యవస్థను అంగీకరిస్తూ ప్రజలందరి మధ్య అసమానతలను నొక్కి చెబుతున్నాయి.

సి. అమృత్సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుల పవిత్ర స్థలం కాగా, బుద్ధగయ బౌద్ధులకు పవిత్ర స్థలం.

డి. భారత రాష్ట్రాలైన పంజాబ్, సిక్కింలలో సిక్కు, బౌద్ధ మతాలకు గొప్ప/ గణనీయమైన అనుచరులును కలిగి ఉన్నారు.
ఎంపికలు :

  1. ఎ మరియు బి
  2. బి మరియు డి
  3. బి మరియు సి
  4. ఎ, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, సి మరియు డి

Explanation:

  • క్రీ.పూ. 6వ శతాబ్దంలో రెండు ముఖ్యమైన అభివృద్ధులు చోటు చేసుకున్నాయి. అవి :
  1. మతపరమైన అభివృద్ధి
  2. రాజకీయపరమైన అభివృద్ధి.

మతపరమైన అభివృద్ధి

  •  క్రీ.పూ. 6వ శతాబ్దంలో 62 మతాలు ఆవిర్భవించాయి. వీటిలో బౌద్ధ, జైన మతాలు మినహాయించి మిగిలినవి ప్రారంభంలోనే అంతమైనాయి. మతాల ఆవిర్భావానికి కారణాలు:
  • ఉపనిషత్తుల ప్రభావం బ్రాహ్మణుల ఆధిపత్యం, ఇనుము కనుగొనుట,వడ్డీవ్యాపారం ఆధిక్యత పెరగడంతో బ్రాహ్మణుల్లో అవినీతి, అత్యాశ ప్రబలాయి. కులవ్యవస్థ ఘనీభవించి సామాన్యుడు అశాంతి పాలయ్యాడు.

సిక్కు మతాన్ని గురునానక్  స్థాపించిన సం॥రం : క్రీ. శ 1500

  • సిక్కు మతం లో మొత్తం 10 మంది సిక్కు గురువులున్నారు
  • పవిత్రగ్రంథం : గురుగ్రంధ సాహిబ్ (ఆదిగ్రంధ్)
  • ఆరాధించే ప్రదేశం : గురుద్వారా, ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశం : భారతదేశం
  • సిక్ అనగా పంజాబీ భాషలో శిష్యుడని అర్ధం
  • గురునానక్ శిష్యులను సిక్కులు అంటారు.
Recent Articles