Home  »  TGPSC 2022-23  »  Indian History-11

Indian History-11 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

VD సావర్కర్ స్థాపించిన సీక్రెట్-సొసైటీని ఏమని పిలుస్తారు.

  1. యుగాంతర్
  2. అనుశీలన సమితి
  3. అభినవ్ భారత్ సొసైటీ
  4. క్రాంతిదల్
View Answer

Answer: 3

అభినవ్ భారత్ సొసైటీ

Explanation: 

  • వినాయక్ దామోదర్ సావర్కర్ (వి.డి.సావర్కర్)
  • 1904లో ‘అభినవ భారత్ ‘ను స్థాపించాడు. విప్లవ కారుల రహస్య సంఘమును నిర్వహించాడు.
  • 1857 తిరుగుబాటును మొదటి భారత సంగ్రామంగా అభివర్ణించాడు.
  • వి.డి.సావర్కర్ గురువు – తిలక్ఇ
  • తడు రచించిన ‘ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెం డెన్స్’ ప్రచురణకు ముందే బ్రిటీష్ వారిచే నిషేధించ කයිරයි.
  • లండన్లో న్యూఇండియా అసోసియేషన్ నిర్వహించాడు. > “జోసెఫ్ మాజిని – బయోగ్రఫీ అండ్ పాలిటిక్స్” గ్రంథాన్నిరచించాడు.
  • వి.డి.సావర్కర్ ను  బ్రిటీష్ వారు విచారణ జరిపి అండ మాన్ జైలుశిక్ష విధించారు.
  • గణేష్ సావర్కర్ ను  దేశభక్తి పూరిత గేయాలు రచించి నందుకు నాసిక్ కలెక్టర్ జాక్సన్ దేశ ద్రోహనేరం మోపి 1909 జూన్లో అండమాన్ జైలుకు పంపినాడు.

Question: 12

కింది వ్యక్తులు అనుబంధించబడిన కార్యకలాపాలతో సరిపోల్చండి.

వ్యక్తులు

ఎ. లాలా లజపత్ రాయ్

బి. బాలగంగాధర తిలక్

సి. బిపిన్ చంద్ర పాల్

డి. లాలా హర్దయాల్

కార్యకలాపాలు

1. గదర్ పార్టీ

2. మెమోయిర్స్ ఆఫ్ ది లైఫ్ అండ్ టైమ్స్

3. గీతా రహస్యం

4. సైమన్ కమిషన్

సరైన జవాబుని ఎంచుకోండి:

  1. A-4; B-1; C-2; D-3
  2. A-3; B-2; C-4; D-1
  3. A-4; B-3; C-2; D-1
  4. A-1; B-3; C-2; D-4
View Answer

Answer: 1

A-4; B-1; C-2; D-3

Explanation: 

లాలాలజపతిరాయ్

  •  పంజాబ్ లోని దూండ్కే గ్రామంలో 1865లో జన్మిం చాడు. బిరుదు : షేర్-ఎ-పంజాబ్.
  • ప్రచురించిన పత్రికలు : ద పంజాబీ, ద పీపుల్ పుస్తకం : అన్ హ్యాపీ ఇండియా

బాల గంగాధర్ తిలక్

  • 1881లో కేసరి మరాఠీ భాషలో, మరాఠా ఇంగ్లీష్ భాషలో  దినపత్రికల ద్వారా జాతీయ భావాలను ప్రచారం చేశాడు . అతని బిరుదు లోకమాన్య తిలక్ . రచించిన గ్రంథాలు గీత రహస్యం ,ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్

బిపిన్ చంద్రపాల్

  • పాల్ 1858వ సం॥రంలో జన్మించాడు.
  • పాల్ బ్రహ్మసమాజ్ ప్రతినిధిగా మధ్య యూరప్, అమెరికాలలో పర్యటించాడు.
  • ప్రారంభించిన వారపత్రిక : న్యూ ఇండియా
  • 1905లో జరిగిన బెంగాల్ విభజన వ్యతిరేకోధ్యమం, స్వదేశీ ఉద్యమంలో పాల్ చురుగ్గా పాల్గొన్నాడు.
  • పాల్ ప్రారంభించిన వందేమాతరం పత్రికకు అరబిందో ఘోష్ సంపాదకుడిగా వ్యవహరించాడు.
  • పాల్ రచించిన గ్రంధం – నా జీవితకాలం నాటి జ్ఞాప కాలు (మెమోరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్)
  • సాయుధ విప్లవం ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారుముఖ్య నాయకులు:
  • లాలా హర్దయాల్, సోహన్ సింగ్ భక్నా, మరియు కర్తార్ సింగ్ సరభా కలిపి  గదర్ పార్టీ 1913లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థాపించి విప్లవాత్మక ఆలోచనలను వ్యాప్తి చేశారు

Question: 13

మహాత్మా గాంధీ లండన్ లో కింది ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.

  1. మొదటి మరియు రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు.
  2. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే
  3. రెండవ మరియు మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు.
  4. కేవలం మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
View Answer

Answer: 2

రెండవ రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే

Explanation: 

2వ రౌండ్ టేబుల్ సమావేశం (1931 సెప్టెంబర్) :

  • ఈ సమావేశానికి గాంధీజీ హాజరైనారు. సరోజినీ నాయుడు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. గాంధీజీ హాజరైన ఏకైక రౌండ్ టేబుల్ సమావేశం ఇదే. గాంధీజీ తిరిగి ఇండియా వచ్చి శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1932 జనవరిలో పున: ప్రారంభించాడు. గాంధీని అరెస్ట్ చేసి పూనెలోని ‘ఎరవాడ’ జైలులో ఉం చారు.
  • 1932 ఆగస్టు 17న ప్రధాని రామ్ మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు.
  • ఈ అవార్డులో ‘దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం జరిగింది. దీనిని నిరసనగా గాంధీ పూనాలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టినాడు.
  • 1932లో గాంధీజీ, అంబేద్కర్ల మధ్య “పూనా ఒడంబడిక” జరిగింది. కమ్యూనల్ అవార్డు దళితు లకు 71 సీట్లను రిజర్చేసింది. కానీ పూనా ఒడం బడిక ప్రకారం దళితులకు 148 స్థానాలు ఇవ్వడం జరిగినది
  • మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మాత్రమే పాల్గొన్నది.

Question: 14

1945–46లో ఢిల్లీలోని ఎర్రకోటలో బ్రిటీష్ ప్రభుత్వం కోర్టు మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లేదా అజాద్ హింద్ ఫౌజికి చెందిన. కింది అధికారులలో ఎవరు విచారణకు గురయ్యారు?

ఎ. షా నవాజ్ ఖాన్

బి.సుభాష్ చంద్రబోస్

సి. గురుదయాల్ సింగ్ ధిల్లాన్

డి. ప్రేమ్ సెహగల్

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. ఎ, సి & డి మాత్రమే
  4. ఎ, బి & డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ, బి & డి మాత్రమే

Explanation: 

ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ (లేక) ఎర్రకోట విచారణ (1945) :

  • భారత జాతీయ సైన్యానికి చెందిన యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని క్రీ.శ. 1945
  • నెహ్రూ కోరాడు. * ఆజాద్ హిందూఫౌజ్ వారిని విచారించిన ప్రాంతం – ఎర్రకోట (ఢిల్లీ) ఆగస్టులో బ్రిటీషు ప్రభుత్వాన్ని,1945, నవంబర్ 5న ఢిల్లీలోని ఎర్రకోటలో యుద్ధఖైదీల విచారణ ప్రారంభమైంది.
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులలో ముగ్గురైన ప్రేమ్ కుమార్ సెహగాల్, షానవాజాఖాన్, గురుభక్షసింగ్ ధిల్లాన్ లను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఎర్రకోట వద్ద విచారణ జరిగినది.
  • యుద్ధ ఖైదీల విచారణ ప్రారంభమైన 1945, నవంబర్ 5-11 వరకు దేశంలో భారత జాతీయ సైనిక వారోత్సవాలు జరిగాయి. నవంబర్ 12వ తేదీని INA డేగా పాటిస్తారు.
  • INA సైనికులను రక్షించుటకై వారి తరుపున వాదించిన ప్రధాన న్యాయవాది : బులాభాయేశాయ్.
  • ఇతర న్యాయవాదులు :  జవహార్లాల్ నెహ్రూ,  తేజ్ బహదూర్ సఫ్రూ, కైలాస్ నాథ్ కట్జూ, అరుణా అసఫ్ అలీ .
  • కానీ వీరందరిని విచారించిన పిదప యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కానీ ఆనాటి ప్రజాగ్రహానికి లొంగిన భారతసైన్యాధ్యక్షుడు అచిన్ లేక్  వీరి శిక్షలను రద్దుచేసాడు.

Question: 15

ఈ క్రింది దేనికి ప్రతిస్పందనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన “నైట్ హుడ్” బిరుదుని త్యజించాడు:

  1. బెంగాల్ విభజన
  2. జలియన్ వాలాబాగ్ ఊచకోత
  3. చౌరీ చౌర హింస
  4. భగత్ సింగ్, సుక్వ్ థాపర్ మరియు శివరామ్ రాజ్ గురు ఉరి
View Answer

Answer: 2

జలియన్ వాలాబాగ్ ఊచకోత

Explanation: 

  • 1919, ఏప్రిల్ 9న పంజాబ్ నాయకులైన డా॥ సత్యపాల్, డా|| సైపుద్దిన్ కిచ్లూలను అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్కు నిరసనగా జలియన్ వాలాబాగ్ లో  క్రీ.శ.
  • 1919, ఏప్రిల్ 13 (వైశాఖీపండగ, పంజాబీ హిందువులకు * సంవత్సరాది)న. లాలా హన్స్ రాజ్ సభను ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్నాడు.
  • ఈ సమావేశం జరుగుతుండగా రెజినాల్డ్ డయ్యర్ ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించారు.
  • ఈ సంఘటననే జలియన్ వాలాబాగ్ దురంతం అని పిలుస్తారు.
  • ఈ సంఘటనకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ బిరుదును త్యజించాడు.

 

* గాంధీజీ దక్షిణాఫ్రికాలో బోయర్ల యుద్ధం సందర్భంగా బ్రిటీషు వారు ఇచ్చిన కైజర్-ఇ-హింద్ బిరుదును త్యజించాడు.

  • రవీంద్రనాథ్ ఠాగూర్ కి గురుదేవ్ అను బిరుదును ప్రధానం చేసినది – గాంధీజీ.
Recent Articles