Home  »  TGPSC 2022-23  »  Indian History-2

Indian History-2 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

dian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

మొహెంజొదారో వద్ద కనుగొన్న పశుపతి’ ముద్రలో కనిపించని జంతువు ఆకారం ఏది?

  1. ఏనుగు
  2. సింహం
  3. పులి
  4. ఖడ్గమృగం
View Answer

Answer: 2

సింహం

Explanation:

  •  పశుపతికి సంబంధిచిన ఆధారాలు మొహంజదారోలో లభించాయి.
  • సింధు ప్రజల పురుష దైవం : పశుపతి (కొమ్ముల దేవుడు)
  • ఈ పశుపతి చుట్టూ నాలుగు జంతువులు కలవు :
  • ఏనుగు,పులి,గేదె ఖడ్గమృగం
  • ఈయన కాళ్ళ దగ్గర రెండు జింకలు కలవు.
  • వీరు ప్రకృతి ఆరాధకులు.
  • కొమ్ముల దేవుడిని పశుపతిగా పేర్కొన్న చరిత్రకారుడు – సర్ జాన్ మార్షల్సిం
  • ధూ ప్రజలు కొలిచిన వృక్షం – రావిచెట్టు, జంతువు – మూపురం ఉన్న ఎద్దు, పక్షి – పావురం
  • సింధూ ప్రజలు ఆరాధించిన చిహ్నం-స్వస్తిక్ గుర్తు

Question: 7

ఈ క్రింది వాటిని సరిపోల్చండి

జాబితా -1 

(ఎ) కోసల

(బి) లిచ్చవి

(సి) వత్స

(డి) మత్స్య

జాబితా 2

1. వైశాలి
2. కౌసంబి
3. విరాటనగర
4. శ్రావస్తి

  1. ఎ-i, బి-ii, సి-iii, డి-iv
  2. ఎ-iii, బి-ii, సి-iv, డి-i
  3. ఎ-i, బి-iii, సి-ii, డి-iv
  4. ఎ-ii, బి-iv, సి-i, డి-iii
View Answer

Answer: 1

ఎ-i, బి-ii, సి-iii, డి-iv

Explanation:

  • ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరు నుండి ఐదవ శతాబ్దం వరకు విలసిల్లిన 16 రాజ్యాలను మహాజనపదాలు అంటారు
  1. అంగ: దీని రాజధాని చంపా. 2. కాశీ: రాజధాని వారణాసి. ఇది వరుణ, అసి నదుల సంగమ ప్రాంతం. 3 కోసల: దీని తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. రాజ్యం చివరికి మగధలో విలీనమైంది.
  2. వజ్జీ రాజధాని వైశాలి. ఇది 8 గణ రాజ్యాలతో కూడిన సమాఖ్య.
  3. మల్ల: దీని రాజధానులు కుశినార, పావ. కుశినారలో బుద్ధుడు నిర్యాణం చెందాడు. పావలో మహావీరుడు మరణించాడు.6. చేది: రాజధాని సుక్తిమతి
  4. వత్స: దీని రాజధాని కౌశాంబి, దీని రాజు ఉదయనుడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు..
  5. పాంచాల: దీని రాజధానులు అహిచ్ఛత్ర, కంపిల్య.
  6. శౌరసేన: దీని రాజధాని మధుర..10. మత్స్య: దీని రాజధాని విరాటనగరం. ఈ రాజ్యమూ మగధలో కలిసిపోయింది.
  7. కురు: రాజధాని ఇంద్రప్రస్థ. ఆధునిక ఢిల్లీ పరిసరాల్లోని నగరం. రెండో రాజధాని హస్తినాపూర్
  8. అస్సక/అస్మక: రాజధాని పొదన లేదా పొటన. ఇదే నేటి బోధన్. ఇది షోడష మహాజనపదాల్లోని ఏకైక దక్షిణాది రాజ్యం. ఇది ఆంధ్ర, మహారాష్ట్రలకు విస్తరించింది.
  9. అవంతి: రాజధానులు ఉజ్జయినీ, మహిష్మత
  10. గాంధార: రాజధాని తక్షశిల. ఈ రాజ్యాన్ని పర్షియన్లు ఆక్రమించుకున్నారు.
  11. కాంభోజ: రాజధాని రాజాపుర.
  12. మగధ: రాజగృహ (గిరివ్రజ), పాటలీ పుత్ర రాజధానులు.
  • బుద్ధుని కాలానికి పైన పేర్కొన్న 16 జనపదాల్లో కేవలం నాలుగు రాజ్యాలు మాత్రమే ఉండేవి. అవి.. వత్స, అవంతి, కోసల, మగధ. మిగిలిన రాజ్యాలన్నీ ఈ నాలుగు రాజ్యాల్లో విలీనమైపోయాయి. అయితే క్రీ.పూ. 4వ శతాబ్దాల్లో ఈ నాలుగు రాజ్యాలూ విలీనమై మగధ సామ్రాజ్యం అవతరించింది.

Question: 8

నాలుగు బౌద్ధ మండలి సమావేశ స్థలాలను కాలక్రమానుసారంగా అమర్చండి.
(ఎ) రాజగృహ

(బి) కుందలవణ

(సి) పాటలీపుత్ర

(డి) వైశాలి

  1. ఎ, బి, సి, డి
  2. బి, ఎ, సి, డి
  3. డి, సి, బి, ఎ
  4. ఎ, డి బి, సి
View Answer

Answer: 4

ఎ, డి బి, సి

Explanation:

బౌద్ధ సంగీతలు

  • బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
  • మొదటి బౌద్ధ సంగీతి రాజగృహం అజాతశత్రువు కాలం మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
  • రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
  • మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది అధ్యక్షుడు మొగ్గలిపుతతిస్స.
  • నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.

Question: 9

‘అర్థశాస్త్రం’ ప్రకారం రాజ్యం ‘సప్తంగ’లో భాగం. సరైనదాన్ని గుర్తించండి.

  1. స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ మరియు ధర్మం
  2. స్వామి, జానపద, దుర్గ, కోశ, దండ, మిత్ర మరియు క్షత్ర
  3. స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ మరియు మిత్ర
  4. స్వామి, అమాత్య, తాటక, దుర్గ, కోశ, దండ మరియు మిత్ర
View Answer

Answer: 3

స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ మరియు మిత్ర

Explanation:

  • అర్థశాస్త్రం అనేది ప్రముఖ రాజనీతి గ్రంథం. దీన్ని చంద్రగుప్త మౌర్యుడి ప్రధాని అయిన కౌటిల్యుడు రచించాడు. సంస్కృత భాషలో రాసిన ఈ గ్రంథంలో 6000 శ్లోకాలు, 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 1909లో ఆచార్య శ్యామశాస్త్రి ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఈ గ్రంథం మౌర్యుల పరిపాలనా విధానాన్ని వివరిస్తుంది.
  • రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి? ప్రజల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి? ప్రభుత్వ ఉద్యోగుల విధివిధానాలు, ప్రజాసంక్షేమాన్ని ఎలా సాధించాలి? అనే అంశాలను ఈ గ్రంథంలో వివరించారు.
  • శత్రునిర్మూలనకు, రాజకీయ లక్ష్యాల సాధనకు కఠినమైన నియమాలు అనుసరించాలని, ‘మార్గం కంటే లక్ష్యమే ముఖ్యం’ అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అందుకే ఈయన్ను “భారతీయ మాకియావెల్లీ ”

అర్థశాస్త్రం రాజ్య పరిపాలనకు సప్తాంగా సిద్దాంతము ప్రతిపాదించాడు.

  1. స్వామి – రాజు
  2. అమాత్య – మంత్రి
  3. బల – సైన్యం
  4. దుర్గ – కోట
  5. కోశ – ధనం
  6. రాష్ట్ర – భూభాగం
  7. మిత్ర / శత్రువు – మిత్రుడు / శత్రువు

Question: 10

ఈక్రింది వాటిలో ఏ గ్రంథాన్ని తమిళ భూమి బైబిల్ అని పిలిచేవారు?

  1. తిరుక్కురల్
  2. సిలప్పదికారం
  3. నలదియార్
  4. మణిమేకలై
View Answer

Answer: 1

తిరుక్కురల్

Explanation:

తిరుక్కురళ్:

  • రచయిత- తిరువళ్ళువార్ దీనిని తమిళదేశ బైబిల్గా అభివర్ణిస్తారు.
  • ఇది నాటి జీవన విధానాన్ని, నైతిక విలువలను ప్రతిబింబింపచేసే ఉత్తమ రచన,
  • దీనిని దేశ, విదేశాలలోని అనేక భాషల్లోకి అనువధించారు
Recent Articles