Home  »  TGPSC 2022-23  »  Indian History-3

Indian History-3 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది?

  1. బీహార్, భారతదేశం
  2. రావల్పిండి, పాకిస్తాన్
  3. ఉత్తర ప్రదేశ్, భారతదేశం
  4. ఖాట్మండు, నేపాల్
View Answer

Answer: 2

రావల్పిండి, పాకిస్తాన్

Explanation:

  • పంజాబ్‌లోని సింధు నది తూర్పు ఒడ్డు, తక్షిలా (నేటి పాకిస్థాన్రావల్పిండి )  నగరంలో ఉంది
  • బౌద్ధ అధ్యయన కేంద్రం క్రీస్తుపూర్వం 5-6 శతాబ్దాల నాటిది.
  • ఇది బౌద్ధ సాహిత్యంలో, ముఖ్యంగా జాతకాలలో, గాంధార రాజ్యానికి రాజధానిగా మరియు గొప్ప విద్యా కేంద్రంగా ఉండేది
  • సర్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ 19వ శతాబ్దం మధ్యలో తక్షిలా అవశేషాలను వెలికితీశారు.

 తక్షశిల విశేషాలు:

  •  చాణక్యుడి అర్థశాస్త్రం తక్షశిల వ్రాయబడిందని పేర్కొన్నారు
  • సబ్జెక్ట్‌లు – వేదాలు, వేదాంత, వ్యాకరణ్, ఆయుర్వేదం, శస్త్రచికిత్స, పద్దెనిమిది క్రాఫ్ట్స్ (సిప్పాస్), మిలిటరీ, ఖగోళ శాస్త్రం, వ్యవసాయం, వాణిజ్యం, రాజకీయాలు.
  • ప్రముఖ ఉపాధ్యాయులు – పాణిని, చాణక్య, కుమారలత (సౌత్రాంతిక పాఠశాల వ్యవస్థాపకురాలు
  • జీవక (రాజగృహ ఆస్థాన వైద్యుడు) మరియు చరక(వైద్యం యొక్క భారతీయ పితామహుడు) ఇక్కడ చదువుకున్నట్లు నివేదించబడింది.
  • 1980 లో UNESCOs world heritage site గుర్తింపు పొందింది.

Question: 7

హరప్పా ప్రజలకు ఎవరితో సముద్ర సంబంధాలు ఉండేవి:

  1. సమర్ ఖండ్
  2. శ్రీలంక
  3. మెసొపొటేమియా
  4. మలయా
View Answer

Answer: 3

మెసొపొటేమియా

Explanation:

హరప్పా ప్రజల వ్యాపారం లేదా వాణిజ్యం

  • అంతర్గత వ్యాపారాన్ని ఎడ్ల బండి సహాయంతో నిర్వహించేవారు. ఎడ్ల బండ్లను ‘ఎక్కా’ అని పిలిచేవారు. విదేశీ వ్యాపారాన్ని ఓడల సహాయంతో నిర్వహించేవారు.
  • నాటి అంతర్జాతీయ ఓడరేవులు: లోథాల్ ,బాలకోట్, సుర్కొటోడాలు
  • పర్షియన్ గల్ఫ్ ముద్రిక లోథాల్లో లభ్యమైంది.
  • పర్షియన్ గల్ఫ్ సింధు నాగరికత ముద్రికలు లభ్యమైన ప్రదేశం : సైలక కొలత ప్రమాణాలు
  • వీరు తూనికలకు త్రాసును ఉపయోగించేవారు. కొలతలను దశాంశ పద్ధతి ఉపయోగించారు. ప్రమాణం : 16 (16-ఒక యూనిట్). తూనికలకు ఆల్బస్టార్ అనే రాయిని ఉపయోగించారు.
  • వీరు ప్రధానంగా ఎగుమతి చేసే వస్తువులు : ఆహార ధాన్యాలు, పత్తి, ఏనుగు దంతాలు, ఆభరణాలు, పూసలు,రంగురాళ్ళు, మిరియాలు, దూదితో చేసిన వస్త్రాలు మొదలైనవి.
  • మెసపటోమియా, ఈజిప్టు దేశాలకు పై సరుకులను ఎగుమతి చేసేవారు.

Question: 8

జాబితాలోని అంశాలను జాబితా-1లో ఉన్నవాటితో సరిపోల్చి, కింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

జాబితా-1 (ప్రదేశం)

ఎ. కాళీభంగన్

బి. చన్హుదారు

సి. రోపర్

డి. అలంగీపూర్

జాబితా – 2 (నది)

1. సట్లేజ్ నది

2. ఇండస్ సింధు నది

3. సింధు నది

4. ఘగ్గరర్ నదీ

  1. A-1, B-2, C-5, D-3
  2. A-4, B-3, C-1, D-2
  3. A-1,B-3,C-5, D-4
  4. A-4, B-2.C-3. D-1
View Answer

Answer: 2

A-4, B-3, C-1, D-2

Explanation:

కాళీభంగన్ (శ్రీ గంగాపూర్ జిల్లా, రాజస్థాన్) నది :

  • ఘగ్గర్ (సరస్వతి) కాళీభంగన్ అనగా నల్లగాజులు అని అర్థం.ఇది గాజుల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం. ఇక్కడ దుర్గంతో పాటు నగరం మొత్తానికి ప్రహారి గోడ కలదు.ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించిన గుర్తులు లభ్యమైనాయి. భూమిని దున్నిన ఆధారం (నాగలి గుర్తులు) లభించాయి .ఇక్కడ తందూరి పొయ్యిలను కనుగొన్నారు.
  • నోట్: ఇది భారతదేశంలో రొట్టెల తయారీకి 5000 సంవత్సరాల చరిత్ర ఉందని సూచిస్తుంది.
  • ఒంటె అవశేషాలు, ఇటుకలతో నిర్మించిన సమాధుల ఆనవాళ్ళు లభించాయి.

చన్హుదారో

  • ప్రదేశం: చన్హుదారో, సింధ్ రాష్ట్రం, పాకిస్తాన్
  • నది : సింధు, మూడుసార్లు వరదలకు గురైన నగరం.ఈ నగరాన్ని భారతదేశ లాంకైషైర్ గా పేర్కొంటారు. ఇది దుర్గం లేని ఏకైక నగరం. (కోట గోడ లేని ఏకైక నగరం) పూసల తయారికీ ప్రసిద్ధి చెందిన నగరం – చనుదారో (పారిశ్రామిక పట్టణం) రాగితో తయారైన ఇనుప పరికరాలు ఇచట లభించినవి. ఇక్కడ ఇంక్ బాటిల్ను పోలిన మట్టి పాత్ర లభ్యమైంది. పిల్లికి సంబంధించిన ఆధారాలు లభించినవి. భూగర్భ మురికి నీటి వ్యవస్థ గల నగరం. చన్హుదారోను బొమ్మల కేంద్రంగా పిలుస్తారు. టెర్ర కోట ఎద్దుల బండి, కంచు బొమ్మ బండి, నటరాజ విగ్రహం, లిఫ్ స్టిక్ లభించినవి.

రోపార్

  • ప్రదేశం: రూపనగర్ బారా జిల్లా, పంజాబ్, స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత్లో బయటపడిన మొదటి నగరం. ఇక్కడ కుండల తయారీ ఆనవాళ్ళు లభించాయి. మనిషి శవంతో పాటు కుక్కను కూడా సమాధి చేయడం రోపార్ ప్రత్యేకత

అలంఘిర్పూర్

  • ఇది ఉత్తరప్రదేశ్లో బయటపడినది. ఇది హరప్పా నాగరికత పరిణితి దశకు చెందినది.
  • ఇది సింధు నాగరికతకు తూర్పు సరిహద్దున గల నగరం

Question: 9

ఈ క్రింది చైనా యాత్రికుల్లో గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికులు ఎవరు?

  1. ఫాహిన్
  2. హ్యూయెన్ త్సాంగ్
  3. ఇట్సింగ్
  4. హ్వులి
View Answer

Answer: 1

ఫాహిన్

Explanation: 

పాహియాన్ :

  • క్రీ॥శ॥ 405లో చైనాయాత్రికుడు పాహియాన్ గుప్తసామ్రాజ్యాన్ని దర్శించాడు.
  • పాహియాన్ 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు.
  • ఇతని రచన : ఫో-కి-యో-కి (బౌద్ధ రాజ్యాల చరిత్ర)
  • ఈ పుస్తకంలో గుప్తుల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలను పేర్కొన్నాడు.
  • పాటలీపుత్రంలోని అశోకుని నిర్మాణాలు దేవతా నిర్మాణాలని పాహియాన్ కీర్తించాడు

Question: 10

జాబితా-1లోని అంశాలను జాబితా-2లోని అంశాలతో సరిపోల్చండి. మరియు దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
జాబితా -1
ఎ. బాణభట్ట

బి. వాక్పతి

సి. బిల్హణ

డి. కల్హణ

జాబితా-2

1. రాజతరంగిణి

2. విక్రమంకదేవ చరిత

3. గౌడవాహ

4. హర్ష చరిత

  1. A-1, B-2, C-3, D-4
  2. A-3, B-1, C-4, D-2
  3. A-4, B-3, C-2, D-1
  4. A-2, B-4, C-1, D-3
View Answer

Answer: 2

A-3, B-1, C-4, D-2

Explanation: 

బాణభట్టుడు

  • ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. యితడు నేటి బీహారు రాష్ట్రం ఛాప్రా జిల్లా ప్రీతికూట గ్రామంలో జన్మించాడు. ఇతడు హర్షవర్ధనుడు ఆస్థాన కవిగా గౌరవించబడ్డాడు. సా.శ.7 వ శతాబ్దములో నివసించాడు. కాదంబరి, హర్షచరిత్ర గ్రంథాలను రచించాడు. ఇవే కాకుండా చండికా శతకము, పార్వతీ పరిణయం అనే నాటకాన్ని కూడా రచించాడు

వాక్పతి

  • గౌడవహో : యశోవర్మన్ 8వ శతాబ్దం ప్రారంభంలో కన్నుయాజ్‌ను పరిపాలించాడు. బెంగాల్, బీహార్, పశ్చిమ దక్కన్, కాశ్మీర్ మరియు సింధు లోయలపై అతని జీవితం, పాలన మరియు విజయానికి సంబంధించిన చాలా సమాచారం వాక్పతి స్వరపరిచిన గౌడవాహో నుండి తీసుకోబడింది.

కల్హణుడు

  • రాజతరంగిణి భారతదేశంలోని కాశ్మీర్‌లో 1148-50లో స్వరపరచబడింది.
  • కవి, కల్హణ, ప్రాచీన భారతీయ బ్రాహ్మణుల తరగతికి చెందినవాడు.
  • రాజతరంగిణి అనేది పురాతన కాశ్మీర్ రాజ్యాన్ని దాని పౌరాణిక మూలాల నుండి కవి కాలం వరకు పాలించిన అనేక రాజ వంశాల వృత్తాంతం.

బిల్హణుడు

  • పశ్చిమ చాళుక్య సామ్రాజ్య రాజు విక్రమాదిత్య  బిల్హణుణ్ణి  విద్యాపతిగా నియమించాడు. బిల్హణుడు  అతని గౌరవార్థం ఒక పురాణ విక్రమంకదేవచరితాన్ని రచించడం ద్వారా అతని పోషకుడికి బహుమతిగా ఇచ్చాడు
Recent Articles