Home  »  TGPSC 2022-23  »  Indian History-8

Indian History-8 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సత్యశోధక్ సమాజ్…….చే స్థాపించబడింది.

  1. జ్యోతిరావు పూలే
  2. శ్రీ నారాయణ గురు
  3. హరిదాస్ ఠాకూర్
  4. కేషబ్ చుందర్ సేన్
View Answer

Answer: 1

జ్యోతిరావు పూలే

Explanation:

సత్యశోధక్ సమాజం (1873) :

  • ప్రారంభించినది – జ్యోతిబాపులే (జ్యోతిబా గోవిందరావు పూలే)
  • ఈయన రచించిన గ్రంథం – గులాంగిరి (1872)
  • సత్యశోధక్ సమాజం తమాషా జానపదనాటకం ద్వారా తన భావాలను ప్రచారం చేసింది.
  • పూలే ప్రారంభించిన పత్రిక – ధీనబంధు. ఈయన బాలికల కోసం ఒక విద్యాలయాన్ని ప్రారంభిం చాడు. సత్యశోధక్ సంస్కరణ ఉద్యమానికి కొల్హాపూర్ రాజు మద్దతునిచ్చాడు.
  • పూలే 1884లో దీనబంధు సర్వజనిక్సభ స్థాపించారు.
  • పూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలసి పూనే వద్ద వెనుబడిన వర్గాల వారి కోసం ఒక పాఠశాలను డా ఏర్పాటు చేసాడు.

Question: 7

ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను ఎవరు స్థాపించారు?

  1. థామస్ బాబింగ్టన్ మెకాలే
  2. చార్లెస్ వుడ్
  3. జేమ్స్ మిల్
  4. విలియం జోన్స్
View Answer

Answer: 4

విలియం జోన్స్

Explanation:

  • విలియం జోన్స్ (1746-1794) ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం యొక్క ప్రతిపాదనకు ప్రసిద్ధి చెందిన బ్రిటీష్ భాషా శాస్త్రవేత్త మరియు న్యాయవాది.
  • భారతదేశంలో, ముఖ్యంగా సంస్కృతంతో ఆయన చేసిన కృషి తులనాత్మక భాషాశాస్త్రానికి పునాది వేసింది.
  • అతను ఓరియంటల్ అధ్యయనాలను ప్రోత్సహిస్తూ ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను కూడా స్థాపించాడు.

Question: 8

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారంగా (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి?

ఎ. మహమ్మదీయ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాలను సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు.
బి. మొదటి సింగ్ సధలు అమృత్ సర్ లో ఏర్పడ్డాయి.
సి. బెనారస్ లో హిందూ కళాశాల స్థాపించబడింది.
ఎంపికలు :

  1. ఎ, బి, సి
  2. బి, ఎ, సి
  3. బి, సి, ఎ
  4. సి, బి, ఎ
View Answer

Answer: 4

సి, బి, ఎ

Explanation:

సర్సయ్యద్ అహ్మద్ఖాన్ (1817-1898):

  • ముస్లింల సంస్కరణల కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి “సర్సయ్యద్ అహ్మదాఖాన్”
  • ముస్లిం స్త్రీలలో పరదా పద్దతిని వ్యతిరేకించాడు.
  • ముస్లిం పిల్లల కోసం స్థాపించిన విద్యాసంస్థలు : 1859 గుల్షన్ స్కూల్ – మురాదాబాద్,
  • 1863 విక్టోరియా స్కూల్-ఘాజీపూర్ 1857లో తిరుగుబాటుకు సంబంధించి ‘ధ కాజిస్ ఆఫ్ ఇండియాన్ మ్యూనిటి’ అనే గ్రంథం వ్రాసాడు.
  • ముస్లింల అభివృద్ధికి విద్య అతిముఖ్యమైనది అని భావించి 1875లో అలీఘడ్ లో మహ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1877లో ఇది కళాశాలగా మారింది.
  • 1916 తర్వాత ఇది అలీఘడ్ విశ్వవిద్యాలయంగా మారింది.
  • నోట్: ధ్యాన్చంద్ (హాకీ), జాకీర్ హుసేన్ (మాజీరాష్ట్రపతి), షేక్అబ్దుల్లా (కాశ్మీర్ మాజి ముఖ్యమంత్రి) తదితరులు ఈ విశ్వవిద్యాలయా పూర్వ విద్యార్థులు.
  • అలీఘర్లో లో ఇతను ప్రారంభించిన ఈ పాఠశాల విద్యను ‘అలీఘర్ ఉద్యమం॥ అని పేర్కొంటారు.

  హిందూ కళాశాల

  • పురాతన సంస్కృత గ్రంథాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1791లో  హిందూ కళాశాల  స్థాపించబడింది.
  • శ్రీజోనాథన్ డంకన్ మరియు గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్‌వాలిస్ సంస్కృత కళాశాలను స్థాపించారు.
  • జోనాథన్ డంకన్భారతీయ విద్యకు బ్రిటీష్ మద్దతును ప్రదర్శించేందుకు సంస్కృత వాంగ్మయను అభివృద్ధి చేయడానికి మరియు సంరక్షించేందుకు సంస్కృత కళాశాలను స్థాపించాలని సూచించారు.
  • హిందూ కళాశాల, ఇప్పుడు ప్రెసిడెన్సీ యూనివర్శిటీ అని పిలుస్తారు, ఇది కలకత్తాలోని ప్రభుత్వ రాష్ట్ర విశ్వవిద్యాలయం.
  • ఇది 1817వ సంవత్సరంలో స్థాపించబడింది

Question: 9

క్రింద ఇవ్వబడిన ప్రసంగాన్ని ఎవరు ఇచ్చారు?
“చాలా సంవత్సరాల క్రితం మేము విధితో ఒక ప్రయత్నం చేసాము, ఇప్పుడు మన ప్రతిజ్ఞను పూర్తిగా లేదా పూర్తి స్థాయిలో కాకుండా చాలా గణనీయంగా పునరుద్ధరించే సమయం వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారతదేశం జీవితం, స్వాతంత్య్రం కోసం మేల్కొంటుంది.

  1. జవహర్ లాల్ నెహ్రూ
  2. మహాత్మా గాంధీ
  3. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్
  4. బిఆర్ అంబేద్కర్
View Answer

Answer: 1

జవహర్ లాల్ నెహ్రూ

Explanation:

  • జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగంలోని అంశాలు “విధితో ప్రయత్నించండి” (TRYST OF DESTINY)  భారత స్వాతంత్ర్య సందర్భంలో స్వేచ్ఛ మరియు బాధ్యత.
  • ‘ట్రైస్ట్ ఆఫ్ డెస్టినీ’గా పిలువబడే ఈ ప్రసంగం 1947 ఆగస్టు 15న బ్రిటన్ నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజున అందించబడింది.
  • తన ప్రసంగం అంతటా, అతను భారతీయ ప్రజల శక్తి గురించి మరియు భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడంలో తనకు మరియు భారతదేశం యొక్క ఎన్నికైన శాసనసభకు కలిగి ఉన్న బాధ్యతలను చాలా ప్రస్తావించాడు.

Question: 10

భారతదేశంలో బ్రిటిష్ పాలనలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం______లో జరిగింది.

  1. లండన్
  2. బొంబాయి
  3. కలకత్తా
  4. మాంచెస్టర్
View Answer

Answer: 1

లండన్

Explanation:

మొదటి రౌండ్ టేబుల్ సమావేశము

  • (1930 నవంబర్  – 1931 జనవరి ) : ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బ్రిటీష్ ప్రధాని – రామ్ సె మెక్ డొనాల్డు. ఈ సమావేశం లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగింది.
  • కాంగ్రెస్ పార్టీ ఈ సమా వేశంలో పాల్గొనలేదు.
  • ఈ సమావేశానికి హాజరైనవారు :
  • గాంధీ-ఇర్విన్ ఒడంబడిక :
  • 1931 మార్చి 5న ఢిల్లీలో “గాంధీ-ఇర్విన్ ఒడంబడిక” జరిగినది. దీనికి మధ్యవర్తులు – తేజ్ బహదూర్ సప్రూ, శివనాధశాస్త్రి, ఎమ్.ఆర్ జయకర్.

2వ రౌండ్ టేబుల్ సమావేశం (1931 సెప్టెంబర్) :

  • ఈ సమావేశానికి గాంధీజీ హాజరైనారు. సరోజినీ నాయుడు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. గాంధీజీ హాజరైన ఏకైక రౌండ్ టేబుల్ సమావేశం ఇదే. గాంధీజీ తిరిగి ఇండియా వచ్చి శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1932 జనవరిలో పున: ప్రారంభించాడు. గాంధీని అరెస్ట్ చేసి పూనెలోని ‘ఎరవాడ’ జైలులో ఉం చారు.
  • 1932 ఆగస్టు 17న ప్రధాని రామ్ మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు.
  • ఈ అవార్డులో ‘దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం జరిగింది. దీనిని నిరసనగా గాంధీ పూనాలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టినాడు.
  • 1932లో గాంధీజీ, అంబేద్కర్ల మధ్య “పూనా ఒడంబడిక” జరిగింది. కమ్యూనల్ అవార్డు దళితు లకు 71 సీట్లను రిజర్చేసింది. కానీ పూనా ఒడం బడిక ప్రకారం దళితులకు 148 స్థానాలు ఇవ్వడం జరిగినది
  • మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మాత్రమే పాల్గొన్నది.

3వ రౌండ్ టేబుల్ సమావేశం:

  • లండన్లో 1932 నవంబర్ – డిశంబర్లో జరిగింది. ఇందులోకూడా కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించలేదు.మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి – డా॥ బి.ఆర్.అంబేద్కర్
Recent Articles