Home  »  TGPSC 2022-23  »  Indian History-8

Indian History-8 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

అవధ్ రాజ్యాన్ని “ఒక రోజు మన నోటికి వచ్చే చెర్రీ” అని ఎవరు వర్ణించారు?

  1. లార్డ్ డల్హౌసి
  2. లార్డ్ విలియం బెంటింక్
  3. చార్లెస్ కార్న్ వాలిస్
  4. లార్డ్ రిప్పన్
View Answer

Answer: 1

లార్డ్ డల్హౌసి

Explanation:

  • క్రీ.శ. 1857లో జరిగిన తిరుగుబాటు కేంద్రాల్లో ‘అయోధ్య’ అతిముఖ్యమైంది.
  • ఇక్కడి తిరుగుబాటుకు ముఖ్య కారణం క్రీ.శ. 1856 ఫిబ్రవరి నెలలో లార్డ్ డల్హౌసీ అయోధ్య రాజు పరిపాలన సరిగ్గా నిర్వహించడం లేదనీ, శాంతిభద్రతలు క్షీణించాయి అనే నెపంతో రాజ్యాన్ని అయోధ్యను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.
  • స్థానిక ప్రజలు తమ రాజును, అతని కుటుంబాన్ని ఫిరంగి పాలకులు అవమానపరిచిన విధానాన్ని జీర్ణించుకోలేకపోయాయి.
  • కేవలం ఇక్కడిసిపాయిలేగాక అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా బ్రిటిష్వారి ఆధీనంలో బందీగా ఉన్న నవాబ్ వజీత్-అలీ-షా భార్యయైన బేగం హజరత్ మహల్, ప్రముఖ మత పెద్ద మౌల్వీ ‘అహ్మదుల్లాషా’ నేతృత్వంలో తిరుగుబాటును నడిపారు.
  • మే 31, 1857 నుంచి జూన్ నెల వరకు ఇరుపక్షాల మధ్య తీవ్రపోరు జరిగింది.
  • ఆగస్టు క్రీ.శ. 1857లో బేగం హజరత్ మహల్ తన మైనర్ కుమారుడిని నవాబ్ ప్రకటించింది. తిరుగుబాటు దార్ల మద్దతుతో పాలన కొనసాగించింది.
  • సెప్టెంబర్ 1857 నుంచి బ్రిటిష్ సేనలు ‘హేవ్లాక్’ నేతృత్వంలో అయోద్యలోని తిరుగుబాటును అణచివేయడానికి అన్ని రకాల ప్రయత్నించారు. జనరల్ నీల్ కూడా సిపాయిలతో చంపబడ్డాడు.
  • చివరకు ‘కొలిన్కాంప్బెల్’ నేతృత్వంలో నవంబర్, 1857లో బ్రిటిష్ సేనలు అయోధ్య చేరాయి.
  • ఇతనికి తోడుగా జనరల్ ఫ్రాంక్స్ దళం, జనరల్ ఔట్రాంసైన్యాలు, జంగ్ బహదూర్ గుర్ఖా సైన్యం ఐక్యంగా తిరుగుబాటుదార్ల సైన్యాలతో పోరాడాయి.
  • మార్చి 21, 1858 నాటికి లక్నో బ్రిటిష్ వారి స్వాధీనమైంది. అయోధ్య (లక్నో) తిరుగుబాటు చరిత్ర పుటల్లో శాశ్వత కీర్తి పొందింది.

Question: 12

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారంగా (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి?

ఎ.అల్లూరి సీతారామరాజును అరెస్టు చేశారు.
బి. ‘పూర్ణ స్వరాజ్’ డిమాండు కాంగ్రెస్ స్వీకరించింది.
సి. బి.ఆర్. అంబేద్కర్ అణగారిన తరగతుల సంఘాన్ని స్థాపించారు.
ఎంపికలు :

  1. ఎ, బి, సి
  2. బి, ఎ. సి
  3. సి, బి, ఎ
  4. ఎ, సి, బి
View Answer

Answer: 1

ఎ, బి, సి

Explanation:

  • రంప తిరుగుబాటు 1922 మరియు 1924 సంవత్సరాల మధ్య జరిగింది. అల్లూరి మరియు అతని మనుషులు అనేక పోలీసు స్టేషన్లపై దాడి చేసి అనేక మంది బ్రిటీష్ అధికారులను హతమార్చారు మరియు వారి యుద్ధం కోసం ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని దొంగిలించారు.
  • 1924 మే 7న స్వాతంత్య్ర సమరయోధుడు, ‘రంప తిరుగుబాటు’ నాయకుడు అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ వారి చేతిలో హతమయ్యాడు.
  • బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ పొందిన అతను బ్రిటీష్ వారి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటానికి రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు
  • 1929 లాహోర్ 44వ INC సమావేశం – ఈ సమావేశంనకు లాలాలజపతిరాయ్ నగర్ సమావేశమని పేరు. అధ్యక్షుడు – నెహ్రూ
  • ఈ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడినది. ఈ సమావేశానికి మొదటిసారిగా ఖాన్ అబ్దుల్గపూర్ ఖాన్ హాజరు అయినాడు.
  • త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా జవహార్లాల్ నెహ్రూ లాహోర్ నందు ఎగురవేశాడు.

 ప్రతి సం|| జనవరి 26ను స్వాతంత్య్రదినంగా జరుపుకోవాలని తీర్మానించారు.

  • 1932లో అఖిల భారత అణగారిన తరగతుల సంఘం నాగ్‌పూర్‌లో స్థాపించబడింది, దాని మొదటి ఎన్నికైన అధ్యక్షుడిగా M. C. రాజా ఉన్నారు.
  • అఖిల భారత అణగారిన తరగతుల సంఘం అణగారిన తరగతులకు ప్రత్యేక ఓటర్లు కావాలని అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను అంగీకరించలేదు.

Question: 13

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారంగా (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి?

ఎ. చంపారన్ సత్యాగ్రహం
బి. రౌలట్ సత్యాగ్రహం
సి. అహ్మదాబాద్ మిల్లు-వర్కర్స్ సత్యాగ్రహం
ఎంపికలు :

  1. ఎ, బి, సి
  2. బి, ఎ, సి
  3. బి, సి, ఎ
  4. సి, బి, ఎ
View Answer

Answer: 1

ఎ, బి, సి

Explanation:

చంపారన్ ఉద్యమం

  • బీహార్ లో చంపారన్ గ్రామంలో 1917లో నీలిమందు తోట యజమానులకు వ్యతిరేకంగా నీలిమందు రైతులు ఉద్యమం చేశారు.
  • ఇది 1917లో గాంధీజీ ఇండియాలో మొట్టమొదటిసారిగా సత్యాగ్రహం చేపట్టిన ఉద్యమం ఇది గాంధీజీ చేపట్టిన మొదటి ఉద్యమం
  • ఈ ఉద్యమం వలన ప్రభుత్వం తీనతియా విధానంను రద్దు చేసింది. 1917 ఏప్రిల్ 18న మొదటిసారి గాంధీజీ. చంపారన్లో అరెస్టయినారు.

మిల్లు కార్మికుల కోసం ఉద్యమం

  •  1918లో అహ్మదాబాద్ లో  మిల్లుకార్మికుల వేతనాల పెంపుకోసం సత్యాగ్రహాన్ని నిర్వహించారు.
  • సమయంలోనే గాంధీజీ మొదటిసారి ఆమరణ నిరాహారదీక్ష చేసారు.

రౌలత్ చట్టం – 1919:

  • మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమలులో ఉన్న అత్యవసర చట్టాలను కొనసాగించి భారతదేశంలో జాతీయ వాదులను అణచివేయాలని నిర్ణయించిన బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్ సిడ్నీ రౌలత్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
  • ఈ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టం రూపొందించబడింది. దీనినే నల్ల చట్టమని కూడా పిలుస్తారు. పోలీసులకు అపరిమిత అధికారాలు ఇవ్వడం జరిగింది.
  • ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహం చేపట్టారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6న హర్తాళ్ కు  పిలుపునిచ్చాడు.

Question: 14

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారంగా (మొదటి నుంచీ చివరి వరకు) అమర్చండి?

ఎ. ఇన్ ల్యాండ్ ఎమిగ్రేషన్ చట్టం ఆమోదించబడింది.

బి. రౌలత్ చట్టం ఆమోదించబడింది.

సి. మింటో-మోర్లే సంస్కరణలు.
ఎంపికలు :

  1. ఎ, బి, సి
  2. బి, ఎ, సి
  3. బి, సి, ఎ
  4. సి, బి, ఎ
View Answer

Answer: 1

ఎ, బి, సి

Explanation:

  • 1859లో ఇన్‌ల్యాండ్ ఎమిగ్రేషన్ చట్టం ఆమోదించబడింది, దీని ప్రకారం అనుమతి లేకుండా కార్మికులను తేయాకు తోటలలోకి అనుమతించరు.
  • బ్రిటిష్ అధికారులు తేయాకు తోటలను విడిచిపెట్టడానికి అటువంటి అనుమతి ఇవ్వడం లేదు.
  • తేయాకు తోటలలో కార్మికులను నిలువరించడానికి మరియు అస్సాంలోని వారి గ్రామాలకు తిరిగి వెళ్లకుండా ఉండటానికి బ్రిటిష్ అధికారం ఈ చట్టాన్ని ఆమోదించింది.

భారత కౌన్సిళ్ళ చట్టం (1909)

  • ఈ చట్టం అప్పటి వైస్రాయి, గవర్నర్ జనరల్ లార్డ్ మింటో (Lord Minto), భారతీయ వ్యవహారాల కార్యదర్శి లార్డ్ జాన్మోర్లీ (Lord John Morley) ల చొరవతో రూపొందింది.
  • అందువల్లనే ఈ చట్టం మింటో మార్లీ సంస్కరణల చట్టం (Minto-Morley Reforms Act)గా ప్రఖ్యాతి పొందింది. ఈ చట్టంలో సంస్కరణలు చేపట్టడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి.
  • వీటిలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి, కౌన్సిళ్ళలోభారతీయులకు ప్రాతినిధ్యం కోసం మితవాద నాయకుల డిమాండ్లు, రాజకీయ సర్దుబాటు – ప్రాతినిధ్యం కోసం ముస్లింలనుంచి డిమాండ్లు, భారత జాతీయోద్యమం విస్తృతమై అతివాద దశలోకి ప్రవేశించడం మొదలైన కారణాలు ఉన్నాయి.

రౌలట్ చట్టం (1919) అనేది బ్రిటిష్ వలస చట్టం

  •   విచారణ లేకుండా నిరవధిక నిర్బంధం వారెంట్ లేకుండా అరెస్టు న్యాయ సమీక్ష లేకుండా జైలు శిక్షఇది భారతదేశం యొక్క పెరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, కానీ విస్తృతమైన నిరసనలకు దారితీసింది, జలియన్ వాలాబాగ్ మారణకాండకు దారితీసింది మరియు భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి ఆజ్యం పోసింది.

Question: 15

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారంగా (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి?

ఎ. బొంబాయి దక్కన్ లో మొదటి రెవెన్యూ పరిష్కారం.

బి. బొంబాయి దక్కన్ లో వ్యవసాయ విస్తరణ నెమ్మదిగా సాగుతోంది.

సి. దక్కన్ గ్రామాలలో అల్లర్లు తిరుగుబాటు.
ఎంపికలు :

  1. ఎ, బి, సి
  2. బి, ఎ, సి
  3. బి, సి, ఎ
  4. సి, బి, ఎ
View Answer

Answer: 1

ఎ, బి, సి

Recent Articles