Home  »  TGPSC 2022-23  »  Indian History-9

Indian History-9 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో, ప్రణాళికా సంఘం………లో ఏర్పాటు చేయబడింది.

  1. 1950
  2. 1952
  3. 1954
  4. 1956
View Answer

Answer: 1

1950

Explanation: 

ప్రణాళికా సంఘం (Planning Commission)

  • ప్రారంభం : 1950 మార్చి 15, రద్దు : 2014 ఆగస్టు 13 (దీని స్థానంలో 2015 లో నీతి ఆయోగ్ ఏర్పాటు)
  • ప్రధాన కేంద్రం : యోజన భవన్ (న్యూఢిల్లీ)

నిర్మాణం :

  1. ఛైర్మన్ (అధ్యక్షుడు) – భారత ప్రధానమంత్రి
  2. వైస్ చైర్మన్ (ఉపాధ్యక్షుడు) – డిప్యూటీ ఛైర్మన్ (వాస్తవ కార్యనిర్వహణ అధికారి)
  3. సభ్యులు :
  • పదవిరీత్యా కేంద్ర ఆర్థిక శాఖామంత్రి, కేంద్ర ప్రణాళికా మంత్రి
  • పూర్తి కాల సభ్యులు (4 నుండి 7 మంది)
  • ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి)
  • తాత్కాలిక సభ్యులు ఇందులో ఉండరు.

ప్రణాళిక సంఘం విధులు :

  1. దేశంలో సహజ వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులను అంచనా వేసి ప్రణాళికలను రూపొందిస్తుంది.
  2. ప్రణాళికల యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
  3. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికా నిధులను సమకూరుస్తుంది.
  4. ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా గల కారణాలను గుర్తించి, వాటిని నిర్మూలించడానికి తగిన మార్గాలను సూచిస్తుంది.

Question: 7

సోషలిస్టు సమాజానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. సమాజ అవసరాలకు అనుగుణంగా ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
బి. ఉత్పత్తి చేయబడిన వస్తువులు కొనుగోలు శక్తి ఆధారంగా ప్రజల మధ్య పంపిణీ చేయబడతాయి.
ఎంపికలు : 

  1. ఎ మాత్రమే
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు.
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation: 

  • సామ్యవాద తరహా ఆర్ధిక వ్యవస్థ (Socialist Economy):  ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ మరియు ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రైవేట్ రంగం కంటే ఎక్కువగా
  • ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉంటే అలాంటి ఆర్థిక వ్యవస్థను “సామ్యవాదతరహా ఆర్ధిక వ్యవస్థ” అంటారు.
  • మార్కెట్ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ కారల్ మార్క్స్ (1818-1883) ప్రతిపాదించిన సిద్ధాంతాల ఆధారంగా సామ్యవాదతరహా ఆర్థిక వ్యవస్థ రూపొందించబడింది. దీనినే “ప్లానింగ్ మెడల్”,

State Economy, Command Economy, Centrally Planned Economy.

సామ్యవాద తరహా ఆర్ధికవ్యవస్థ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  1. ప్రజలందరి బాగోగులకోసం దేశంలోని వనరులు ఉపయోగించబడాలి.
  2. వనరులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండి, ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రభుత్వ రంగం నిర్వర్తిస్తుంది.

Question: 8

శాంతినికేతన్ సంస్థను ప్రారంభించినవారు ఎవరు?

  1. బిపిన్ చంద్ర పాల్
  2. రవీంద్రనాథ్ ఠాగూర్
  3. అరబిందో ఘోష్
  4. స్వామి వివేకానంద
View Answer

Answer: 2

రవీంద్రనాథ్ ఠాగూర్

Question: 9

హెన్రీ డెరోజియో ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నాడు?

  1. యంగ్ బెంగాల్ ఉద్యమం
  2. హోమ్ రూల్ లీగ్
  3. ఆర్య సమాజం
  4. రామకృష్ణ మిషన్
View Answer

Answer: 1

యంగ్ బెంగాల్ ఉద్యమం

Explanation: 

హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో

  • బిరుదు – భారతదేశ మొట్టమొదటి జాతీయ కవి.
  • బెంగాల్ లో young Bengal movement 1824 లో ప్రారంబించాడు

దీని లక్ష్యాలు :

  1. ప్రజల హక్కుల కొరకు పాటుపడుట.
  2. మూఢ నమ్మకాలను రూపుమాపుట
  3. విజ్ఞానాన్ని అందించుట.
  4. బ్రిటీష్ కాలనీ లో భారతీయ కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించాలి.
  5. జమిందార్ల నుండి రైతులకి రక్షణ కల్పించాలి.
  6. ఉన్నత సేవారంగాలలో పారిశ్రామికీకరణ ప్రవేశపెట్టాలి.
  • కొన్ని లక్షల మంది బెంగాలీలు ఈ ఉద్యమంలో చేరి బెంగాల్ సంస్కృతిని వ్యాప్తి చేశారు.

వార్తాపత్రికలు:

  • ఈస్ట్ ఇండియన్, The Inquirer,సయీద్ సిరీస్, హెస్పరెస్, The quill,కలకత్తా గెజిట్ఇం, డియా గెజిట్

Question: 10

కింది వాటిలో 1878లో భారతదేశంలో ఆమోదించబడిన చట్టాలు ఏవి?
ఎ. ఆయుధాల చట్టం

బి. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి రెండూ
  3. కేవలం బి
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 3

కేవలం బి

Explanation: 

వెర్ణాకులర్ ప్రెస్ యాక్ట్

  • ఈ చట్టాన్ని అప్పటి భారత వైస్రాయ్ లిట్టన్ ప్రతిపాదించారు. వైస్రాయ్ కౌన్సిల్ 14 మార్చి 1878న ఏకగ్రీవంగా ఆమోదించింది.
  • ఈ చట్టం ఆంగ్ల భాషా ప్రచురణలను మినహాయించి, ఓరియంటల్ భాషలలోని ప్రచురణలలో ప్రతిచోటా బ్రిటీష్  విద్రోహ రచనలను నియంత్రించడానికి చట్టం చేశారు .
  • దక్షిణ భారత దేశం లో ఈ చట్టాన్ని మినహాయించారు.
  • ఈ చట్ట౦తో అమృత బజార్  పత్రికను నియంత్రించారు . లార్డ్ రిప్పన్ ఈ చట్టాన్ని తొలగించారు
Recent Articles